India vs England 4th Test Live: టీమిండియా ఘన విజయం.. 3-1తో సిరీస్ కైవసం.. డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్​

|

Mar 06, 2021 | 4:58 PM

IND vs ENG: టీమిండియా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇన్నింగ్స్‌ 25 పరుగులతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరుకుంది.

India vs England 4th Test Live: టీమిండియా ఘన విజయం.. 3-1తో సిరీస్ కైవసం.. డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్​

India vs England: టీమిండియా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇన్నింగ్స్‌ 25 పరుగులతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరుకుంది. అశ్విన్‌ వేసిన 54.5వ బంతికి లారెన్స్‌ (50) క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. కోహ్లీసేన 3-1తేడాతో సిరీస్‌ కైవసం చేసుకుంది.

దీంతో.. ప్రపంచ టెస్టు ఛాంపియన్​ షిప్​ ఫైనల్లోకి దూసుకెళ్లింది. లార్డ్స్​ మైదానంలో న్యూజిలాండ్​తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైంది. ఇంగ్లాండ్​ తొలి ఇన్నింగ్స్​లో 205 పరుగులు చేయగా.. భారత్​ 365 పరుగులకు ఆలౌటైంది. 160 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్​ ఆరంభించిన పర్యటక జట్టు 135 రన్స్​కే కుప్పకూలింది.

టీమిండియా 0-1తో వెనకబడి గెలిచిన సిరీసులు..

 

డెబ్యూమ్యాచ్‌నే అద్భుతం సృష్టించిన అక్షర్ పటేల్.. చరిత్ర పుటల్లో చోటు దక్కించుకున్నాడు. అరంగేట్రం సిరీసులో అత్యధిక వికెట్లు

27 అక్షర్‌ పటేల్‌         vs ఇంగ్లాండ్‌ 2020/21 
26 అజంత మెండిస్‌ vs భారత్‌ 2008
24 అలెక్‌ బెడ్సర్‌       vs భారత్‌ 1946
22 అశ్విన్‌                    vs వెస్టిండీస్‌ 2011/12
20 స్టువర్ట్‌ క్లార్క్‌           vs దక్షిణాఫ్రికా 2005/06

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 06 Mar 2021 04:40 PM (IST)

    ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లోకి…

  • 06 Mar 2021 04:14 PM (IST)

    టీమిండియా 0-1తో వెనకబడి గెలిచిన సిరీసులు.. ఇంగ్లాండ్‌‌పై 1972 తర్వాతే ఇప్పుడే..

    ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరుకున్న టీమిండియా. జూన్‌ 18 నుంచి 22 వరకు లార్డ్స్‌ వేదికగా న్యూజిలాండ్‌తో తలపడుతుంది.

  • 06 Mar 2021 03:54 PM (IST)

    భారత్‌ ఘన విజయం

    టీమిండియా అద్భుతమైన విజయం సొంతం చేసుకుంది. ఇన్నింగ్స్‌ 25 పరుగులతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరుకుంది. అశ్విన్‌ వేసిన 54.5వ బంతికి లారెన్స్‌ (50) క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. కోహ్లీసేన 3-1తేడాతో సిరీస్‌ కైవసం చేసుకుంది.

  • 06 Mar 2021 02:40 PM (IST)

    మూడో రోజు రెండో సెషన్‌ మొదలు.. నిలకడగా ఇంగ్లాండ్..

    ఇంగ్లాండ్‌ మూడో రోజు రెండో సెషన్‌ మొదలు పెట్టింది. 91/6తో టీ విరామానికి వెళ్లిన ఆ జట్టు బ్యాట్స్‌మెన్..‌ ఫోక్స్‌(8), లారెన్స్‌(21) తర్వాత కూడా నిలకడగా ఆడుతున్నారు. ఈ క్రమంలోనే 35 ఓవర్లకు ఆ జట్టు స్కోర్‌ 95/6గా నమోదైంది.

  • 06 Mar 2021 02:24 PM (IST)

    ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో టీ విరామ సమయానికి 91/6తో నిలిచింది. లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ బెన్‌ఫోక్స్‌(6), లారెన్స్‌(19) నిలకడగా ఆడుతున్నారు. కష్టాల్లో ఉన్న ఇంగ్లాండ్ జట్టును ఆదుకునే ప్రయత్నాలను మొదలు పెట్టారు. 65 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే 33 ఓవర్లు పూర్తయ్యేసరికి ఆ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. మరోవైపు టీమ్‌ఇండియా విజయానికి నాలుగు వికెట్ల దూరంలో నిలిచింది.

