India vs Pakistan Highlights: పాక్‌ను చిత్తు చేసిన టీమిండియా.. టీ20 ప్రపంచకప్‌లో పరాభవానికి ప్రతీకారం

| Edited By: Basha Shek

Aug 29, 2022 | 12:28 AM

Asia Cup 2022, India vs Pakistan Highlights : కోట్లాది మంది ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న భారత్- పాకిస్తాన్ మ్యాచ్​ హాట్ హాట్‌గా సాగుతోంది. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది.

India vs Pakistan Highlights: పాక్‌ను చిత్తు చేసిన టీమిండియా.. టీ20 ప్రపంచకప్‌లో పరాభవానికి ప్రతీకారం
India Vs Pakistan Live

Ind vs Pak, Asia Cup 2022: ఆసియా కప్ ఆరంభ మ్యాచ్‌లో టీమిండియా అదరగొట్టింది.ఆదివారం చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్యా చివరి ఓవర్ లో సిక్స్‌ కొట్టి భారత జట్టు విజయాన్ని ఖరారుచేశాడు. తద్వారా గత ఏడాది టీ20 ప్రపంచకప్‌లో పాక్‌చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది

మ్యాచ్‌లందు ఇండియా-పాక్‌ మ్యాచే వేరు. ఆట మాత్రమే కాదు.. అంతకుమించిన ఎమోషన్. 10 నెలల గ్యాప్ తర్వాత రెండు జట్ల మధ్య మరో ఆసక్తికర సమరంపై క్రీడాభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. 2018లో జరిగిన ఆసియాకప్‌ను కొల్లగొట్టింది మనోళ్లే. ఇప్పుడు హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది కూడా మనవాళ్లే. గతేడాది టీ-20 ప్రపంచకప్‌లో భారత్‌-పాక్‌ తలపడ్డాయి. అది కూడా ఇదే దుబాయ్‌ గడ్డపై. ఆ మ్యాచ్‌లో భారత్‌కు ఘోర పరాభవం ఎదురైంది. టీ20, వన్డే ప్రపంచకప్ మ్యాచుల్లో పాక్ చేతిలో టీమిండియాకు తొలి పరాజయం అదే. ఆ ఓటమి భారం ఇంకా కళ్లముందు కదలాడుతూనే ఉంది. సో.. దెబ్బకు దెబ్బ కొట్టాల్సిందే. అంతకుమించిన రిటర్న్‌ గిఫ్ట్ ఇవ్వాలన్న పట్టుదలతో ఉంది రోహిత్‌సేన.

ఫామ్ పరంగా టీమ్‌ పరంగా పాక్‌ కంటే టీమిండియానే ఫేవరేట్‌. రోహిత్‌ శర్మ, రాహుల్‌, కోహ్లి, సూర్యకుమార్‌, రిషబ్ పంత్‌, హార్దిక్‌ పాండ్యా, జడేజా లాంటి ప్లేయర్లతో బ్యాటింగ్‌ లైనప్‌ ఓ పవర్‌ఫుల్‌గా ఉంది. అందరూ హిట్టర్లే. ఏ ఒక్కరు బ్యాట్ ఝుళిపించినా పాక్‌కి ముచ్చేమటలే. ఇక అందరూ తలో చేయి వేస్తే పాక్‌కు దబిడిదిబిడే.

అందరి కళ్లు విరాట్‌పైనే.. ఈ రన్‌ మెషిన్ ఫామ్‌లో లేకపోవడం టీమ్‌ని కలవరపెడుతోంది. పాక్‌తో మ్యాచ్‌ అంటే విరాట్‌ రెచ్చిపోతుంటాడు. ఈసారి కూడా అదే జరగాలని అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు. పైగా కోహ్లీకి వందో టీ20 మ్యాచ్ ఇది. దీంతో విరాట్ వీరవిహారం చేస్తాడని ఫ్యాన్స్‌ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. అటు బౌలింగ్‌లో భువీ, చాహల్‌, అవేష్‌ ఖాన్‌, అర్ష్‌ దీప్‌పై భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి. పదునైన బౌలింగ్‌తో పాక్‌ని కట్టడి చేస్తే విజయం సునాయాసమే.

