Ind vs Eng 3rd ODI Predicted Playing 11: నువ్వా.. నేనా? సిరీస్ డిసైడర్ మ్యాచ్‌లో హోరాహోరీ పోరుకు సిద్ధమైన భారత్, ఇంగ్లండ్..

|

Jul 17, 2022 | 8:24 AM

IND Vs ENG 3rd ODI Prediction Squads: ఇంగ్లండ్ విషయానికి వస్తే, జోస్ బట్లర్ జట్టు కూడా ఎటువంటి మార్పులు చేయకపోవచ్చు. ఓపెనర్ జాసన్ రాయ్ ఇటీవలి ఫామ్ ఖచ్చితంగా ఆందోళనలను పెంచిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Ind vs Eng 3rd ODI Predicted Playing 11: నువ్వా.. నేనా? సిరీస్ డిసైడర్ మ్యాచ్‌లో హోరాహోరీ పోరుకు సిద్ధమైన భారత్, ఇంగ్లండ్..
India Vs England 3rd Odi Predicted Playing 11
Follow us on

IND vs ENG 3rd ODI: టీమిండియా ఇంగ్లండ్(India vs England) పర్యటన ముగిసేందుకు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. జులై 1న ఎడ్జ్‌బాస్టన్ టెస్టుతో ప్రారంభమైన సిరీస్.. జులై 17 ఆదివారం జరిగే వన్డే సిరీస్‌లో మూడో, చివరి మ్యాచ్‌తో ముగుస్తుంది. ఎడ్జ్‌బాస్టన్ టెస్టులాగే ఇది కూడా నిర్ణయాత్మక మ్యాచ్‌ కావడం గమనార్హం. తొలి రెండు మ్యాచ్‌లు ముగిసేసరికి భారత్, ఇంగ్లండ్ 1-1తో సమంగా ఉండడంతో సిరీస్ విజేత ఎవరో ఈ మ్యాచ్ ద్వారా తేలిపోనుంది. ఈ మ్యాచ్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌ ఎవరనేది చర్చనీయాంశంగా మారింది. ఆదివారం మాంచెస్టర్‌లోని ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌ మైదానంలో ఈ మ్యాచ్‌ జరగనుంది. మూడేళ్ల క్రితం భారత జట్టు హృదయ విదారక ఓటమిని చవిచూసిన మైదానం ఇదే. ప్రపంచ కప్ 2019 సెమీ ఫైనల్‌లో భారత్‌ను ఓడించడం ద్వారా న్యూజిలాండ్ టైటిల్ మ్యాచ్‌కు చేరుకోకుండా నిలిపివేసింది. మూడేళ్ల తర్వాత ఇప్పుడు టీమిండియా ఈ గడ్డపై అడుగుపెట్టింది. ఈ మ్యాచ్‌కు సెమీ-ఫైనల్ అంత ప్రాముఖ్యత లేదు. కానీ, 8 సంవత్సరాలుగా ఇంగ్లాండ్‌లో భారత్ వన్డే సిరీస్ ఆడనందున ఇప్పటికీ ట్రోఫీ ప్రమాదంలో ఉంది.

ఆశించిన మార్పులు లేకపోవచ్చు..

ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉన్న ప్లేయింగ్ XI గురించి మాట్లాడితే, గత రెండు మ్యాచ్‌ల ప్లేయింగ్ ఎలెవన్‌ను పరిశీలిస్తే, రెండు జట్లలో ఎటువంటి మార్పు ఉండదని భావిస్తున్నారు. రెండు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఇలాంటి పరిస్థితుల్లో బౌలర్లలో ఎలాంటి మార్పు రాకపోవచ్చు. ఇప్పుడు ప్రశ్నంతా బ్యాటింగ్‌పైనే. ఓపెనర్ శిఖర్ ధావన్ రెండు మ్యాచ్‌ల్లోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. రెండో మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ ఘోరంగా విఫలమయ్యాడు. ఇంత జరిగినా ఇక్కడ ఎలాంటి మార్పు లేదు.

ఇవి కూడా చదవండి

కోహ్లి, పంత్‌పైనే దృష్టి..

విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ పైనే ఎక్కువ మంది దృష్టి ఉంటుంది. కోహ్లి గత మ్యాచ్‌లో విఫలమైనప్పటికీ, ప్రస్తుతానికి అతని స్థానానికి ఎలాంటి ముప్పు లేదు. అయినప్పటికీ, ఈ మ్యాచ్ అతనికి ఎంతో కీలకమైనది. ఎందుకంటే ఆ తర్వాత అతను వచ్చే ఒక నెల పాటు ఎటువంటి మ్యాచ్ ఆడడు. ఇటువంటి పరిస్థితిలో, అతను ఈ చివరి మ్యాచ్ నుంచి బలమైన పునరాగమనం చేయాలనుకుంటున్నాడు. వైట్ బాల్ క్రికెట్‌లో ఇప్పటి వరకు పంత్ బ్యాటింగ్ ఫామ్ కూడా ఆశించిన స్థాయిలో లేదు. గత మ్యాచ్‌లో ఖాతా కూడా తెరవలేకపోయాడు. అయినా తప్పించే అవకాశం లేదు.

ఇంగ్లండ్‌లో మార్పు వచ్చే అవకాశం..

ఇంగ్లండ్ విషయానికి వస్తే, జోస్ బట్లర్ జట్టు కూడా ఎటువంటి మార్పులు చేయకపోవచ్చు. ఓపెనర్ జాసన్ రాయ్ ఇటీవలి ఫామ్ ఖచ్చితంగా ఆందోళనలను పెంచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే బెన్ స్టోక్స్, జో రూట్ కూడా ఈ ఫార్మాట్‌లో ప్రభావం చూపలేకపోయారు. ఇప్పటికీ ముగ్గురూ ఆడాలని నిర్ణయించుకున్నారు. అయితే రెండు మ్యాచ్ ల్లోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయిన పేసర్ బ్రైడన్ కార్లను వదులుకునే అవకాశం ఉంది.

IND vs ENG: 3వ వన్డే కోసం ప్రాబబుల్ ప్లేయింగ్ XI ఇలా ఉండొచ్చు..

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, సూర్య కుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్.

ఇంగ్లాండ్ : జోస్ బట్లర్ (కెప్టెన్-కీపర్), జాసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో, జో రూట్, లియామ్ లివింగ్‌స్టన్, బెన్ స్టోక్స్, మోయిన్ అలీ, క్రెయిగ్ ఓవర్‌టన్, డేవిడ్ విల్లీ, బ్రైడెన్ కార్స్, రీస్ టాప్లీ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..