IND-W vs SL-W: వైజాగ్‌లో టాస్ గెలిచిన భారత్.. అందరి చూపు లేడీ కోహ్లీపైనే..

India Women vs Sri Lanka Women, 1st T20I: విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదికగా భారత్ వర్సెస్ శ్రీలంక మహిళల జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ నేడు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది.

IND-W vs SL-W: వైజాగ్‌లో టాస్ గెలిచిన భారత్.. అందరి చూపు లేడీ కోహ్లీపైనే..
India Women Vs Sri Lanka Women, 1st T20i

Updated on: Dec 21, 2025 | 7:01 PM

విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదికగా భారత్ వర్సెస్ శ్రీలంక మహిళల జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ నేడు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది.

ప్రపంచ కప్ విజయం తర్వాత తొలి సిరీస్:

గత నెలలో జరిగిన వన్డే ప్రపంచ కప్‌లో చారిత్రాత్మక విజయాన్ని అందుకున్న తర్వాత టీమిండియా ఆడుతున్న తొలి అంతర్జాతీయ సిరీస్ ఇదే. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్ కోసం బలమైన జట్టును సిద్ధం చేసే క్రమంలో ఈ సిరీస్ భారత్‌కు ఎంతో కీలకం.

యువతకు పెద్దపీట..

ఈ సిరీస్ ద్వారా 17 ఏళ్ల బ్యాటర్ జి. కమలిని, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ వైష్ణవి శర్మలను భారత జట్టులోకి ఆహ్వానించారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా యువ క్రీడాకారిణులకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని మేనేజ్‌మెంట్ భావిస్తోంది.

స్మృతి మంధానపై కళ్లు..

వివాహం తర్వాత మైదానంలోకి అడుగుపెడుతున్న స్టార్ బ్యాటర్ స్మృతి మంధానపై అందరి దృష్టి నెలకొంది. వన్డే ప్రపంచ కప్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన ఆమె, అదే జోరును టీ20ల్లోనూ కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

శ్రీలంక సవాల్..

చమరి ఆటపట్టు నేతృత్వంలోని శ్రీలంక జట్టును తక్కువ అంచనా వేయలేం. ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చగల ఆటపట్టు, భారత బౌలర్లకు సవాల్‌గా మారే అవకాశం ఉంది.

వాతావరణం, పిచ్..

విశాఖలోని పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని అంచనా. అయితే రాత్రి సమయంలో మంచు (Dew) ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున, ఛేజింగ్ సులభమవుతుందనే ఉద్దేశంతో హర్మన్ బౌలింగ్ వైపు మొగ్గు చూపారు.

జట్ల వివరాలు..

శ్రీలంక మహిళలు (ప్లేయింగ్ XI): విష్మి గుణరత్నే, చమరి అతపత్తు(సి), హాసిని పెరీరా, హర్షిత సమరవిక్రమ, నీలాక్షి డి సిల్వా, కౌషని నుత్యంగన(w), కవిషా దిల్హరి, మల్కీ మదార, ఇనోకా రణవీర, కావ్య కావింది, శశిని గిమ్హనై

భారత మహిళలు (ప్లేయింగ్ XI): స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (సి), రిచా ఘోష్ (w), దీప్తి శర్మ, అమంజోత్ కౌర్, అరుంధతి రెడ్డి, వైష్ణవి శర్మ, క్రాంతి గౌడ్, శ్రీ చరణి.

ఈ సిరీస్‌లో భాగంగా మొదటి రెండు మ్యాచ్‌లు విశాఖపట్నంలో, తదుపరి మూడు మ్యాచ్‌లు తిరువనంతపురంలో జరగనున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..