అటు పాకిస్తాన్ టీమ్‌ కూడా స్ట్రాంగ్‌గానే కనిపిస్తోంది. కొన్నేళ్లుగా టీ20ల్లో ఆ జట్టుకి బలంగా నిలుస్తున్న కెప్టెన్‌ బాబర్‌.. వికెట్‌ కీపర్‌ కమ్ బ్యాట్స్‌మన్‌ రిజ్వాన్‌ ఫామ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లోనూ ఈ ఓపెనింగ్‌ జోడీ నుంచి భారత్‌కు ముప్పు పొంచి ఉంది. కుదురుకుంటే ఒక పట్టాన ఔట్‌ కాని బాబర్‌.. చాలా దూకుడుగా ఆడే రిజ్వాన్‌లను ఆరంభంలోనే కట్టడి చేయాల్సిందే. ఆ తర్వాత జమాన్‌ కూడా సత్తా చాటే ప్లేయరే. మిడిలార్డర్లో ఆల్‌రౌండర్‌ షాదాబ్‌ ఖాన్‌ కూడా ప్రమాదకారే. వీళ్లందర్నీ వీలైనంత త్వరగా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది.
కీలక బౌలర్లు లేనప్పటికీ బౌలింగ్ ద్వయం పటిష్టంగానే కనిపిస్తోంది.

Key Events

భారత్‌దే ఆధిపత్యం..

హెడ్ టు హెడ్ రికార్డుల్లో భారత్‌దే ఆధిపత్యం. అయితే గతేడాది భారత్‌పై గెలుపుతో పాక్ జట్టులో ఉత్సాహం కనిపిస్తోంది. మరోవైపు బదులు తీర్చుకోవాలని రోహిత్ సేన తహతహలాడుతోంది.

మాంచి ఫామ్‌లో ఉన్న రెండు టీమ్‌లు..

మొత్తానికి రెండు టీమ్‌లు మాంచి ఫామ్‌లో ఉండటంతో హోరాహోరి పోరు మరో లెవెల్‌కి వెళ్లిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 28 Aug 2022 11:00 PM (IST)

    కష్టాల్లో టీమిండియా.. నాలుగో వికెట్‌ డౌన్‌..

    టీమిండియా కష్టా్ల్లో పడింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (18) నసీమ్‌ షా బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. దీంతో నాలుగో వికెట్‌ కోల్పోయింది. క్రీజులో రవీంద్ర జడేజా (18), హార్దిక్‌ పాండ్యా (0) ఉన్నారు.

  • 28 Aug 2022 10:57 PM (IST)

    పెరిగిపోతోన్న రన్‌రేట్‌..

    లక్ష్య ఛేదనలో టీమిండియా రన్‌రేట్‌ పెరిగిపోతోంది. పాక్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో టీమిండియా బ్యాటర్లు స్లోగా పరుగులు చేస్తున్నారు. 14 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు 89/3. విజయానికి ఇంకా 36 బంతుల్లో 59 రన్స్‌ అవసరం.

  • 28 Aug 2022 10:37 PM (IST)

    నిలకడగా టీమిండియా బ్యాటింగ్‌.. 10 ఓవర్లకు స్కోరెంతంటే?

    టాపార్డర్‌ వికెట్లు కోల్పోవడంతో టీమిండియా నిలకడగా బ్యాటింగ్‌ చేస్తోంది. రవీంద్ర జడేజా (8), సూర్యకుమార్‌ యాదవ్‌ (3) సంయమనంతో ఆడుతున్నారు. 10 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు 62/2.

  • 28 Aug 2022 10:30 PM (IST)

    టీమిండియాకు మరో ఝలక్‌.. కోహ్లీ ఔట్‌..

    టీమిండియా మరో షాక్‌ తగిలింది. నిలకడగా ఆడుతున్న కోహ్లీ (35) పెవిలియన్‌ చేరాడు. దీంతో సూర్యకుమార్‌ యాదవ్‌ క్రీజులోకి వచ్చాడు.

