ఇండియా టీమ్ బస చేసిన హోటల్లో కలకలం!

ఐసీసీ వరల్డ్ కప్‌ 2019లో భాగంగా ఆదివారం నాటి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో టీమిండియా తలడనుంది. విండీస్‌పై గెలుపుతో జోరుమీద ఉన్న ఆటగాళ్లు .. ఇంగ్లీష్ టీమ్‌పైనా విజయం సాధించి పట్టునిలుపుకోవాలని చూస్తున్నారు. మ్యాచ్‌కు ముందు ఓ ఘటన భారతజట్టు ఆటగాళ్లను ఆందోళన పరిచింది. వారు బస చేసిన హ్యాట్ రెజెన్సీలోకి ముగ్గురు వ్యక్తులు ప్రవేశించి.. కాసేపు అందరినీ టెన్షన్ పెట్టేశారు. టెలీగ్రాఫ్ కథనం ప్రకారం.. శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఆటగాళ్లు, వారి కుటుంబ సభ్యుల […]

ఇండియా టీమ్ బస చేసిన హోటల్లో కలకలం!

Edited By:

Updated on: Jun 29, 2019 | 5:07 PM

ఐసీసీ వరల్డ్ కప్‌ 2019లో భాగంగా ఆదివారం నాటి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో టీమిండియా తలడనుంది. విండీస్‌పై గెలుపుతో జోరుమీద ఉన్న ఆటగాళ్లు .. ఇంగ్లీష్ టీమ్‌పైనా విజయం సాధించి పట్టునిలుపుకోవాలని చూస్తున్నారు. మ్యాచ్‌కు ముందు ఓ ఘటన భారతజట్టు ఆటగాళ్లను ఆందోళన పరిచింది. వారు బస చేసిన హ్యాట్ రెజెన్సీలోకి ముగ్గురు వ్యక్తులు ప్రవేశించి.. కాసేపు అందరినీ టెన్షన్ పెట్టేశారు. టెలీగ్రాఫ్ కథనం ప్రకారం.. శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఆటగాళ్లు, వారి కుటుంబ సభ్యుల ప్రైవసీని భగ్నం చేసేలా ఆ ముగ్గురు అనుచితంగా ప్రవర్తించారు. ఆటగాళ్ల గదుల దగ్గర తిరుగుతూ.. వాళ్ల కుటుంబ సభ్యుల ఫొటోలను కూడా తీశారు. దీనిపై ఆగ్రహించిన ఆటగాళ్లు మేనేజ్‌మెంట్‌కు విషయం తెలపగా.. హోటల్ యాజమాన్యాన్ని మేనేజ్‌మెంట్ నిలదీసింది. ముగ్గురు అతిథులకు సీరియస్ వార్నింగ్ ఇవ్వడమే కాకుండా.. ఇకపై ఇలాంటివి జరగకుండా చూస్తామని యాజమాన్యం హామీ ఇచ్చింది.