IND vs SA 2nd Test: వాండరర్స్‌ పిచ్‌లో చిన్న తేడా గమనించా.. అదే నాకు కలిసొచ్చింది: లార్డ్ శార్దుల్

|

Jan 05, 2022 | 1:52 PM

IND vs SA Test Series: జోహన్నెస్‌బర్గ్ టెస్టు రెండో రోజున శార్దూల్ ఠాకూర్ ఏడుగురు దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌లకు పెవిలియన్‌కు చేర్చాడు.

IND vs SA 2nd Test: వాండరర్స్‌ పిచ్‌లో చిన్న తేడా గమనించా.. అదే నాకు కలిసొచ్చింది: లార్డ్ శార్దుల్
Ind Vs Sa, 2nd Test Shardul Thakur
Follow us on

IND vs SA 2nd Test: జోహన్నెస్‌బర్గ్ టెస్ట్‌లో టీమిండియాను పునరాగమనం చేసిన శార్దూల్ ఠాకూర్ తన విజయ రహస్యాన్ని చెప్పాడు. అతను పిచ్‌లోని ఒక నిర్దిష్ట ప్రదేశంలో బౌలింగ్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నానని తెలిపాడు. ఎందుకంటే, ఆ స్పాట్‌ను తాకిన తర్వాత, బంతి కిందికి వెళ్తుంది. దీంతో కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్‌కు చాలా ఇబ్బంది కలిగిందంటూ చెప్పుకొచ్చాడు.

శార్దూల్ మాట్లాడుతూ, ‘నేను బౌలింగ్ చేయడం ప్రారంభించినప్పుడు, 22-యార్డ్ వికెట్‌లో ఒక స్థానాన్ని తాకిన తర్వాత బంతి నేరుగా బ్యాట్స్‌మెన్ వద్దకు వస్తున్నట్లు నేను గుర్తించాను. ఇక్కడి నుంచి బంతులు స్లోగా వెళ్తున్నాయి. అందుకే నేను మొత్తం బౌలింగ్‌లో అక్కడే టార్గెట్ చేశాను. దీంతో అనుకున్న ఫలితం దక్కింది’ అంటూ తెలిపాడు.

మ్యాచ్ రెండో రోజు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో శార్దూల్ 7/61తో చెలరేగాడు. అతని అద్భుతమైన బౌలింగ్ కారణంగా ఆఫ్రికా జట్టు పెద్దగా ఆధిక్యం సాధించలేక కేవలం 229 పరుగులకే ఆలౌటైంది.

మ్యాచ్ అనంతరం శార్దూల్ మాట్లాడుతూ, ‘సెంచూరియన్, జోహన్నెస్‌బర్గ్ రెండింటిలోనూ పిచ్ ఫాస్ట్ బౌలర్లకు బాగా సహాయపడిందని మాకు తెలుసు. మనం పిచ్‌పై సరైన స్థానాన్ని కనుగొని, అక్కడ బౌలింగ్ చేస్తూనే ఉండాలి. నేను అదే పని చేసి, ఫలితం రాబట్టాను’ అని పేర్కొన్నాడు.

ఈ సందర్భంగా శార్దూల్ తన చిన్ననాటి కోచ్ దినేష్ లాడ్ గురించి కూడా మాట్లాడాడు. శార్దూల్ మాట్లాడుతూ, ‘అతను నా క్రికెట్ కెరీర్‌పై గొప్ప ప్రభావాన్ని చూపాడు. నాలోని ప్రతిభను ఆయనే చూశారు. స్వామి వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్లో నా అడ్మిషన్ పొందాను. అక్కడి నుంచి నా జీవితం మారిపోయింది’ అంటూ తెలిపాడు.

Also Read: IND vs SA, 2nd Test Day 3, Live Score: భారత్ భారీ ఆధిక్యం సాధించేనా.. భారమంతా రహానే, పుజారాలపైనే?

IPL 2022: హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ అందుకే రిటైన్ చేసుకోలేదు: భారత మాజీ బౌలర్ జహీర్ ఖాన్