  • 28 Aug 2022 10:26 PM (IST)

    రెండో వికెట్‌ కోల్పోయిన టీమిండియా.. పెవిలియన్‌ చేరిన కెప్టెన్‌..

    టీమిండియా రెండో వికెట్‌ కోల్పోయింది. రోహిత్‌ శర్మ (12) ఔటయ్యాడు. దీంతో ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం భారత్‌ స్కోరు 8.3 ఓవర్లు ముగిసే సరికి 51/2.

  • 28 Aug 2022 10:11 PM (IST)

    సంయమనంతో ఆడుతున్న కోహ్లీ..

    లక్ష్య ఛేదనలో టీమిండియా నిలకడగా ఆడుతోంది. మొదటి ఓవర్‌లోనే రాహుల్‌ ఔట్‌ కావడంతో కోహ్లీ, కెప్టెన్‌ రోహిత్ సంయమనంతో ఆడుతున్నారు. 5 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోరు 29/1. కోహ్లీ (24), రోహిత్‌ (4) క్రీజులో ఉన్నారు.

  • 28 Aug 2022 09:50 PM (IST)

    కేఎల్ రాహుల్‌ గోల్డెన్‌ డక్‌

    కేఎల్ రాహుల్‌ (0) గోల్డెన్‌ డక్‌గా ఇంటికి చేరాడు. నసీమ్‌ షా బౌలింగ్‌లో రెండో బంతికి రాహుల్ క్లీన్‌బౌల్డయ్యాడు. దీంతో భారత్‌ స్కోరు 1/1.

  • 28 Aug 2022 09:46 PM (IST)

    ప్రారంభమైన టీమిండియా బ్యాటింగ్

    టీమిండియా బ్యాటింగ్ ప్రారంభమైంది. కెప్టెన్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఓపెనర్లకు వచ్చారు. పాకిస్థాన్ తరఫున అరంగేట్రం చేస్తున్న నసీమ్ షా తొలి సారిగా బరిలోకి దిగుతున్నాడు

  • 28 Aug 2022 09:39 PM (IST)

    టీమిడియా విజయ లక్ష్యం 148..

    ఆఖరి ఓవర్‌లో హారిస్‌ రవుఫ్‌, దహాని దూకుడుగా ఆడటంతో మొత్తం 11 పరుగులు తీశారు. అయితే అర్ష్‌దీప్‌ బౌలింగ్‌లో దహాని క్లీన్‌బౌల్డ్‌ కావడంతో పాక్‌ ఇన్నింగ్స్‌ 19.5 ఓవర్లలో 147 పరుగుల వద్ద ముగిసింది. దీంతో భారత్‌కు 148 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది.

  • 28 Aug 2022 09:38 PM (IST)

    భువనేశ్వర్ కుమార్ తన చివరి ఓవర్ తొలి బంతికి..

    భువనేశ్వర్ కుమార్ తన చివరి ఓవర్ తొలి బంతికి షాదాబ్ ఖాన్‌ను బౌండరీ చేసి భువీ పెవిలియన్‌కు పంపాడు. షాదాబ్ 9 బంతుల్లో 10 పరుగులు చేశాడు. నసీమ్‌ షా (0)ను వికెట్ల ముందు ఔటయ్యాడు. ప్రస్తుతం 19 ఓవర్లలో పాక్‌ స్కోరు 136/9కి చేరింది. దహాని సిక్సర్‌ బాదాడు. క్రీజ్‌లో దహానితోపాటు హారిస్ (10) ఉన్నాడు.

  • 28 Aug 2022 09:22 PM (IST)

    తిప్పేస్తున్న భూవి.. ఎనిమిదో వికెట్ కోల్పోయిన పాక్..

    పాకిస్తాన్ వరుస వికెట్లతో కష్టాల్లోకి కూరుకుపోతోంది. 128 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్‌ను కోల్పోయింది. భువనేశ్వర్‌ బౌలింగ్‌లో (18.1వ ఓవర్‌) షాదాబ్‌ ఖాన్‌ (10) వికెట్ల ముందు దొరికిపోయాడు.

