IND vs NZ: రోహిత్ ఇలా చేయడం ఏం బాగోలేదు.. ఇంతమాత్రం దానికి ఆ ఆల్‌రౌండర్‌ అవసరమా?: ఆకాష్ చోప్రా విమర్శలు

|

Nov 18, 2021 | 4:08 PM

Rohit Sharma: టీ20 ఫార్మాట్‌లో టీమ్‌ఇండియాకు కొత్త కెప్టెన్‌గా రోహిత్ శర్మ నియమితుడైన సంగతి తెలిసిందే. విజయంతో తన తొలి ప్రయాణాన్ని ప్రారంభించి ఆకట్టుకున్నాడు.

IND vs NZ: రోహిత్ ఇలా చేయడం ఏం బాగోలేదు.. ఇంతమాత్రం దానికి ఆ ఆల్‌రౌండర్‌ అవసరమా?: ఆకాష్ చోప్రా విమర్శలు
Ind Vs Nz Rohit Sharma
Follow us on

India vs New Zealand: భారత టీ20 క్రికెట్ జట్టుకు కొత్త కెప్టెన్‌గా రోహిత్ శర్మ నియమితుడైన సంగతి తెలిసిందే. తొలి ప్రయాణాన్ని అద్భుతంగా ప్రారంభించాడు. సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో బుధవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో రోహిత్ సారథ్యంలోని భారత్ ఐదు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. ఈ విజయంతో అందరూ సంతోషిస్తున్నారు. రోహిత్ కెప్టెన్సీ కూడా ఆకట్టుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో భారత మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా రోహిత్ కెప్టెన్సీ గురించి ఒక విషయాన్ని పేర్కొన్నాడు. అతను జట్టు ఆలోచన, వ్యూహాన్ని ప్రశ్నించాడు. ఈ మ్యాచ్‌లో వెంకటేష్ అయ్యర్‌ని టీమిండియా వాడిన తీరు ఆకాష్‌కి నచ్చలేదు. అయ్యర్ తన మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్నాడంటూ గుర్తు చేశాడు.

అయ్యర్‌కు 6వ నంబర్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం లభించింది. అతను చివరి ఓవర్‌లో వచ్చాడు. ఒక ఫోర్‌ కొట్టి ఔటయ్యాడు. హార్దిక్ పాండ్యాకు మారుగా అయ్యర్‌ను తీసుకున్నారు. బౌలింగ్‌ కూడా చేయగలడు. అయ్యర్‌ను ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా తీసుకున్నారని, అయితే నిన్న జరిగిన మ్యాచులో మాత్రం బౌలింగ్ చేయలేదని ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో చెప్పాడు. “భారత జట్టు తమకు ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ అవసరమని పేర్కొన్న సంగతి తెలిసిందే. బ్యాటింగ్‌లో మాత్రం అయ్యర్‌కు 6వ స్థానంలో ఉంచారు. కానీ, ఈమ్యాచులో బౌలింగ్ మాత్రం వేయించలేదు. రోహిత్ చేసే అతి తక్కువ తప్పుల్లో ఇదొకటి అని చెప్పొచ్చు. అతని కెప్టెన్సీ సాధారణంగా అద్భుతమైనది. కానీ అతని నిర్ణయం నన్ను కలవరపరిచింది” అని పేర్కొన్నాడు.

బౌలర్‌గా అయ్యర్‌ను రోహిత్ ఏ విధంగా ఉపయోగించుకోగలడో కూడా ఆకాష్ పేర్కొన్నాడు. “ టాస్ గెలిచిన రోహిత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. మిడిల్ ఓవర్లో వికెట్ తీసేందుకు భారత బౌలర్లు కష్టపడ్డారు. ఇలాంటి టైంలో వెంకటేష్ అయ్యర్‌తో బౌలింగ్ చేపించాల్సింది. దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్‌లు అంతగా ఆకట్టుకోలేకపోవడంతో వారితో ఒకటి లేదా రెండు ఓవర్లు వేయించాల్సింది” అని తెలిపాడు.

IPL-2021లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడిన అయ్యర్ అద్భుత ప్రదర్శన చేశాడు. 10 మ్యాచ్‌ల్లో 370 పరుగులు చేశాడు. దీంతో పాటు మూడు వికెట్లు తీయడంలో కూడా సఫలమయ్యాడు. అతను ఐపీఎల్‌లో ఓపెనర్‌గా ఆడినప్పటికీ, న్యూజిలాండ్‌పై నంబర్-6లో ఆడాడు.

Also Read: వివాదాలకు కేరాఫ్ అడ్రస్ ఆ మైదానం.. అక్కడ మ్యాచ్ అంటేనే భయపడుతోన్న బ్యాట్స్‌మెన్స్.. భారత్, కివీస్ తొలి టెస్ట్‌పై నెలకొన్న ఆసక్తి

2023 World Cup: భారత్‌లో జరిగే 2023 వన్డే ప్రపంచకప్‌ తర్వాత ఆ లీగ్ రద్దు.. ఐసీసీ కీలక నిర్ణయం.. ఎందుకంటే?