India vs South Africa: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న తర్వాత టీమిండియా ప్రస్తుతం దక్షిణాఫ్రికా టూర్‌కు సిద్ధమవనుంది. టీమిండియా జట్టును ఎప్పుడైనా నేడో లేదా రేపు ప్రకటించే అవకాశం ఉంది. టీమ్ ఇండియా సెలక్టర్లు ముంబైలోనే ఉన్నారు. ఇక్కడ నుంచి జట్టు దక్షిణాఫ్రికాకు వెళ్లనుంది. అజింక్యా రహానెను జట్టులోకి తీసుకుంటారా అనేది ఈ సిరీస్‌కు ముందున్న అతిపెద్ద ప్రశ్న. ఒకవేళ అతను ఎంపికైనా దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్‌లో భారత ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉంటాడా? ఈ ప్రశ్నకు వీవీఎస్ లక్ష్మణ్ సమాధానమిచ్చారు.
స్టార్ స్పోర్ట్స్‌తో జరిగిన ప్రత్యేక సంభాషణలో వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ, అజింక్యా రహానె టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉండడు. రహానేకు బదులుగా శ్రేయాస్ అయ్యర్‌కు అవకాశం ఇస్తారు. శ్రేయాస్ అయ్యర్ అద్భుతంగా రాణించాడని, అతడికి టీమిండియా అవకాశాలు కల్పించాలని’ పేర్కొన్నాడు.
రహానే స్థానంలో అయ్యర్..
వీవీఎస్ లక్ష్మణ్ తెలిపిన వివరాల ప్రకారం.. ‘రహానె తొలి మ్యాచ్ ఆడకూడదని అనుకుంటున్నా. నిలకడగా అవకాశాలు ఇవ్వడం ముఖ్యం. శ్రేయాస్ అయ్యర్ మొదటి రెండు మ్యాచ్‌లలో బాగా రాణించాడు. తన తొలి టెస్టులోనే అయ్యర్ సెంచరీ, హాఫ్ సెంచరీ సాధించాడు. నేను అతనిని నమ్ముతాను. ఒక యువ బ్యాట్స్‌మెన్ కోరుకునేది కూడా అదే’ అని లక్ష్మణ్ తెలిపాడు.
సౌతాఫ్రికా టూర్‌లో హనుమ విహారీకి అవకాశం ఇవ్వడంపై కూడా వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో హనుమ విహారికి అవకాశం లభించలేదు. ఆ తర్వాత సెలెక్టర్లపై ప్రశ్నలు లేవనెత్తారు. అయితే ఈ ఆటగాడు దక్షిణాఫ్రికా-ఏతో మ్యాచులు ఆడుతున్నాడు. దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్ జట్టులో హనుమ విహారి చోటు దక్కించుకోగలడని అతని ప్రదర్శనను బట్టి అర్థమవుతోంది. లక్ష్మణ్ ఆలోచన ప్రకారం రాహుల్-రోహిత్‌ల స్థానం ఖాయం కావడంతో దక్షిణాఫ్రికాతో జరిగే తొలి టెస్టులో మయాంక్ అగర్వాల్‌కు కూడా అవకాశం లభించదు. పుజారా మూడో స్థానంలో, విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో ఆడనున్నారు.
అశ్విన్‌కు అవకాశం ఇవ్వాలి – లక్ష్మణ్
దక్షిణాఫ్రికా పర్యటన కోసం ప్లేయింగ్ ఎలెవన్‌లో అశ్విన్, జడేజాలకు చోటు కల్పించడంపై వీవీఎస్ లక్ష్మణ్ మాట్లాడాడు. ఆల్‌రౌండర్‌గా జడేజా 7వ స్థానంలో ఆడగలడని, అశ్విన్‌కి కూడా అవకాశం రావాలని లక్ష్మణ్ అన్నాడు. లక్ష్మణ్ ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో బరిలోకి దిగడం గురించి మాట్లాడాడు. ఈ ముగ్గురు ఫాస్ట్ బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ మినహా మహ్మద్ సిరాజ్ పేరు ముందంజలో ఉంది. అయితే విరాట్ కోహ్లీ-రాహుల్ ద్రవిడ్ ఏమనుకుంటున్నారో చూడాలి. త్వరలో అన్నీ విషయాలు వెల్లడి కానున్నాయి.
IPL 2022 Mega Auction: మెగా వేలంలో వీరికి మొండిచెయ్యి.. ఫ్రాంఛైజీలు పక్కనపెట్టే భారత ఆటగాళ్లేవరంటే?