IBSA World Games 2023: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఐబీఎస్‌ఏ వరల్డ్ గేమ్స్‌లో బంగారు పతకం..

|

Aug 27, 2023 | 6:37 AM

IBSA World Games 2023: సులభమైన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత మహిళా క్రీడాకారులు అద్భుత ప్రదర్శన చేశారు. ఫలితంగా కేవలం 3.3 ఓవర్లలో భారత జట్టు 1 వికెట్ కోల్పోయి 43 పరుగులు చేసి 9 వికెట్ల తేడాతో చారిత్రాత్మక విజయం సాధించింది. ఇప్పుడు అందరి చూపు ఫైనల్‌కు చేరిన పురుషుల జట్టుపైనే నిలిచింది. పురుషుల జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడుతుంది.

IBSA World Games 2023: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఐబీఎస్‌ఏ వరల్డ్ గేమ్స్‌లో బంగారు పతకం..
Ibsa World Games 2023
Follow us on

IBSA World Games 2023: ఇంగ్లండ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన ఇంటర్నేషనల్ బ్లైండ్ స్పోర్ట్ ఫెడరేషన్ (ఐబీఎస్‌ఏ) ప్రపంచ క్రీడల మహిళల అంధుల క్రికెట్ ఫైనల్‌లో భారత మహిళలు విజేతగా నిలిచారు. ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించి ఈ ఘనత సాధించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా VI మహిళల జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో వర్షం కారణంగా మ్యాచ్ 9 ఓవర్లకే పరిమితమైంది. అలాగే ఇండియా VI మహిళల జట్టుకు 9 ఓవర్లలో 43 పరుగుల లక్ష్యాన్ని అందించారు.

ఈ సులువైన లక్ష్యాన్ని ఛేదించిన భారత జట్టు మహిళా క్రీడాకారులు అద్భుత ప్రదర్శన చేశారు. ఫలితంగా కేవలం 3.3 ఓవర్లలో భారత జట్టు 1 వికెట్ కోల్పోయి 43 పరుగులు చేసి 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

విజేతగా భారత మహిళలు..

దీని ద్వారా అంతర్జాతీయ అంధుల క్రీడా సమాఖ్య (ఐబీఎస్‌ఏ) ప్రపంచ క్రీడల అంధుల క్రికెట్‌లో భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం సాధించింది.

ఆసీస్ పై విజయం..

పురుషుల జట్టుపై ఫోకస్..

ఆస్ట్రేలియాను ఓడించి మహిళల జట్టు సరికొత్త చరిత్ర లిఖించింది. ఇప్పుడు అందరి చూపు ఫైనల్‌కు చేరిన పురుషుల జట్టుపైనే నిలిచింది. పురుషుల జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడుతుంది. ఇటువంటి పరిస్థితిలో, భారత పురుషుల జట్టు కూడా బంగారు పతకం సాధించి దేశానికి తిరిగి వస్తుందని భారత అభిమానులు ఆశిస్తున్నారు.

గెలిచిన సంబురం..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..