  • 28 Aug 2022 09:21 PM (IST)

    తొలి బంతికే నవాజ్ ఔట్

    అర్ష్‌దీప్‌ వేసిన (17.1వ ఓవర్‌) తొలి బంతికే నవాజ్ ఔటయ్యాడు. లెంగ్త్‌ బాల్‌ను ఆడబోయి కీపర్‌ దినేశ్‌ కార్తి్‌క్‌ చేతికి క్యాచ్‌ ఇచ్చి నవాజ్‌ పెవిలియన్‌కు చేరాడు. దీంతో 114 పరుగుల వద్ద పాక్‌ ఏడో వికెట్‌ను కోల్పోయింది.

  • 28 Aug 2022 09:09 PM (IST)

    ఆరో వికెట్ పోయే..

    ఆరో వికెట్ కోల్పోయింది పాకిస్తాన్. అసిఫ్ అలీ (09) ఔటయ్యాడు. భూవనేశ్వర్ బౌలింగ్‌లో 112 పరుగుల వద్ద అసిఫ్ ఔటయ్యాడు. భారత బౌలర్లు దూకుడు బౌలింగ్‌తో చుట్టేస్తున్నారు. వరుసగా వికెట్లు తీస్తూ పాక్‌పై ఒత్తిడి పెంచుతున్నారు. భువనేశ్వర్‌ కుమార్‌ వేసిన (16.2వ ఓవర్‌) బంతిని ఆడబోయిన అసిఫ్ అలీ బౌండరీ లైన్‌ వద్ద సూర్యకుమార్‌ యాదవ్‌ చేతికి చిక్కాడు. దీంతో 112 పరుగుల వద్ద పాక్‌ ఆరో వికెట్‌ను నష్టపోయింది.

  • 28 Aug 2022 09:01 PM (IST)

    హార్దిక్‌ పాండ్య సూపర్.. రిజ్వాన్‌ను ఔట్‌

    హార్దిక్‌ పాండ్య దూకుడు పెంచాడు.. ఇప్పటికే కీలక బ్యాటర్‌ రిజ్వాన్‌ను ఔట్‌ చేసిన హార్దిక్‌ (14.3వ ఓవర్‌) మరో అద్భుత బంతికి కౌష్దిల్‌ షా (2)ను పెవిలియన్‌కు పంపించాడు. జడేజా అద్భుతంగా క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో 97 పరుగుల వద్ద పాక్‌ ఐదో వికెట్‌ను కోల్పోయింది.

  • 28 Aug 2022 08:56 PM (IST)

    బ్యాటర్‌ రిజ్వాన్ ఔట్

    పాకిస్థాన్‌ కీలక బ్యాటర్‌ రిజ్వాన్ (43) ఔటయ్యాడు. హార్దిక్‌ పాండ్య బౌన్సర్‌కు బౌండరీ లైన్‌ వద్ద అవేశ్‌ ఖాన్‌ చేతికి చిక్కాడు. దీంతో పాక్ 96 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ను కోల్పోయింది.

  • 28 Aug 2022 08:44 PM (IST)

    ఇఫ్తికార్ అహ్మద్ క్యాచ్‌ ఔట్‌..

    లాస్ట్ ఓవర్‌లో క్యాచ్‌ ఔట్‌ నుంచి తప్పించుకున్న పాకిస్తాన్ బ్యాటర్ ఇఫ్తికార్ అహ్మద్ (28) ఈసారి మాత్రం చిక్కాడు. హార్దిక్‌ వేసిన (12.1వ ఓవర్‌) బంతిని పుల్‌ చేయబోయి కీపర్ దినేశ్‌ చేతికి క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో 87 పరుగుల వద్ద పాక్‌ మూడో వికెట్‌ను కోల్పోయింది.

