India Vs England: ‘రోహిత్ హర్భజన్ శర్మ’.. కొత్త అవతారమెత్తిన హిట్‌మ్యాన్.. సలహా ఇచ్చిన పంత్.!

|

Feb 06, 2021 | 9:10 PM

India Vs England: స్టార్ ఓపెనర్‌గా, సిక్సర్ల స్పెషలిస్ట్‌గా పేరుగాంచిన రోహిత్ శర్మ ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న తొలి టెస్టులో మొదటిసారిగా స్పిన్ బౌలింగ్..

India Vs England: రోహిత్ హర్భజన్ శర్మ.. కొత్త అవతారమెత్తిన హిట్‌మ్యాన్.. సలహా ఇచ్చిన పంత్.!
Follow us on

India Vs England: స్టార్ ఓపెనర్‌గా, సిక్సర్ల స్పెషలిస్ట్‌గా పేరుగాంచిన రోహిత్ శర్మ ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న తొలి టెస్టులో మొదటిసారిగా స్పిన్ బౌలింగ్ చేసి అభిమానులను అబ్బురపరిచాడు. రెండో రోజు టీ బ్రేక్ తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లి బంతిని రోహిత్ శర్మకు అందించాడు. టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్టైల్‌ను అనుకరిస్తూ రోహిత్ శర్మ 2 ఓవర్లు వేసి 7 పరుగులు ఇచ్చాడు. భజ్జీలా చేతులు తిప్పుతూ బంతిని విసిరాడు. రోహిత్ శర్మ అనుకరించిన ఈ స్టైల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇక రోహిత్ స్పిన్ బౌలింగ్ చేయడం ఇదే మొదటిసారి. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో అతడు మీడియం పేస్ బౌలింగ్ చేశాడు. ఇదిలా ఉంటే రోహిత్ బౌలింగ్ చేస్తున్న సమయంలో వికెట్ల వెనుక నుంచి పంత్ సలహా ఇవ్వగా.. ‘అలాగే సర్’ అంటూ వినయంగా బదులిచ్చాడు. కాగా, అటు మొదటి రోజు స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తూ హెల్మెట్ పెట్టుకుని రోహిత్ నవ్వులు పూయించిన సంగతి తెలిసిందే.

Also Read: అల్లు అర్జున్ కార్వాన్‏ను ఢీకొట్టిన లారీ.. ఖమ్మం సమీపంలో రోడ్డు ప్రమాదం..