IND vs PAK: ఒకట్రెండు కాదు ఫ్యాన్స్.. భారత్, పాక్ మధ్య ఏకంగా 10 మ్యాచ్‌లు.. ఎప్పుడు, ఎక్కడంటే?

India vs Pakistan: అభిమానులకు అదిరిపోయే వార్త! భారత్, పాకిస్థాన్ జట్లు వచ్చే ఏడాది కాలంలో ఏకంగా 10 సార్లు తలపడే అవకాశం ఉంది. అండర్-19 ఆసియా కప్‌తో ఈ పోరాటాలకు తెరలేవనుంది. వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ వంటి యువ ఆటగాళ్లు పాకిస్థాన్‌పై తమ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు.

IND vs PAK: ఒకట్రెండు కాదు ఫ్యాన్స్.. భారత్, పాక్ మధ్య ఏకంగా 10 మ్యాచ్‌లు.. ఎప్పుడు, ఎక్కడంటే?
Ind Vs Pak Matches

Updated on: Nov 04, 2026 | 8:07 AM

India vs Pakistan: క్రికెట్ ప్రపంచంలో అత్యంత ఆసక్తికరమైన పోరు అంటే భారత్, పాకిస్థాన్ (India vs Pakistan) జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లే. ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్ అంటే అభిమానులకు పండగే. అలాంటి క్రికెట్ ప్రేమికులకు ఇప్పుడు ఓ ఆసక్తికరమైన వార్త తెరపైకి వచ్చింది. వచ్చే ఏడాది కాలంలో భారత్, పాకిస్థాన్ జట్లు ఏకంగా 10 సార్లు తలపడే అవకాశం ఉందని తెలుస్తోంది. అండర్-19 ఆసియా కప్, రైజింగ్ స్టార్ ఆసియా కప్, ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ వంటి టోర్నీల్లో ఈ రెండు జట్లు తలపడే ఛాన్స్ ఉంది. ఈ పోరులో యువ సంచలనాలు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi), అభిషేక్ శర్మ (Abhishek Sharma) తమ బ్యాటింగ్‌తో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

నవంబర్‌లోనే నాలుగు పోరులు..?

భారత్, పాకిస్థాన్ మధ్య పోరుకు అండర్-19 ఆసియా కప్‌తో తెరలేవనుంది. నవంబర్ 8న ఈ టోర్నీలో తొలి మ్యాచ్ జరగనుంది. రెండు జట్లు ఫైనల్‌కు చేరితే మరోసారి తలపడే అవకాశం ఉంటుంది. ఇక రైజింగ్ స్టార్ ఆసియా కప్‌లో నవంబర్ 22న భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. నవంబర్ 29న జరిగే ఫైనల్‌కు రెండు జట్లు చేరితే ఈ టోర్నీలోనూ రెండుసార్లు పోరు చూడొచ్చు. దీంతో నవంబర్‌లోనే నాలుగు మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది.

ఆసియా కప్‌లో మూడు సార్లు ఢీ..!

వచ్చే ఏడాది జూన్, జూలై నెలల్లో ఆసియా కప్ జరగనుంది. వన్డే ప్రపంచకప్‌కు ముందు ఈ టోర్నీని వన్డే ఫార్మాట్‌లో నిర్వహించే అవకాశం ఉంది. గ్రూప్ దశ, సూపర్-4, ఫైనల్.. ఇలా మూడు దశల్లోనూ భారత్, పాకిస్థాన్ తలపడే ఛాన్స్ ఉంటుంది. అయితే అధికారిక షెడ్యూల్, గ్రూపుల వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది.

2027 వన్డే ప్రపంచకప్‌లోనూ మూడు మ్యాచ్‌లు?

2027 వన్డే ప్రపంచకప్‌కు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ మెగా టోర్నీలోనూ భారత్, పాకిస్థాన్ మధ్య మూడు మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉందని అంచనా. గ్రూప్ దశ, సూపర్-7, నాకౌట్ లేదా ఫైనల్‌లో రెండు జట్లు ఎదురుపడితే అభిమానులకు మరోసారి హై వోల్టేజ్ క్రికెట్ వినోదం ఖాయం. అయితే ఇవన్నీ టోర్నీ ఫార్మాట్, జట్ల ప్రదర్శనపై ఆధారపడి ఉంటాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us