
India vs Pakistan, Women’s ODI World Cup 2025: మహిళల వన్డే ప్రపంచ కప్ గెలవాలంటే పాకిస్థాన్ కు 248 పరుగుల లక్ష్యాన్ని భారత్ నిర్దేశించింది. కొలంబోలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు 50 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌట్ అయింది.
హర్లీన్ డియోల్ 46 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. జెమిమా రోడ్రిగ్జ్ 32, ప్రతీకా రావల్ 31 పరుగులు చేసింది. 8వ స్థానంలో బరిలోకి దిగిన రిచా ఘోష్ 20 బంతుల్లో అజేయంగా 35 పరుగులు చేసి భారత్ పోరాడే స్కోరును చేరుకోవడంలో సహాయపడింది. పాకిస్తాన్ తరపున డయానా బేగ్ నాలుగు వికెట్లు పడగొట్టింది. కెప్టెన్ ఫాతిమా సనా, సాదియా ఇక్బాల్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.