  • 28 Aug 2022 08:42 PM (IST)

    రిజ్వాన్‌కు లైఫ్

    11వ ఓవర్లో జడేజా 8 పరుగులు ఇచ్చాడు. ఆ ఓవర్ తొలి బంతికే రిజ్వాన్ కట్ చేసి బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో ఉన్న బంతిని ఫోర్ కొట్టాడు. మరుసటి బంతికి రిజ్వాన్ జడేజా నేరుగా కొట్టి ఔటయ్యే అవకాశం ఉంది కానీ బంతి స్టంప్స్‌కు తగలలేదు.

  • 28 Aug 2022 08:37 PM (IST)

    10వ ఓవర్లో ఐదు పరుగులు..

    యుజ్వేంద్ర చాహల్ 10వ ఓవర్లో ఐదు పరుగులు ఇచ్చాడు. ఆ ఓవర్‌లో కేవలం ఐదు పరుగులు మాత్రమే వచ్చాయి. 10 ఓవర్లు ముగిసేసరికి పాకిస్థాన్ స్కోరు 68/2. రిజ్వాన్ 31 బంతుల్లో 29 పరుగులు, అహ్మద్ 14 బంతుల్లో 16 పరుగులు చేస్తున్నారు.

  • 28 Aug 2022 08:34 PM (IST)

    తొమ్మిదో ఓవర్‌లో రవీంద్ర జడేజా..

    తొమ్మిదో ఓవర్‌లో రవీంద్ర జడేజా నాలుగు పరుగులు ఇచ్చాడు. రిజ్వాన్ మరియు ఇఫ్తికార్‌ల జోడి మెల్లమెల్లగా ప్రారంభమై కనిపిస్తుంది. ఈ జోడీకి భారీ భాగస్వామ్యానికి అవకాశం ఇవ్వకుండా భారత బౌలర్లు ప్రయత్నిస్తారు.

  • 28 Aug 2022 08:19 PM (IST)

    హార్దిక్ పాండ్యా తన రెండో ఓవర్‌లో..

    హార్దిక్ పాండ్యా తన రెండో ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చి 8 పరుగులు ఇచ్చాడు. ఫఖర్ నిష్క్రమణ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇఫ్తికర్ అహ్మద్ ఫోర్ బాదాడు. ఓవర్ నాల్గవ బంతికి, అతను డీప్ ఎక్స్‌ట్రా కవర్‌లో బంతిని ఆడాడు. చాహల్ డైవింగ్ ద్వారా బంతిని ఆపడానికి ప్రయత్నించాడు. కానీ అతను విజయం సాధించలేకపోయాడు.

  • 28 Aug 2022 08:18 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన పాకిస్తాన్.. 42 పరుగుల వద్ద జమాన్ ఔట్..

    రెండో వికెట్ కోల్పోయింది పాకిస్తాన్. 42 పరుగుల వద్ద జమాన్ అవుటయ్యాడు. అవేశ్ ఖాన్(5.5వ ఓవర్‌) వేసిన ఓవర్ 5వ బంతికి 10 పరుగులు చేసిన ఫఖర్ జమాన్ ఔటయ్యాడు. ఓవర్ ఐదో బంతికి జమాన్ స్కూప్ చేసేందుకు ప్రయత్నించాడు కానీ బంతి బ్యాట్ అంచుకు తగిలి దినేష్ కార్తీక్ చేతికి చిక్కాడు. అయితే అంపైర్‌ నిర్ణయం ప్రకటించకముందే ఫఖర్ పెవిలియన్‌ బాట పట్టాడు. దీంతో 42 పరుగుల వద్ద పాక్‌ రెండో వికెట్‌ను కోల్పోయింది. ప్రస్తుతం 6 ఓవర్లు ముగిసేసరికి పాక్‌ స్కోరు 43/2. క్రీజ్‌లో రిజ్వాన్ (20*), ఇఫ్తికర్‌ అహ్మద్ (1*) ఉన్నారు. ఈ ఓవర్‌లో మొత్తం 13 పరుగులు వచ్చాయి.

