India vs England 2nd ODI : పోరాడి ఓడిన భారత్ .. 100 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ విజయం

|

Jul 15, 2022 | 12:51 AM

లార్డ్స్ వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య వన్డే సిరీస్ రెండో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 246 పరుగులు చేసి భారత్‌కు 247 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

India vs England 2nd ODI : పోరాడి ఓడిన భారత్ .. 100 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ విజయం
England
Follow us on

India vs England 2nd ODI : లార్డ్స్ వేదికగా భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య వన్డే సిరీస్ రెండో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 246 పరుగులు చేసి భారత్‌కు 247 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కానీ భారత్ ఆ టార్గెట్ ను చేరుకోలేక పోయింది. 146 పరుగులకే టీమిండియా ఆల్ అవుట్ అయ్యింది. తొలి ఇన్నింగ్స్ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా తడబడుతూ ఆటను కొనసాగించింది. చివరకు 100 పరుగుల తేడాతో భారత్ పై ఇంగ్లాండ్ విజయం సాధించింది.  మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియాకు 4 పరుగులకే తొలి దెబ్బ తగిలింది. 0 పరుగుల వద్ద రోహిత్ శర్మ ఔటయ్యాడు. దీని తర్వాత ధావన్ కూడా పెద్దగా రాణించలేక 9 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఈ రెండు వికెట్లు రీస్ టాప్లీ తీశాడు. సూర్య కుమార్ యాదవ్ కంటే ముందు భారత జట్టు మేనేజ్‌మెంట్ రిషబ్ పంత్‌ను బ్యాటింగ్‌కు పంపింది. అతను కూడా ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు.

పూర్తిగా సెటప్ చేసిన కోహ్లి మరోసారి పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. అతను 25 బంతులు ఎదుర్కొని  16 పరుగులకు అవుట్ అయ్యాడు. కోహ్లీ  3 ఫోర్లు కూడా కొట్టాడు. ఆరంభంలో 4 వికెట్లు పతనమైన తర్వాత, హార్దిక్ , సూర్యకుమార్ యాదవ్ కొంతసమయంపాటు టీమ్ ఇండియా ఇన్నింగ్స్‌ను హ్యాండిల్ చేసారు. ఇద్దరూ కూడా 54 బంతుల్లో 42 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నారు, అయితే రీస్ టాప్లీ మరోసారి షాకిచ్చాడు. అతడి బౌలింగ్ లో సూర్య కుమార్ బౌల్డ్ అయ్యాడు. ఇక బౌలింగ్ లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఘనత యుజువేంద్ర చాహల్‌ కు దక్కింది. అతను 4 వికెట్లు తీశాడు. అదే సమయంలో జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా చెరో 2 వికెట్లు తీశారు. ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు మొయిన్ అలీ బ్యాట్ నుండి వచ్చాయి. 64 బంతుల్లో 47 పరుగులు చేశాడు.

మరిన్ని క్రికెట్ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి