
క్రికెట్ అభిమానులకు మరో ఆసక్తికరమైన మ్యాచ్‌కి రంగం సిద్ధమైంది. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ ఛాంపియన్, నంబర్-1 ర్యాంక్ జట్టు భారత్‌తో తలపడేందుకు జపాన్ తన జట్టును ప్రకటించింది. సెప్టెంబర్ 22న సానో ఇంటర్నేషనల్ క్రికెట్ మైదానంలో ఇరు జట్లు చారిత్రాత్మక టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో తలపడనున్నాయి. జపాన్ క్రికెట్ చరిత్రలో ఈ మ్యాచ్ ప్రత్యేకంగా నిలవనుంది.
జపాన్ తరఫున టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన కెండెల్ కడోవాకి-ఫ్లెమింగ్ మరోసారి జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. ఇబ్రహీం తకాహషి, డెక్లాన్ సుజుకి-మెక్‌కాంబ్ కూడా జట్టులో కీలక ఆటగాళ్లుగా ఉన్నారు. వీరిద్దరూ ఇప్పటికే 50కి పైగా టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు. భారత్‌తో మ్యాచ్‌కు ఎంపిక చేసిన జట్టునే ఆ తర్వాత నగోయాలో జరిగే ఆసియా క్రీడల్లోనూ కొనసాగించాలని జపాన్ నిర్ణయించింది. ఆసియా క్రీడల నిబంధనలకు అనుగుణంగా ఉండేలా జట్టును ఎంపిక చేసినట్లు తెలిపింది.
దేశవాళీ పోటీల్లో ఆకట్టుకున్న స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ జేక్ కుసుడా-నైర్న్‌కు జట్టులో అవకాశం లభించింది. 2013లో జపాన్ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సుయోషి తకాడా కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు. జపనీస్ పాఠశాలల్లో క్రికెట్ కార్యక్రమాల్లో పాల్గొన్న వటారు మియౌచి, మకోటో తనియామా కూడా స్క్వాడ్‌లో ఉన్నారు. లెగ్ స్పిన్నర్ అయిన తనియామా, దిగ్గజ ఆస్ట్రేలియా క్రికెటర్ షేన్ వార్న్ వీడియోలను చూస్తూ తన బౌలింగ్ యాక్షన్‌ను తీర్చిదిద్దుకున్నాడు. వార్న్‌కు గౌరవంగా 23వ నంబర్ జెర్సీ ధరిస్తున్న అతను, జపాన్‌కు అన్ని పాత్‌వే, అంతర్జాతీయ పోటీల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. టాంజానియాపై విజయం సాధించిన జపాన్ అండర్-19 ప్రపంచకప్ జట్టులో ఆడిన చార్లీ హరా-హింజ్‌కు కూడా అవకాశం దక్కింది. చేతి గాయం కారణంగా ఈస్ట్ ఏషియా-పసిఫిక్ టీ20 ప్రపంచకప్ 2028 సబ్-రీజనల్ క్వాలిఫయర్‌కు దూరమైన బెంజమిన్ ఇటో-డేవిస్ తిరిగి జట్టులోకి వచ్చాడు.
కెండెల్ కడోవాకి-ఫ్లెమింగ్ (కెప్టెన్), చార్లీ హర-హింజ్, బెంజమిన్ ఇటో-డేవిస్, అలెస్టర్ కడోవాకి-ఫ్లెమింగ్, కోహెయ్ కుబోటా, జేక్ కుసుడా-నైర్న్, వటారు మియౌచి (wk), రియో సకురానో-థామస్, అలెక్స్ షిరాయ్-పట్మోర్, షోయాక్-స్లాన్ సుజుకి-మెక్‌కాంబ్, సుయోషి తకడ, ఇబ్రహీం తకహషి, మకోటో తనియామా, లచ్లాన్ యమమోటో-లేక్
A historic one-off T20I awaits Japan as they name a 15-member squad to take on India 💪
Read more 👉 https://t.co/MMEoQLduMy pic.twitter.com/cZLtsniKnb
— ICC (@ICC) September 8, 2026