ఇండియా విజయాలకు బ్రేక్..ఇంగ్లాండ్ చేతిలో ఓటమి

బర్మింగ్‌హమ్ వేదికగా జరుగుతున్న ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ వరల్డ్ కప్ టోర్నీ లీగ్ మ్యాచ్‌లో భారత్ తొలిసారి పరాజయం పాలైంది. వరుసగా మ్యాచుల్లో తిరుగులేని విజయాలను నమోదు చేసిన కోహ్లీ సేన 338 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో తడబడింది. అటు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ ను నిలువరించడంలో బౌలింగ్ పరంగా విఫలమవగా, ఛేజింగ్‌లో బ్యాటింగ్ పరంగానూ టీమిండియా విఫలమైంది. ఫలితంగా టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 306 […]

ఇండియా విజయాలకు బ్రేక్..ఇంగ్లాండ్ చేతిలో ఓటమి
Follow us

|

Updated on: Jun 30, 2019 | 11:31 PM

బర్మింగ్‌హమ్ వేదికగా జరుగుతున్న ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ వరల్డ్ కప్ టోర్నీ లీగ్ మ్యాచ్‌లో భారత్ తొలిసారి పరాజయం పాలైంది. వరుసగా మ్యాచుల్లో తిరుగులేని విజయాలను నమోదు చేసిన కోహ్లీ సేన 338 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో తడబడింది. అటు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ ను నిలువరించడంలో బౌలింగ్ పరంగా విఫలమవగా, ఛేజింగ్‌లో బ్యాటింగ్ పరంగానూ టీమిండియా విఫలమైంది. ఫలితంగా టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 306 పరుగులకు పరిమితమైంది. దీంతో ఇంగ్లాండ్ 31 పరుగుల తేడాతో భారత్ ను ఓడించింది.

కాగా టార్గెట్ ఛేదనలో భాగంగా 2 ఓవర్లోనే ఓపెనర్ కేఎల్ రాహుల్ పరుగులేమీ చేయకుండానే డకౌట్ అయ్యాడు. దీంతో భారమంతా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపైనే పడింది. ఇద్దరూ నెమ్మదిగా ఆడుతూ వికెట్లు పడకుండా జాగ్రత్త పడ్డారు. స్కోరు 50 పరుగులు దాటేందుకు 14 ఓవర్లు పట్టింది. అనంతరం విరాట్ కోహ్లీ ధాటిగా ఆడి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అలాగే రోహిత్ శర్మ సైతం హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో 22 ఓవర్లకు స్కోరు 100 దాటింది. అయితే 28వ ఓవర్లో కోహ్లీ(66) ఔట్ కావడంతో భారీ లక్ష్య ఛేదనలో ఒత్తిడి పెరిగింది. అనంతరం రోహిత్ శర్మ(102) సెంచరీ పూర్తి చేసుకొని వెనుతిరిగాడు. ఆ తర్వాత వచ్చి రిషబ్ పంత్ (32), హార్దిక్ పాండ్యా (45) ధాటిగా పరుగులు సాధించే క్రమంలో ఔటయ్యారు. ఆ తర్వాత వచ్చి ధోనీ సైతం వేగంగా పరుగులు సాధించడంలో విఫలమయ్యాడు.

ఇదిలా ఉంటే టాస్ గెలిచిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. ఇదిలా ఉంటే ఓపెనర్లు జాసన్ రాయ్ (66), బెయిర్ స్టో(111) రాణించగా తొలివికెట్ భాగస్వామ్యానికి ఇంగ్లాండ్ కేవలం 22 ఓవర్లకే 160 సాధించింది. జాసన్ రాయ్ ఔట్ అయినప్పటికీ ఇంగ్లాండ్ బెయిర్ స్టో రాణించి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇంగ్లాండ్ జట్టు కేవలం 30 ఓవర్లకే 200 స్కోరు దాటింది. అనంతరం జానీ బెయిర్ స్టో 31 ఓవర్లో వెనుదిరిగ్గా, ఆ తర్వాత వెంటనే వచ్చినా ఇయాన్ మోర్గాన్ కేవలం ఒక పరుగుకే పెవిలియన్ ఔటయ్యాడు. అనంతరం వచ్చిన బెన్ స్టోక్స్ (79) రాణించడంతో ఇంగ్లాండ్ స్కోరు 300 దాటింది. భారత్ బౌలర్లలో షమి 5 వికెట్లు పడగొట్టగా, బుమ్రా, కుల్ దీప్ యాదవ్ చెరో వికెట్ పడగొట్టారు.

Latest Articles
రైలు టికెట్‌ ప్రయాణానికి మాత్రమే కాదు.. ఈ ఉచిత సేవలు కూడా..
రైలు టికెట్‌ ప్రయాణానికి మాత్రమే కాదు.. ఈ ఉచిత సేవలు కూడా..
ICSE ISC పదో తరగతి, 12వ తరగతి ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి!
ICSE ISC పదో తరగతి, 12వ తరగతి ఫలితాలు విడుదల.. బాలికలదే పైచేయి!
మండె ఎండల్లో అందాల అరకు టూర్‌.. తక్కువ బడ్జెట్‌లోనే..
మండె ఎండల్లో అందాల అరకు టూర్‌.. తక్కువ బడ్జెట్‌లోనే..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే..అలవెన్సులు చూస్తే ఆశ్చర్యపోతారు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే..అలవెన్సులు చూస్తే ఆశ్చర్యపోతారు
సెకండ్ ఇన్నింగ్ లో బిజీ బిజీగా గడిపేస్తున్న ప్రియమణి
సెకండ్ ఇన్నింగ్ లో బిజీ బిజీగా గడిపేస్తున్న ప్రియమణి
డిగ్రీ అర్హతతో కేంద్ర కొలువులకు యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
డిగ్రీ అర్హతతో కేంద్ర కొలువులకు యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
ఆహా.. హీరోయిన్స్‌ను బీట్ చేసేలా అందాలతో కావిస్తున్న హరితేజ
ఆహా.. హీరోయిన్స్‌ను బీట్ చేసేలా అందాలతో కావిస్తున్న హరితేజ
NEET UG 2024 పరీక్షలో క్వశ్చన్ పేపర్ లీకేజీపై NTA క్లారిటీ
NEET UG 2024 పరీక్షలో క్వశ్చన్ పేపర్ లీకేజీపై NTA క్లారిటీ
'సినిమాలో నటించాలి రాజకీయాల్లో కాదు'.. పవన్ కళ్యాణ్‎పై ముద్రగడ
'సినిమాలో నటించాలి రాజకీయాల్లో కాదు'.. పవన్ కళ్యాణ్‎పై ముద్రగడ
బీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
బీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..