     

  • 28 Aug 2022 08:08 PM (IST)

    నాలుగు ఓవర్లలో పాకిస్థాన్ 23 పరుగులు

    తొలి నాలుగు ఓవర్లలో పాకిస్థాన్ 23 పరుగులు చేసింది. బాబర్ ఔటైన తర్వాత క్రీజులో మహ్మద్ రిజ్వాన్, ఫకర్ జమాన్ ఉన్నారు.

  • 28 Aug 2022 08:07 PM (IST)

    మూడో ఓవర్ వరకు  పాకిస్థాన్ స్కోరు – 19/1

    భారత్ బౌలింగ్ మూడో ఓవర్ ముగిసింది. ఈ ఓవర్లో భువీ ఒక వికెట్ తీశాడు. పాకిస్థాన్ స్కోరు – 19/1

  • 28 Aug 2022 08:05 PM (IST)

    హార్దిక్ బౌలింగ్…

    హార్దిక్ పాండ్యా బౌలింగ్ కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో పాండ్యా ప్రదర్శన అద్భుతంగా ఉంది. అతను ఆల్ రౌండర్ ప్రదర్శన చేస్తున్నాడు

  • 28 Aug 2022 08:04 PM (IST)

    విఫలమైన బాబర్..

    మ్యాచ్‌కు ముందు బాబర్ అజామ్ బ్యాటింగ్ గురించి చాలా చర్చ జరిగింది. పాకిస్థాన్ బ్యాటింగ్ అతనిపైనే ఎక్కువగా ఆధారపడి ఉంది. కానీ బాబర్ ఆజం ఈరోజు నిరాశపరిచాడు.

  • 28 Aug 2022 07:50 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన.. బాబర్ ఆజమ్ ఔట్..

    ఆసియా కప్‌ కోసం భారత్ తన వేటను మొదలుపెట్టింది. బాబర్ ఆజమ్ (10)ఔటయ్యాడు. భారీ షాట్ ఆడే ప్రయత్నంలో పాక్ కెప్టెన్ బాబర్ అర్షదీప్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

  • 28 Aug 2022 07:45 PM (IST)

    బాబర్‌కు DRS

    బాబర్ ఆజం వికెట్ ఔటయ్యాడని అంతా అనుకున్నారు. భారత్ కూడా డీఆర్ఎస్ తీసుకుంది. అయితే బాబర్ ఆజం నాటౌట్‌గా నిలిచాడు. తొలి ఓవర్‌లోనే అద్భుతమైన యాక్షన్‌..

  • 28 Aug 2022 07:41 PM (IST)

    భారత్‌ – పాక్‌ మ్యాచ్‌లో తళుక్కున ‘లైగర్‌’..

    ఈ ఇంట్రస్టింగ్ మ్యాచ్ లో ఓ స్టార్ హీరో తళుక్కున మెరిశారు. లైగర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ గ్రౌండ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. మ్యాచ్ కు ముందు ఇండియన్ టీమ్ గురించి ఆయన మాట్లాడారు

  • 28 Aug 2022 07:36 PM (IST)

    భువనేశ్వర్‌ కుమార్‌ తొలి ఓవర్‌..

    భారత్‌ తరఫున భువనేశ్వర్‌ కుమార్‌ తొలి ఓవర్‌ బౌలింగ్‌ చేశాడు. అతడిని ఎదుర్కొనేందుకు పాక్ కెప్టెన్ బాబర్ ఆజం, అతని భాగస్వామి మహ్మద్ రిజ్వాన్ క్రీజులో ఉన్నారు.

  • 28 Aug 2022 07:35 PM (IST)

    తృటిలో తప్పించుకున్న మహ్మద్ రిజ్వాన్..

    భువనేశ్వర్ కుమార్ వేసిన రెండో బంతికే మహ్మద్ రిజ్వాన్‌ను ఎల్‌బీడబ్ల్యూగా అంపైర్ ప్రకటించాడు. తర్వాత డీఆర్‌ఎస్‌లో నాటౌట్‌గా నిలిచాడు

  • 28 Aug 2022 07:31 PM (IST)

    మరికాసేపట్లో..

