IND vs SA: నం.6లో అతడే కరెక్ట్.. అలా చేస్తే వన్డేల్లో టీమిండియా ఫినిషర్ బాధ తీరినట్లే: గవాస్కర్

|

Jan 22, 2022 | 11:34 AM

Shardul Thakur - Rishabh Pant: ఎంఎస్ ధోని తర్వాత టీమిండియా తదుపరి ఫినిషర్‌ను తయారు చేయాల్సిన అవసరం ఉందని భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.

IND vs SA: నం.6లో అతడే కరెక్ట్.. అలా చేస్తే వన్డేల్లో టీమిండియా ఫినిషర్ బాధ తీరినట్లే: గవాస్కర్
Sunil Gavaskar
Follow us on

Sunil Gavaskar: టెస్టుల్లో ఓటమితో పాటు వన్డేల్లోనూ సిరీస్ కోల్పోవడంతో ప్రస్తుతం టీమిండియాపై తీవ్రమైన ఒత్తిడి నెలకొంది. కేఎల్ రాహుల్ కెప్టెన్సీ కెరీర్‌ని ఓటమితో ప్రారంభించాడు. వన్డేలలో మొదటి రెండు గేమ్‌లలో ఓడిపోవడమే కాకుండా, జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన రెండవ టెస్ట్‌లోనూ రాహుల్ సారథ్యంలో ఓటమిని చవిచూసింది. దీంతో రాహుల్‌తోపాటు, ద్రవిడ్ సారథ్యంలో టీమిండియా తొలి విదేశీ పర్యటన పేలవంగా మొదలైంది. ఆదివారం జరిగే మూడో వన్డే తర్వాత, ఫిబ్రవరి 6న వెస్టిండీస్‌తో భారత్ తన తదుపరి వన్డే సిరస్ ఆడనుంది. అయితే ఈ సిరీస్‌కు రోహిత్ శర్మ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాడు. సారథిగా తన మొదటి సిరీస్‌లో భారత్‌ను నడిపించేందుకు సిద్ధంగా ఉన్నాడు.

ఎంఎస్ ధోని తర్వాత భారత్ తన తదుపరి ఫినిషర్‌ను తయారు చేయాల్సిన అవసరం ఉందని భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. చాలా కాలంగా, హార్దిక్ పాండ్యా ఆ పాత్రను స్వీకరిస్తాడని భావించారు. అయితే ప్రస్తుతం ఫిట్‌నెస్ సమస్యలతో పోరాడుతోన్న హార్దిక్.. ఎంతకాలం ఆడతాడో తెలియదు. ప్రస్తుతం ఈ ఆల్ రౌండర్‌‌కు టీమిండియాలో చోటు దక్కడం ప్రశ్నార్థకంగానే మారింది. ఈ విషయాలను పరినణలోకి తీసుకుంటే కచ్చితంగా టీమిండియా ఫినిషర్ ప్లేస్‌పై ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది.

గవాస్కర్ మాట్లాడుతూ, రిషబ్ పంత్ భారత్ తరపున రెండు వన్డేలలో నం. 4లో బ్యాటింగ్ చేశాడు. మిడిల్ ఆర్డర్‌ను బలోపేతం చేస్తూ శుక్రవారం పార్ల్‌లో జరిగిన రెండవ మ్యాచ్‌లో వికెట్ కీపర్ కం బ్యాటర్ రిషబ్ 85 పరుగుల ఇన్నింగ్స్‌ ఆడాడు. పంత్‌ను నం. 6లో ఉత్తమంగా ఉపయోగించుకోవచ్చని’ ఆయన ప్రకటించారు.

“తొలి వన్డేలో శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీల మధ్య అద్భుతమైన భాగస్వామ్యం తర్వాత మిడిల్ ఆర్డర్ తడబడింది. పంత్, ఇద్దరు అయ్యర్లు (శ్రేయస్, వెంకటేష్) జట్టును ఆదుకోవడంలో విఫలమయ్యారు” అని గవాస్కర్ తెలిపారు.

“పంత్, ఇటీవలి కాలంలో, వన్డేలలో నం.4లో ఆడుతున్నాడు. అక్కడ అతను సహనం, దూకుడు మిక్స్ చేసి ఆడడంలో విఫలం అయ్యాడు. కాబట్టి అతనిని నం.6లో ఫినిషర్‌గా ఉపయోగించడం మంచి ఆలోచన అవుతుంది. పరిస్థితి గురించి ఎక్కువగా బాధపడకుండా తన బ్యాట్‌ను ఇష్టానుసారంగా ఉపయోగించి ఫలితం రాబట్టగలడు’ అని ఆయన తెలిపారు.

అనుభవజ్ఞుడైన పేసర్‌ భువనేశ్వర్ కుమార్ తన ఫామ్‌పై దృష్టి సారించాలని సూచించారు. భువనేశ్వర్ రెండు వన్డేలలో వికెట్లు పడగొట్టలేదు. మొదటి రెండు మ్యాచ్‌లలో వరుసగా 0/64, 0/61లతో నిరాశ పరిచాడు. “గత కొంతకాలంగా, భువనేశ్వర్ చివరి ఓవర్లలో మునుపటిలాగా పరుగులను అడ్డుకోలేకపోతున్నాడు” అని భారత మాజీ కెప్టెన్ విమర్శించారు.

Also Read: India vs South Africa: అశ్విన్, చాహల్ కంటే వారే బెటర్: రిషబ్ పంత్ కీలక వ్యాఖ్యలు

18 ఏళ్లలో 11 టెస్టులు.. కేవలం 2 వికెట్లు మాత్రమే పడగొట్టిన భారత స్పిన్నర్.. ఆయనెవరో తెలుసా?