IND vs SA: కోహ్లీ పేరిట ఎన్నో స్పెషల్ రికార్డులు.. బ్రేక్ చేయడం అంత ఈజీ కాదు.. అవేంటో తెలుసా?

|

Jan 18, 2022 | 5:30 PM

Virat Kohli: భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి పేరిట ఎన్నో ప్రత్యేక రికార్డులు ఉన్నాయి. అయితే వీటిని మాత్రం అంత ఈజీగా ఎవరూ బద్దలు కొట్టలేరు. అవేంటో చూద్దాం.

IND vs SA: కోహ్లీ పేరిట ఎన్నో స్పెషల్ రికార్డులు.. బ్రేక్ చేయడం అంత ఈజీ కాదు.. అవేంటో తెలుసా?
Virat Kohli
Follow us on

India vs South Africa: భారత క్రికెట్ జట్టు దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లీ(Virat Kohli) ఇటీవలే టెస్టు క్రికెట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. అంతకుముందు వన్డే, టీ20 కెప్టెన్సీ నుంచి అతడిని బీసీసీఐ(BCCI) తప్పించింది. కెప్టెన్‌గా కోహ్లీ ఎన్నో రికార్డులు సృష్టించాడు. వన్డేల్లో ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'(Most Player Of The Match) గెలుచుకున్న ఆటగాళ్ల గురించి చెప్పాలంటే.. విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు.

వన్డే ఫార్మాట్ క్రికెట్‌లో అత్యధిక ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ గెలిచిన రికార్డును సచిన్ టెండూల్కర్ కలిగి ఉన్నాడు. సచిన్ 463 వన్డేల్లో 62 సార్లు ఈ అవార్డును అందుకున్నాడు. అదే సమయంలో ఈ విషయంలో శ్రీలంక మాజీ ఆటగాడు సనత్ జయసూర్య రెండో స్థానంలో నిలిచాడు. జయసూర్య 445 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు. ఇందులో ఈ శ్రీలంక దిగ్గజం 48 సార్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ టైటిల్‌ను గెలుచుకున్నాడు.

ప్రస్తుత ఆటగాళ్లలో టీమిండియా మాజీ కెప్టెన్‌ కోహ్లి నెంబర్‌వన్‌ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో కోహ్లీ అందనంత ఎత్తులో నిలిచాడు. 254 వన్డేలు ఆడిన కోహ్లి 36 సార్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. వీరే కాకుండా ఈ జాబితాలో రోహిత్ శర్మ 28వ స్థానంలో ఉన్నాడు. రోహిత్ 21 సార్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ టైటిల్‌ను గెలుచుకున్నాడు.

విరాట్ కోహ్లి ఇప్పటివరకు 254 వన్డేలు ఆడాడు. ఈ సమయంలో కోహ్లీ 12,169 పరుగులు చేశాడు. వన్డేల్లో కోహ్లీ 43 సెంచరీలు, 62 హాఫ్ సెంచరీలు సాధించాడు. వన్డేల్లో అతని అత్యుత్తమ స్కోరు 183 పరుగులుగా నిలిచింది. పాకిస్థాన్‌తో ఢాకాలొ జరిగిన వన్డేలో కోహ్లి ఈ స్కోరు సాధించాడు.

Also Read: IPL 2022: అహ్మదాబాద్ ఫ్రాంచైజీ రిటెన్షన్‌ లిస్ట్ రెడీ.. జాబితాలో ఇద్దరు టీమిండియా యంగ్ ప్లేయర్లు?

IND vs SA ODI Series: దక్షిణాఫ్రికాలో పరుగుల వర్షం.. వన్డే లిస్టులో టాప్‌లో ఎవరున్నారంటే?