టీమిండియా మహిళా జట్టుకు ప్రధాన కోచ్ లేకపోవడంపై వైస్ కెప్టెన్ స్మృతీ మంధాన ఆసక్తికర వ్యాఖలు చేశారు. ప్రధాన కోచ్ లేనప్పటికీ తాము బాగానే ఆడుతున్నామని అన్నారు. ఆటగాళ్లవైపు నుంచి ఆలోచిస్తే.. కోచ్ లేకపోవడం తమకు పెద్ద విషయం కాదన్నారు. క్వాలిటీ క్రికెట్‌ను ఆడగలిగే సత్తా టీమిండియా మహిళా జట్టుకుందని ధీమా వ్యక్తం చేశారు. ఇతర కోచింగ్ స్టాఫ్ అందుబాటులో ఉన్నారని.. వారి సలహాలను సూచనలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. వారిచ్చే సూచనలు తమ ఆటగాళ్లకు ఉపయోగపడుతున్నాయని.. ఒక్కోసారి ఇదే ప్రయోజనంగా ఉంటుందన్నారు. ఎందుకంటే న్యూ కోచింగ్ స్టాఫ్ కొత్త ఆలోచనలతో వస్తారని.. వారు ఇచ్చే ఐడియాస్ చాలా పాజిటివ్‌గా తీసుకుంటే అంతా మనకు మంచిగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఓ మంచి హెడ్ కోచ్‌ను నియమించేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తుందన్నారు. టీమిండియా ఉమెన్స్ జట్టుకు సుదీర్ఘంగా సేవలు అందించే బెస్ట్ కోచ్ కోసం బీసీసీఐ చూస్తుందన్నారు వైస్ కెప్టెన్ స్మృతీ మంధాన.
గతేడాది టీమిండియా ఉమెన్స్ జట్టు కోచింగ్ బాధ్యతల నుంచి మాజీ క్రికెటర్ రమేశ్ పొవార్‌ను బీసీసీఐ తొలగించిన సంగతి తెలిసిందే. అతని స్థానంలో మరో ప్రధాన కోచ్‌ను ఇప్పటి వరకు నియమించలేదు. దీంతో గత ఎనిమిది నెలలుగా ప్రధాన కోచ్ లేకుండానే టీమిండియా ఉమెన్స్ జట్టు మ్యాచ్‌లను ఆడుతోంది. టీ20 ప్రపంచకప్‌లోనూ దూకుడుగానే ఆడుతోంది.
తాజాగా బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా జట్టు ఆడుతోంది. మూడు వన్డేల సిరీస్‌లో 1-1 సమంగా నిలిచిన ఇరు జట్ల మధ్య ఇవాళ మూడో వన్డే జరుగుతోంది.
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం