IND vs ENG 2nd Test 3rd Day: ఒత్తిడిలో రోహిత్ శర్మ.. 350+ టార్గెట్‌పై కన్నేసిన భారత్..

India vs England Second Test 3rd Day: రెండో ఇన్నింగ్స్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 5 ఓవర్లలో 28 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 13, జైస్వాల్ 15 పరుగులతో క్రీజులో ఉన్నారు. నిరంతర వైఫల్యాలను చవిచూస్తున్న హిట్‌మ్యాన్ ఈరోజు సత్తా చాటాల్సి ఉంటుంది. అయితే, టీమిండియా ఈ మ్యాచ్‌లో గెలవాలంటే 350 పరుగుల ఆధిక్యం సాధించాల్సి ఉంటుంది.

IND vs ENG 2nd Test 3rd Day: ఒత్తిడిలో రోహిత్ శర్మ.. 350+ టార్గెట్‌పై కన్నేసిన భారత్..
Ind Vs Eng 2nd Test 3rd Day

Updated on: Feb 04, 2024 | 9:20 AM

India vs England Second Test 3rd Day: వైజాగ్‌లోని డా. వైఎస్ రాజశేఖరరెడ్డి స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ మంచి ఆధిక్యంతో దూసుకెళ్తోంది. ఇంగ్లండ్‌ను 253 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్.. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఇక రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 13, జైస్వాల్ 15 పరుగులతో క్రీజులో నిలిచారు. 171 పరుగుల ఆధిక్యంతో నేడు మూడో రోజు ఆట ప్రారంభం కానుంది.

తొలి రోజు ఆట ముగిసే సమయానికి జైస్వాల్ 179 పరుగులు చేయడంతో భారత జట్టు మొత్తం 6 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. రెండో రోజు ఆట ప్రారంభంలో జైస్వాల్ దూకుడు బ్యాటింగ్ ప్రదర్శన కనబరిచాడు. అశ్విన్‌తో కలిసి 2వ రోజు ఆట ప్రారంభించిన జైస్వాల్ 277 బంతుల్లో డబుల్ సెంచరీతో చెలరేగాడు. మధ్యలో అశ్విన్ (20) వికెట్‌ కోల్పోయాడు.

దీంతో యశస్వి జైస్వాల్ మరింత దూకుడుగా ముందుకు సాగాడు. దీంతో జేమ్స్ అండర్సన్ బంతిని కొట్టేందుకు ప్రయత్నించి జానీ బెయిర్‌స్టోకు క్యాచ్ ఇచ్చాడు. దీంతో జైస్వాల్ 290 బంతుల్లో 7 సిక్సర్లు, 19 ఫోర్లతో 209 పరుగుల విజయవంతమైన ఇన్నింగ్స్ ముగిసింది.

ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా 6 పరుగులు చేసి రెహాన్ అహ్మద్ క్యాచ్ పట్టాడు. చివరి వికెట్ గా ముఖేష్ కుమార్ (0) ఔటయ్యాడు. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌటైంది.

అనంతరం తమ తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు తొలి వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించి ఆ తర్వాత వికెట్ కోల్పోయింది. ఓపెనర్ జాక్ క్రౌలీ 76 పరుగులతో అత్యధిక ఇన్నింగ్స్ ఆడగా, కెప్టెన్ బెన్ స్టోక్స్ 47 పరుగులు చేశాడు.

బౌలింగ్‌లో టీమిండియా తరపున మెరిసిన జస్ప్రీత్ బుమ్రా 6 వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్ 1 వికెట్ తీశాడు. ఆర్. అశ్విన్‌కు ఒక్క వికెట్ కూడా దక్కలేదు.

రెండో ఇన్నింగ్స్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 5 ఓవర్లలో 28 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 13, జైస్వాల్ 15 పరుగులతో క్రీజులో ఉన్నారు. నిరంతర వైఫల్యాలను చవిచూస్తున్న హిట్‌మ్యాన్ ఈరోజు సత్తా చాటాల్సిన ఒత్తిడిలో ఉంటాడు. అయితే, టీమిండియా ఈ మ్యాచ్‌లో గెలవాలంటే 350 పరుగుల ఆధిక్యం సాధించాల్సి ఉంటుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..