  • 06 Mar 2021 01:47 PM (IST)

    6వ వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్

    భారత బౌలర్ల దెబ్బకు ఇంగ్లాండ్ కప్పగంతులు వేస్తోంది. ఇంగ్లాండ్ కీలక వికెట్‌ను కోల్పోయింది.  ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో ప్రధాన బ్యాట్స్‌మెన్‌ అందరూ వెనుదిరిగారు. అశ్విన్‌ వేసిన 26వ ఓవర్‌లో ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జోరూట్‌(30) వికెట్లు ముందు దొరికిపోయాడు.

  • 06 Mar 2021 01:37 PM (IST)

    పోప్ ఔట్…

    ఇంగ్లాండ్ ఆటగాళ్లకు టీమిండియా బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. వరస వికెట్లు కోల్పోతున్న ఇంగ్లీష్ట జట్టు 5వ వికెట్ పోప్ కోల్పోయింది.

  • 06 Mar 2021 01:34 PM (IST)

    పోప్ సిక్సర్‌

    రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 50 పరుగులు దాటింది. అశ్విన్‌ వేసిన 22వ ఓవర్‌లో పోప్‌ సిక్సర్‌ బాదడంతో ఆ జట్టు స్కోర్‌ 54కి చేరింది.

  • 06 Mar 2021 01:29 PM (IST)

    భారత క్రికెట్ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ను సత్కరించిన బీసీసీఐ

    టీమిండియా దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ భారత క్రికెట్‌లో అడుగుపెట్టి నేటికి 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ విశేషమైన సందర్భాన్ని పురస్కరించుకొని బీసీసీఐ అతడిని సత్కరించింది. భారత్‌, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మూడో రోజు సందర్భంగా భోజన విరామంలో బీసీసీఐ సెక్రటరీ జై షా చేతుల మీదుగా గావస్కర్‌కు జ్ఞాపిక అందజేశారు.

  • 06 Mar 2021 01:00 PM (IST)

    అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో బెన్‌స్టోక్స్ ఔట్..

    టీమిండియా బౌలర్లు విజృంభిస్తుండడంతో ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్లు ఇంటిముఖం పడుతున్నారు. 30 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో బెన్‌స్టోక్స్‌(2) స్వీప్‌ షాట్‌ కోహ్లీ చేతికి చిక్కాడు.

  • 06 Mar 2021 12:52 PM (IST)

    మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్..

    వేగంగా వికెట్లు కోల్పోతోంది ఇంగ్లాండ్.. ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో తడబడుతోంది. 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అక్షర్‌ పటేల్‌ వేసిన 10వ ఓవర్‌ చివరి బంతికి సిబ్లీ(3) ఔటయ్యాడు.

  • 06 Mar 2021 12:26 PM (IST)

    లంచ్ విరామం తర్వాత రెండు వికెట్లు..

    లంచ్ విరామం తర్వాత ఇంగ్లాండ్ వరుస వికెట్లను కోల్పోయింది. రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్న ఇంగ్లాండ్‌ జట్టుకు టీమిండియా షాకిచ్చింది. అశ్విన్‌ బౌలింగ్‌ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. క్రాలే 5(16), బెయిర్‌స్టో0(1)లు పెవిలియన్‌కు చేరారు.

  • 06 Mar 2021 12:19 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్ 10/1 (4.4)

    10/1 (4.4) తొలి వికెట్‌ను ఇంగ్లాండ్ జట్టు కోల్పోయింది. అశ్విన్‌ బౌలింగ్‌‌లో తొలి వికెట్ కోల్పోయింది. క్రాలే 5(16) పెవిలియన్‌కు పంపించాడు.

  • 06 Mar 2021 12:17 PM (IST)

    భోజన విరామ తర్వాత మొదలైన ఆట..

    లంచ్ బ్రేక్ తర్వాత ఆట మొదలైంది… క్రాలే(5), సిబ్లీ(1) క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్‌ ఇంకా 154 పరుగుల వెనుకంజలో ఉంది.

  • 06 Mar 2021 11:45 AM (IST)

    భోజన విరామ సమయానికి ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌ 6/0

    భోజన విరామ సమయానికి ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌ 6/0తో కొనసాగుతోంది. అంతకు ముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 365 పరుగులకు ఆలౌటయ్యాక ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించింది. లంచ్ బ్రేక్  సమయానికి ముందు 3 ఓవర్లలో ఆ జట్టు ఓపెనర్లు 6 పరుగులు చేశారు. క్రాలే(5), సిబ్లీ(1) క్రీజులో ఉన్నారు.

Follow us on