Virat Kohli: నీ ఆటకు మేమంతా ఫిదా.. నువ్వే మా యువకులకు కొండంత అండ: కోహ్లీ కెప్టెన్సీ వదులుకోవడంపై పాకిస్తాన్ ఫ్యాన్స్ ట్వీట్లు

| Edited By: Anil kumar poka

Nov 09, 2021 | 3:17 PM

కెప్టెన్‌గా తన చివరి టీ20 ఆడిన విరాట్ కోహ్లీ.. ఘన విజయంతో ముగింపు పలికాడు. అయితే కోహ్లీపై అంతా ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు. ఇందులో ప్రత్యర్థులకు చెందిన టీంలు కూడా చేరిపోయాయి.

Virat Kohli: నీ ఆటకు మేమంతా ఫిదా.. నువ్వే మా యువకులకు కొండంత అండ: కోహ్లీ కెప్టెన్సీ వదులుకోవడంపై పాకిస్తాన్ ఫ్యాన్స్ ట్వీట్లు
Virat Kohli
Follow us on

Virat Kohli: కెప్టెన్‌గా తన చివరి టీ20 ఆడిన విరాట్ కోహ్లీ.. ఘన విజయంతో ముగింపు పలికాడు. అయితే కోహ్లీపై అంతా ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు. ఇందులో ప్రత్యర్థులకు చెందిన టీంలు కూడా చేరిపోయాయి. అయితే చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ కూడా ఈ జాబితాలో చేరింది. నెట్టింట్లో విరాట్‌పై ఉన్న ప్రేమను చూపిస్తూ కామెంట్లు కూడా చేస్తున్నారు. నమీబియాతో మ్యాచ్ తర్వాత భారత టీ20 కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీకి పాకిస్థాన్ నుంచి ప్రేమ సందేశాలు రావడం మొదలయ్యాయి.

కెప్టెన్‌గా విరాట్ కోహ్లి ఆడిన చివరి టీ20 మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో నమీబియాపై విజయం సాధించింది. 28 బంతులు మిగిలి ఉండగానే ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచింది. తొలుత ఆడిన నమీబియా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. అనంతరం 133 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 15.2 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. కెప్టెన్ విరాట్ కోహ్లి ఆఖరి టీ20 మ్యాచ్‌లో రవీంద్ర జడేజా 16 పరుగులకు 3 వికెట్లు పడగొట్టి భారత విజయ వీరుడిగా మారాడు.

అయితే కెప్టెన్‌గా చివరి మ్యాచ్ ఆడిన విరాట్ కోసం పాకిస్థాన్ నుంచి పాజిటివ్ సందేశాలు వస్తున్నాయి. అయితే ఈ విజయం తరువాత టీ20 కెప్టెన్సీ నుంచి విరాట్ తప్పుకోవడంపై భారత అభిమానులనే కాకుండా పాకిస్థాన్‌లోని ఓ వర్గాన్ని కూడా కుదిపేసింది. టీ20 కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ చివరి మ్యాచ్ ఆడిన తర్వాత, పాకిస్థాన్ డాన్ న్యూస్ జర్నలిస్ట్ ఇమ్రాన్ సిద్ధిఖీ ట్వీట్ చేస్తూ, “పాకిస్థానీయులుగా మేం టీమ్ ఇండియా, విరాట్ కోహ్లీ గురించి చాలా మీమ్‌లను పంచుకుంటాం. కానీ, మనందరికీ ఒక విషయం మనస్పూర్తిగా తెలుసు. విరాట్ గొప్పవాడు అని అందరికీ తెలుసు. చాలా మంది పాకిస్తాన్ యువకులను క్రికెట్‌లో ముందుకు సాగడానికి స్ఫూర్తినిచ్చాడు. విరాట్ కోహ్లీ నిజమైన క్రీడాకారుడు. పాకిస్తాన్‌లో విరాట్‌కు చాలామంది అభిమానులు ఉన్నారు” అని పేర్కొన్నాడు.

పాకిస్థాన్‌లో విరాట్ ‘సూపర్ ఫ్యాన్’..
పాకిస్థాన్‌కు చెందిన ఓ క్రికెట్ అభిమాని కూడా కోహ్లీపై విపరీతమైన ప్రేమను కురిపించాడు. మరోవైపు, విరాట్ అనే పాకిస్థానీ జెర్సీని ధరించిన ఫొటోను జర్నలిస్ట్ షిరాజ్ హసన్ పంచుకున్నారు. విరాట్ కోహ్లీకి ఉన్న ఈ వీరాభిమాని పేరు అవైష్ నిజామీ అంటూ ట్వీట్ చేశాడు.

ఇంగ్లండ్‌కు చెందిన బామి ఆర్మీ కూడా విరాట్‌కు సెల్యూట్ చేసింది. విరాట్ కోహ్లి పాకిస్థాన్ హృదయాన్ని గెలుచుకుంటే, అతని కెప్టెన్సీ కెరీర్‌కు ఇంగ్లండ్‌కు చెందిన బామి ఆర్మీ కూడా శుభాకాంక్షలు పంపించింది. ఇంగ్లండ్‌కు చెందిన బామి ఆర్మీ కూడా ట్వీట్ చేస్తూ, భవిష్యత్తులో ఆటగాడిగా మీరు కఠినమైన పోటీని చూడగలరని ఆశిస్తున్నాం’ అంటూ ట్వీట్ చేసింది.

విరాట్‌ కోహ్లి అంటే ఆటలో గుర్తొచ్చేది దూకుడు. ఇదే విషయాన్ని నమీబియాతో మ్యాచ్ తర్వాత కూడా మరోసారి వెల్లడించాడు. దూకుడును వదులుకుంటే క్రికెట్ ఆడలేనని విరాట్ పేర్కొన్నాడు.

Also Read: Virat Kohli: టీ20తోపాటు వన్డే, టెస్టు కెప్టెన్సీని కూడా కోహ్లీ వదులుకోవాలా?.. వీరేంద్ర సెహ్వాగ్‌ ఏమన్నాడంటే..!

India New T20I Captain: భారత టీ20 క్రికెట్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే సమర్థుడు అతడే: కొత్త కెప్టెన్‌పై రవిశాస్త్రి..