Gautam Gambhir: అందుకే మిడిల్ ఫింగర్ చూపించా.. వీడియోపై క్లారిటీ ఇచ్చిన గౌతమ్ గంభీర్..

Gautam Gambhir: భారత మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్‌ భారత్-నేపాల్ మ్యాచ్ సందర్భంగా స్టేడియంలోని అభిమానులకు మిడిల్ ఫింగర్ చూపించాడు. ఇప్పుడీ వ్యవహారం సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవతోంది. ఆ వీడియోలో అభిమానులకు గౌతమ్ మిడిల్ ఫింగర్ చూపిస్తూ అసహనం వ్యక్తం చేయడం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వ్యవహారం మరింత వివాదాస్పదం అవడం, తీవ్ర విమర్శలు వ్యక్తమవుతుండటంతో..

Gautam Gambhir: అందుకే మిడిల్ ఫింగర్ చూపించా.. వీడియోపై క్లారిటీ ఇచ్చిన గౌతమ్ గంభీర్..
Gautam Gambhir

Updated on: Sep 05, 2023 | 7:04 AM

Gautam Gambhir: భారత మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్‌ భారత్-నేపాల్ మ్యాచ్ సందర్భంగా స్టేడియంలోని అభిమానులకు మిడిల్ ఫింగర్ చూపించాడు. ఇప్పుడీ వ్యవహారం సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవతోంది. ఆ వీడియోలో అభిమానులకు గౌతమ్ మిడిల్ ఫింగర్ చూపిస్తూ అసహనం వ్యక్తం చేయడం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వ్యవహారం మరింత వివాదాస్పదం అవడం, తీవ్ర విమర్శలు వ్యక్తమవుతుండటంతో.. తాజాగా గౌతమ్ గంభీర్ స్పందించాడు. ఈ వీడియోపై క్లారిటీ ఇచ్చాడు. అసలు విషయం ఏంటో వివరించాడు.

గౌతమ్ గంభీర్ ఏం చేప్పాడంటే..

తాను వెళ్లే సమయంలో మైదానంలో ఉన్న కొందరు పాక్ అభిమానులు భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారని గౌతమ్ గంభీర్ క్లారిటీ ఇచ్చాడు. దానికి తనదైన శైలిలో జవాబిచ్చానని తెలిపాడు. ‘పాక్ అభిమానులు కొందరు.. భారతదేశానికి వ్యతిరేక నినాదాలతో పాటు.. కశ్మీర్ గురించి కూడా నినాదాలు చేస్తున్నారు. అందుకే అలా రియాక్ట్ అయ్యాను. నా స్టైల్‌లో సమాధానం చెప్పాను. ఎవరైనా భారత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేసినా, భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడినా నేను ఖచ్చితంగా స్పందిస్తాను.’ అని భారత మాజీ క్రికెటర్ చెప్పుకొచ్చాడు.

సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో..

అయితే భారత్-నేపాల్ మ్యాచ్ సందర్భంగా అభిమానులకు మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మిడిల్ ఫింగర్ చూపిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానల పట్ల గౌతమ్ గంభీర్ ప్రవర్తనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీ అభిమానులకే గంభీర్ అలా మిడిల్ ఫింగర్ చూపించాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. గతంలోనూ అభిమానుల పట్ల ఇలాగే రియాక్ట్ విషయాన్ని నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు. అహంకారం ప్రదర్శిస్తున్నాడంటూ మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రియాక్ట్ అయిన గౌతమ్ గంభీర్.. వివాదంపై క్లారిటీ ఇచ్చాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..