IND vs PAK: మరోమారు ఢీ కొట్టనున్న భారత్, పాక్ జట్లు.. రోహిత్ సేన సూపర్ 4 షెడ్యూల్ ఇదే..

India vs Pakistan Super 4 Match Date and Time: ఆసియా కప్ 2023లో భారత్, పాకిస్థాన్ మళ్లీ తలపడనున్నాయి. 8 రోజుల్లో ఇరు జట్లు తలపడడం ఇది రెండోసారి. ఇరు జట్లు తొలిసారి తలపడిన మ్యాచ్.. పల్లెకెలెలో వర్షంతో పూర్తిగా రద్దయింది. దీంతో ఈసారి వర్షం నీడ మ్యాచ్‌పై పడకుండా చూసుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఈసారి ఫుల్ మ్యాచ్‌ను చేసే అవకాశం ఉంది.

IND vs PAK: మరోమారు ఢీ కొట్టనున్న భారత్, పాక్ జట్లు.. రోహిత్ సేన సూపర్ 4 షెడ్యూల్ ఇదే..
Ind Vs Pak Asia Cup

Updated on: Sep 05, 2023 | 4:51 PM

Asia Cup 2023: ఆసియా కప్ 2023 తదుపరి దశ సూపర్ 4కు చేరుకుంది. సూపర్-4 అంటే టోర్నీలో టాప్ 4 జట్ల మధ్య పోటీ జరగనుంది. ఈ జట్ల మధ్య జరిగే పోరు నుంచే సెప్టెంబర్ 17న జరిగే ఆసియా కప్ 2023 ఫైనల్ ఆడే జట్లే ఏవో తేలనుంది. నాలుగు జట్లలో కేవలం రెండు జట్లు మాత్రమే ఫైనల్‌కు చేరతాయి. ఇప్పుడు ఆ రెండు జట్లు భారత్‌, పాకిస్థాన్‌గా ఉంటాయో లేదో చూడాలి. అయితే, సూపర్-4 దశలో ఈ ఇద్దరు చిరకాల ప్రత్యర్థుల మధ్య ఘర్షణ జరిగే రోజు, తేదీ, స్థలం ఖరారైంది.

2023 ఆసియా కప్‌లో తొలి పోరు జరిగిన 8 రోజుల తర్వాత భారత్‌, పాకిస్థాన్‌లు మళ్లీ తలపడనున్నాయి. సెప్టెంబర్ 2న పల్లెకెలెలో ఇరు దేశాల మధ్య తొలి ఘర్షణ జరిగింది. అయితే వర్షం కారణంగా ఆ మ్యాచ్ రద్దయింది. దీంతో ఇరు దేశాల ఫ్యాన్స్ మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు కూడా నిరాశకు గురయ్యారు. అయితే, ఇలాంటి పరిస్థితుల్లో మరోసారి భారత్, పాక్ జట్ల మధ్య పోరు జరగనుంది. అయితే, వర్షం వచ్చే అవకాశం ఉండడంతో స్టేడియాన్ని కూడా మార్చారు. దీంతో అభిమానులకు ఈసారి ఫుల్ మజా దక్కనుందని తెలుస్తోంది. ఈసారి మ్యాచ్ పల్లెకెలే స్టేడియంలోకాదని, హంబన్‌తోటలో భారత్‌, పాకిస్థాన్‌లు తలపడబోతున్నాయని తేలింది.

ఇవి కూడా చదవండి

కొలంబో కాదు హంబన్‌టోటాలో భారత్-పాకిస్థాన్‌ల రెండో ఘర్షణ..

భారత్, పాకిస్తాన్ మధ్య రెండవ ఎన్‌కౌంటర్ వేదిక ఇంతకు ముందు కొలంబో అని ప్రచారం జరిగింది. కానీ, అక్కడ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా ఈ మ్యాచ్‌తో పాటు మిగతా మ్యాచ్‌లన్నీ కూడా హంబన్‌తోటకు మారాయి. అంటే, శ్రీలంకకు దక్షిణాన ఉన్న ఈ నగరం పొడి ప్రాంతంగా పరిగణించబడుతుంది. కొలంబోలో జరిగే భారత్, పాకిస్తాన్ మధ్య సూపర్-4 మ్యాచ్ ఇప్పుడు హంబన్‌తోటాలో జరుగుతుంది.

సెప్టెంబరు 10న భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య పోరు..

ఇప్పుడు భారత్-పాకిస్థాన్ మధ్య సూపర్-4 పోరు ఎప్పుడనే దానిపై ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. 2023 ఆసియా కప్‌లో రెండవ సారి, సెప్టెంబర్ 10న భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ ఘర్షణ జరుగుతుంది. విశేషం ఏమిటంటే ఈ రోజు ఆదివారం అంటే భారతీయ అభిమానులకు సెలవు. ఇటువంటి పరిస్థితిలో ఈ మ్యాచ్‌ను పూర్తిగా ఆస్వాదించే అవకాశం ఉంది.

సూపర్-4 పూర్తి షెడ్యూల్ ఇదే..

ఆసియా కప్ 2023లో సూపర్-4 మ్యాచ్‌లు సెప్టెంబర్ 6 నుంచి ప్రారంభం కానున్నాయి.

తొలి మ్యాచ్‌లో గ్రూప్‌-ఏలోని అగ్రశ్రేణి జట్టు అంటే పాకిస్థాన్‌, గ్రూప్‌-బిలోని రెండో జట్టు మధ్య జరుగుతుంది.

సెప్టెంబరు 9న గ్రూప్-బిలో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్ల మధ్య రెండో సూపర్-4 మ్యాచ్ జరగనుంది.

ఆ తర్వాత సెప్టెంబర్ 10న భారత్-పాకిస్థాన్ మూడో సూపర్-4 మ్యాచ్‌లో తలపడనున్నాయి.

సెప్టెంబర్ 12వ తేదీన భారత జట్టు మళ్లీ మైదానంలోకి దిగనుంది. ఈసారి సూపర్-4 మ్యాచ్ గ్రూప్ బిలోని అగ్రశ్రేణి జట్టుతో ఢీకొట్టనుంది.

సెప్టెంబర్ 14న సూపర్-4లో గ్రూప్ బిలోని అగ్రశ్రేణి జట్టుతో పాకిస్థాన్ తలపడనుంది.

ఇక సెప్టెంబర్ 15న గ్రూప్-బిలో రెండో స్థానంలో ఉన్న జట్టుతో భారత్ తలపడనుంది.

ఆ తర్వాత సెప్టెంబర్ 17న జరిగే ఫైనల్‌కు రెండు జట్లు ఏవో తేలనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..