రాసిపెట్టుకోండి.. 2028 టీ20 వరల్డ్ కప్ ఇండియాదే! ఐర్లాండ్‌తో ఓటమి వెనకున్న సెంటిమెంట్ గురించి తెలుసా?

టీ20 వరల్డ్ కప్ 2026 గెలిచిన తర్వాత టీమిండియా ఐర్లాండ్‌పై ఘోరంగా ఓడిపోవడం క్రికెట్ అభిమానులను నిరాశపరిచింది. అయితే ఇది 2024 వరల్డ్ కప్ తర్వాత జింబాబ్వేపై ఓడిన సెంటిమెంట్‌ను గుర్తుచేస్తుంది. వరల్డ్ కప్ గెలిచాక తొలి టీ20 మ్యాచ్‌లో ఓటమి, కొత్త కెప్టెన్ ఉండటం వంటి ఈ సెంటిమెంట్ రాబోయే టీ20 వరల్డ్ కప్ 2028ను భారత్ గెలుస్తుందని సూచిస్తుంది.

రాసిపెట్టుకోండి.. 2028 టీ20 వరల్డ్ కప్ ఇండియాదే! ఐర్లాండ్‌తో ఓటమి వెనకున్న సెంటిమెంట్ గురించి తెలుసా?
Ind Vs Ire

Updated on: Jun 27, 2026 | 9:40 AM

శుక్రవారం రాత్రి చాలా మంది క్రికెట్ అభిమానులు బాగా హర్ట్ అయి ఉంటారు. ఎందుకంటే.. టీ20 వరల్డ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగిన టీమిండియా పసికూన ఐర్లాండ్ చేతిలో ఘోర ఓటమిని చవిచూసింది. టీ20 క్రికెట్‌కు కొత్త డెఫినేషన్ చెబుతున్న యంగ్ ప్లేయర్లతో ఐర్లాండ్‌కు వెళ్లిన భారత జట్టు.. తొలి మ్యాచ్‌లో ఇంత దారుణ ఓటమి చవిచూస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. అయితే ఈ ఓటమిపై కొంతమంది భారత క్రికెట్ అభిమానులు మాత్రం బాగా సంతోషంగా ఉన్నారు. అదేంటి ఇండియా ఓడిపోతే వాళ్లకు సంతోషం ఎందుకని అనుకుంటున్నారా? దాని వెనుక ఒక సెంటిమెంట్ ఉంది. క్రికెట్‌లో ఉండే చిన్న చిన్న సెంటిమెంట్స్ నమ్మే వాళ్లు ఐర్లాండ్‌పై టీమిండియా ఓటమిని లైట్ తీసుకున్నారు. ఈ ఓటమితో రాబోయే టీ20 వరల్డ్ కప్ 2028 కూడా టీమిండియాదే రాసి పెట్టుకోండి అంటున్నారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

ఈ ఏడాది జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026ను సూర్యకుమార్ యాదవ్‌ కెప్టెన్సీలోని టీమిండియా కైవసం చేసుకొని వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఆ వరల్డ్ కప్ కంటే ముందు 2024లో కూడా టీమిండియాదే కప్పు. రోహిత్ శర్మ కెప్టెన్సీలోని భారత జట్టు టీ20 వరల్డ్ కప్ సాధించి విశ్వవిజేతగా అవతరించింది. అయితే ఆ కప్పు కొట్టిన తర్వాత ఆడిన ఫస్ట్ టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైంది. అది కూడా ఎవరిపై సీనియర్ పసికూన జింబాబ్వేపై. అప్పుడు కూడా ఛేజింగ్ చేస్తూ 116 పరుగులు ఛేజ్ చేయలేక ఓడిపోయింది. అప్పుడు కూడా టీమిండియాకు కొత్త కెప్టెన్ వచ్చాడు, అతనే శుబ్‌మన్ గిల్. పూర్తి స్థాయి టీ20 కెప్టెన్‌గా గిల్‌కు అదే తొలి మ్యాచ్, అలాగే టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఫస్ట్ మ్యాచ్.

మీరు ఒక విషయం గమనిస్తే.. సేమ్ అదే సీన్ ఇప్పుడు కూడా రిపీట్ అయింది. టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఫస్ట్ మ్యాచ్ ఆడుతూ, ఛేజింగ్ చేస్తూ టీమిండియా పసికూనపై ఓడిపోయింది. టీమిండియాకు శ్రేయస్ అయ్యర్ రూపంలో కొత్త కెప్టెన్ వచ్చాడు.. సో దీన్ని బట్టి సెంటిమెంట్ ఏం చెబుతుదంటే.. రాబోయే టీ20 వరల్డ్ కప్ 2028 కూడా టీమిండియా గెలవబోతుందని కొంతమంది నమ్ముతున్నారు. అయితే గిల్ కెప్టెన్‌గా ఫెయిల్ అవ్వడంతో అతని స్థానంలో సూర్యకు టీ20 కెప్టెన్సీ ఇచ్చారు. ఇక్కడ కూడా అలాగే జరుగుతుందా? లేదా అయ్యర్ తన కెప్టెన్సీని టీ20 వరల్డ్ కప్ వరకు నిలబెట్టుకుంటాడా? అనేది చూడాలి. ఎందుకంటే.. తొలి మ్యాచ్‌లో అయ్యర్ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా విఫలం అయ్యాడు. అయితే ఒక్క మ్యాచ్‌తోనే అయ్యర్‌ను తక్కువ అంచనా వేయడం సరికాదు కానీ, చూడాలి మరి టీమిండియా భవిష్యత్తు, కెప్టెన్ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us