IND vs SL: శ్రీలంక టీంకు భారీ ఎదురుదెబ్బ.. కరోనా బారిన కీలక ఆటగాడు.. టీ20 సిరీస్ నుంచి ఔట్..!

|

Feb 23, 2022 | 6:50 PM

లక్నోలో భారత్‌తో టీ20 సిరీస్ ప్రారంభానికి ముందు శ్రీలంకకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) ఒక ప్రకటనలో..

IND vs SL: శ్రీలంక టీంకు భారీ ఎదురుదెబ్బ.. కరోనా బారిన కీలక ఆటగాడు.. టీ20 సిరీస్ నుంచి ఔట్..!
Ind Vs Sl Wanindu Hasaranga
Follow us on

శ్రీలంక క్రికెట్ జట్టు స్టార్ స్పిన్ ఆల్ రౌండర్ వనిందు హసరంగ కోవిడ్ -19 ఇన్‌ఫెక్షన్ నుంచి ఇంకా కోలుకోనందున భారత్‌తో జరగబోయే టీ 20ఐ(IND vs SL) సిరీస్‌కు బుధవారం దూరమయ్యాడు. ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో హసరంగా(Wanindu Hasaranga) కరోనా సోకినట్లు తేలింది. దీని కారణంగా అతను పర్యటనలో చివరి మూడు మ్యాచ్‌లలో ఆడలేకపోయాడు. లక్నోలో భారత్‌తో టీ20 సిరీస్ ప్రారంభానికి ముందు శ్రీలంకకు ఇది పెద్ద ఎదురుదెబ్బ లాంటింది. శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) ఒక ప్రకటనలో, “వనిందు హసరంగా మరోసారి కరోనా బారిన పడ్డాడు. నిన్న (22 ఫిబ్రవరి) చేసిన కరోనా RT-PCR పరీక్షలో పాజిటివ్‌గా తేలాడు” అని పేర్కొంది. దీంతో భారత సిరీస్‌ నుంచి కూడా దూరమయ్యాడు.

వనిందు హసరంగా తన అద్భుతమైన లెగ్ స్పిన్, బ్యాటింగ్ స్కిల్స్‌తో ప్రత్యేక ముద్ర వేశాడు. అతను జట్టులోని అత్యంత ముఖ్యమైన ఆటగాళ్లలో ఒకడిగా ఎదిగాడు. 2021 జూలైలో శిఖర్ ధావన్ నాయకత్వంలో వైట్ బాల్ సిరీస్ కోసం భారత జట్టు శ్రీలంకకు వెళ్లిన సందర్భంలో ఈ ఆటగాడు బౌలింగ్‌తోపాటు బ్యాటింగ్‌తోనూ ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత మూడు టీ20 మ్యాచ్‌ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో, అతని అత్యుత్తమ ప్రదర్శనకు కూడా నమోదు చేశాడు. ఓ మ్యాచులో కేవలం 9 పరుగులకు నాలుగు వికెట్లు తీసి భారత్‌ను దారుణంగా దెబ్బ తీశాడు.

టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాపై హసరంగ హ్యాట్రిక్ సాధించాడు. అతను 5.20 ఎకానమీ రేటుతో ఎనిమిది మ్యాచ్‌లలో 16 వికెట్లతో టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.

ఫిబ్రవరి 24న భారత్ వర్సెస్ శ్రీలకం తొలి టీ20..
భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మొదటి మ్యాచ్ రేపు అంటే గురువారం లక్నోలో జరుగుతుంది. దీని తర్వాత ఫిబ్రవరి 26న ధర్మశాలలో రెండో టీ20, ఫిబ్రవరి 27న ధర్మశాలలో మూడో టీ20 జరగనుంది.

Also Read: India vs Sri Lanka 1st T20: అభిమాన ప్లేయర్ కోసం రోడ్డెక్కిన ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా?

IPL 2022: మొత్తం 70 లీగ్ మ్యాచ్‌లు.. ముంబై-పుణెల్లోనే హోరాహోరీ పోరు.. ఐపీఎల్ 2022 తొలి మ్యాచ్‌ ఎప్పుడంటే?