    ప్రస్తుతం మైదానంలో జాతీయ గీతం వినిపిస్తోంది. ఇది జరిగిన వెంటనే పాకిస్థాన్ జట్టు బ్యాటింగ్ ప్రారంభమవుతుంది. అందరి చూపు బాబర్ అజామ్ బ్యాటింగ్ పైనే ఉంది

  • 28 Aug 2022 07:30 PM (IST)

    మైదానంలో జాతీయ గీతం

    మ్యాచ్‌కు ముందు ఇరు జట్ల ఆటగాళ్లు సంప్రదాయ పద్ధతిలో జాతీయ గీతాన్ని ఆలపిస్తున్నారు. ఆటగాళ్లకు ఇది చిరస్మరణీయమైన ఘట్టంగా మిగిలిపోయింది. వారు భావోద్వేగానికి లోనవుతారు.

  • 28 Aug 2022 07:25 PM (IST)

    పాకిస్థాన్ ప్లేయింగ్ XI

    బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్, ఫఖర్ జమాన్, ఇఫ్తికర్ అహ్మద్, ఖుష్దిల్ షా, ఆసిఫ్ అలీ, షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్, నసీమ్ షా, హారీస్ రవూఫ్, షానవాజ్ దహానీ

  • 28 Aug 2022 07:20 PM (IST)

    టీమ్ ఇండియాకు రాహుల్ గాంధీ శుభాకాంక్షలు

    కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఈ వీడియోను షేర్ చేస్తూ టీమ్ ఇండియాకు శుభాకాంక్షలు తెలిపారు. అందరూ ఈ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు. నా వైపు నుంచి టీమిండియా అభినందనలు. కష్టపడి ఆడి గెలవాలని రాహుల్ ఆకాంక్షించారు.

  • 28 Aug 2022 07:11 PM (IST)

    టీమ్ ఇండియా ప్లేయింగ్ XI జట్టు ఇదే..

    రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, దినేష్ కార్తీక్, భువనేశ్వర్ కుమార్, యుజువేంద్ర చాహల్, అవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్.

  • 28 Aug 2022 07:09 PM (IST)

    అందుకే ఇలా వస్తున్నారు..

    తమ దేశంలో వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు సంఘీభావం తెలిపేందుకు పాక్ ఆటగాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఓ పాకిస్తానీ జర్నలిస్ట్‌ ట్వీట్‌ చేశారు.

  • 28 Aug 2022 07:03 PM (IST)

    టాస్ గెలిచిన టీమిండియా..

    టీమిండియా టాస్ గెలిచింది. బౌలింగ్ ఎంచుకుంది. INDvPAK మ్యాచ్ ప్రారంభానికి ముందు, భారత్, పాకిస్తాన్ నుంచి క్రికెట్ ప్రేమికులు తమ తమ జట్లను ఉత్సాహపరిచేందుకు స్టేడియం వద్దకు చేరుకున్నారు.

  • 28 Aug 2022 06:14 PM (IST)

    పాకిస్తాన్ చివరిసారిగా భారత్‌పై

    పాకిస్తాన్ చివరిసారిగా మార్చి 2014లో భారత్‌పై ఆసియా కప్‌ను గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ మరో రెండు బంతులు మిగిలి ఉండగానే ఓ వికెట్ తేడాతో విజయం సాధించింది. అశ్విన్ వేసిన ఓవర్లో షాహిద్ అఫ్రిది రెండు సిక్సర్లు బాది పాక్ జట్టుకు విజయాన్ని అందించాడు.

  • 28 Aug 2022 05:59 PM (IST)

    ఆసక్తికర సమరంపై…

    ఆసక్తికర సమరంపై క్రీడాభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. 2018లో జరిగిన ఆసియాకప్‌ను కొల్లగొట్టింది మనోళ్లే. ఇప్పుడు హాట్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది కూడా మనవాళ్లే. గతేడాది టీ-20 ప్రపంచకప్‌లో భారత్‌-పాక్‌ తలపడ్డాయి. అది కూడా ఇదే దుబాయ్‌ గడ్డపై.

Follow us on