T20 World Cup 2021: టీ 20 వరల్డ్ కప్ 2021 ముగిసిన వెంటనే టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్, 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత ఒక వారం లోపే ప్రారంభమయ్యే న్యూజిలాండ్ సిరీస్‌లో భారత సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వవచ్చని నివేదికలు వెలువడుతున్నాయి. కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, పేసర్ జస్ప్రీత్ బుమ్రా వంటి అగ్రశ్రేణి భారత ఆటగాళ్లు జూన్‌లో సౌతాంప్టన్‌లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ప్రారంభమైనప్పటి నుంచి ‘బయో బబుల్’ లో ఉంటున్నారు. అయితే ఇంగ్లండ్‌లో ఉన్నప్పుడు కొద్దిగా విశ్రాంతి తీసుకున్నా.. మరలా టీమిండియాలో కరోనా కేసులు పెరగడంతో రూల్స్‌ను మరింత కఠినంగా చేశారు.
పీటీఐ వార్తల ప్రకారం, ‘చాలా మంది సీనియర్ ఆటగాళ్లు కివీస్‌తో జరిగే టీ20 సిరీస్ నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తుంది. అందుచేత ఈసారి యువ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వవచ్చని వార్తలు వెలువడుతున్నాయి. సీనియర్ ఆటగాళ్లు గత నాలుగు నెలల్లో వరుసగా మూడు బయో బబుల్సలో ఉన్నారు. టీ 20 వరల్డ్ కప్ తర్వాత డిసెంబర్ చివరిలో ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు వరకు విరామం తీసుకోవాలని వారు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. కోహ్లీ, బుమ్రా, మహ్మద్ షమీ వంటి ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించారు. ఇంగ్లండ్‌తో జరిగిన హోమ్ సిరీస్ నుంచి స్థిరంగా ఆడుతున్న రోహిత్ శర్మకు కూడా విశ్రాంతి అవసరం. అయితే టీ 20 కెప్టెన్‌గా కోహ్లీ తప్పుకున్న తర్వాత పనిభారం నిర్వహణ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తికరంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో రుతురాజ్ గైక్వాడ్, హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్, వెంకటేష్ అయ్యర్‌లకు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రధాన కోచ్ బాధ్యతను ద్రవిడ్ మరలా తీసుకోనున్నాడా!
న్యూజిలాండ్ సిరీస్‌లో రాహుల్ ద్రవిడ్ తాత్కాలిక కోచ్‌గా ఉంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నెలలో టీ 20 ప్రపంచకప్‌తో రవిశాస్త్రి పదవీకాలం ముగియనుంది. అయితే, జాతీయ క్రికెట్ అకాడమీ చీఫ్ అయిన ద్రవిడ్ వచ్చే ఏడాది జరిగే అండర్ -19 ప్రపంచకప్ కోసం ఒక బ్లూప్రింట్‌ను కూడా సిద్ధం చేయాల్సి ఉంటుంది. సకాలంలో కొత్త కోచ్‌ను నియమిస్తామని బీసీసీఐ (భారత క్రికెట్ బోర్డు) విశ్వసిస్తోంది. నవంబర్ 17, 19, 21 తేదీలలో న్యూజిలాండ్‌తో జైపూర్, రాంచీ, కోల్‌కతాలో భారత్ మూడు టీ 20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.
India New Jersey: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంపై టీమిండియా కొత్త జెర్సీ.. వైరలవుతోన్న వీడియో