IND vs SA : థ్యాంక్స్ గాడ్.. ఫైనల్‌కి అయినా టాస్ గెలిచాం..ఇక 2023 ప్రపంచకప్ ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటారా ?

భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో మూడవ మ్యాచ్ నేడు (శనివారం) విశాఖపట్నంలోని డా.వై.ఎస్.రాజశేఖర రెడ్డి ACA-VDCA క్రికెట్ స్టేడియంలో ప్రారంభమైంది. మొదటి మ్యాచ్‌లో భారత్ 17 పరుగుల తేడాతో గెలవగా, రెండో వన్డేలో దక్షిణాఫ్రికా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇరు జట్లు చెరొక మ్యాచ్ గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేయడంతో ఈరోజు గెలిచిన జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది.

IND vs SA : థ్యాంక్స్ గాడ్.. ఫైనల్‌కి అయినా టాస్ గెలిచాం..ఇక 2023 ప్రపంచకప్ ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటారా ?
India Vs South Africa 3rd Odi

Updated on: Dec 06, 2025 | 1:31 PM

IND vs SA : భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో మూడవ మ్యాచ్ నేడు (శనివారం) విశాఖపట్నంలోని డా.వై.ఎస్.రాజశేఖర రెడ్డి ACA-VDCA క్రికెట్ స్టేడియంలో ప్రారంభమైంది. మొదటి మ్యాచ్‌లో భారత్ 17 పరుగుల తేడాతో గెలవగా, రెండో వన్డేలో దక్షిణాఫ్రికా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇరు జట్లు చెరొక మ్యాచ్ గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేయడంతో ఈరోజు గెలిచిన జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. రెండు మ్యాచ్‌లు కూడా హై-స్కోరింగ్ మ్యాచ్‌లు కావడంతో ఈరోజు కూడా బ్యాట్స్‌మెన్‌ల హవానే కొనసాగే అవకాశం ఉంది.

ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి, ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. వన్డే క్రికెట్‌లో వరుసగా 20 టాస్‌లు ఓడిపోయిన తర్వాత భారత్ టాస్ గెలవడం విశేషం. భారత జట్టు తమ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఒక మార్పు చేసింది. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్థానంలో బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మకు అవకాశం ఇచ్చారు. సౌతాఫ్రికా జట్టులో రెండు మార్పులు జరిగాయి. గాయపడిన టోనీ డిజోర్జి, నాండ్రే బర్గర్ స్థానంలో ర్యాన్ రికెల్టన్, ఓట్నీల్ బార్ట్‌మ్యాన్ జట్టులోకి వచ్చారు.

ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి విరాట్ కోహ్లీ పైనే ఉంది. అతను గత రెండు మ్యాచ్‌లలోనూ సెంచరీలు కొట్టి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈరోజు సెంచరీ కొట్టి సెం చరీల హ్యాట్రిక్ నమోదు చేయాలని కోహ్లీ ప్రయత్నిస్తున్నాడు. కోహ్లీతో పాటు, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి కూడా మంచి ప్రదర్శన ఆశిస్తున్నారు. గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన రుతురాజ్ గైక్వాడ్ కూడా తన ఫామ్‌ను కొనసాగించాలని చూస్తున్నాడు. యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్ వంటి వారు తమ మంచి ఓపెనింగులను భారీ స్కోర్‌లుగా మార్చుకోవాల్సిన ఒత్తిడిలో ఉన్నారు.

భారతీయ బౌలర్లు కూడా ఈ సిరీస్‌లో ఇంకా తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా వంటి యువ పేసర్‌లు, ప్రభావం చూపగల అర్ష్‌దీప్ సింగ్తో కలిసి మెరుగ్గా రాణించాలని జట్టు మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది. మ్యాచ్ గెలవడానికి టెంబా బావుమా నేతృత్వంలోని సౌతాఫ్రికా జట్టు కూడా పూర్తి ప్రయత్నం చేస్తుంది. ఈ కీలక మ్యాచ్‌లో సూర్యుడు అస్తమించిన తర్వాత మంచు ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున, టాస్ గెలవడం భారత్‌కు అనుకూలంగా మారింది.

భారత్ ప్లేయింగ్ ఎలెవన్: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్ (కీపర్), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ.

దక్షిణాఫ్రికా ప్లేయింగ్ ఎలెవన్: ర్యాన్ రికెల్టన్, క్వింటన్ డికాక్ (కీపర్), టెంబా బావుమా (కెప్టెన్), మాథ్యూ బ్రీట్జ్‌కే, ఐడెన్ మార్కరమ్, డెవాల్డ్ బ్రెవిస్, మార్కో జాన్సెన్, కార్బిన్ బోష్, కేశవ్ మహారాజ్, లుంగీ ఎన్గిడి, ఓట్నీల్ బార్ట్‌మ్యాన్.

 

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి