Ind vs Eng: దంచికొట్టిన ఇంగ్లాండ్.. రికార్డు బ్రేక్ చేసిన జో రూట్.. స్కోర్ల వివరాలు ఇవే..

|

Feb 06, 2021 | 5:00 PM

India vs England 1st Test Match Day 2 Highlights: టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ ఆధిపత్యం చెలాయిస్తోంది. రెండో రోజు...

Ind vs Eng: దంచికొట్టిన ఇంగ్లాండ్.. రికార్డు బ్రేక్ చేసిన జో రూట్.. స్కోర్ల వివరాలు ఇవే..
Follow us on

India vs England 1st Test Match Day 2 Highlights: టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్ ఆధిపత్యం చెలాయిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లీష్ జట్టు 555/8 పరుగులు చేసింది. కెప్టెన్ జో రూట్(218: 377 బంతుల్లో 19×4, 2×6) సూపర్ డబుల్ సెంచరీతో ఇన్నింగ్స్‌కి వెన్నుముకగా నిలవగా.. ఓపెనర్ సిబ్లీ(87: 286 బంతుల్లో 12×4, 0x6), ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్(82: 118 బంతుల్లో 10×4, 3×6) మంచి భాగస్వామ్యాలను నెలకొల్పడంలో సహాయపడ్డారు. అటు లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ బెస్(28) రాణిస్తుండటంతో ఇంగ్లాండ్ 600 పరుగులు చేయడం సులభంలా కనిపిస్తోంది. కాగా, టీమిండియా బౌలర్లలో బుమ్రా, అశ్విన్, నదీమ్, ఇషాంత్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

అంతకముందు 263 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్‌కు కెప్టెన్ జో రూట్(218) వెన్నుముకగా నిలవగా.. ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్(82) అర్ధ సెంచరీతో అదరగొట్టాడు. ఇక పొప్(34), బట్లర్(30), బెస్(28) రాణించడంతో ఇంగ్లాండ్ స్కోర్ సునాయాసంగా 500 పరుగులు దాటేసింది. మూడో రోజు ఆట ఎలా కొనసాగుతుందన్న దానిపై ఈ టెస్టు మ్యాచ్ ఫలితం ఆధారపడిందని చెప్పొచ్చు.

Also Read: Ind vs Eng, 1st Test, Day 2: దంచికొడుతోన్న ఇంగ్లాండ్.. 600 పరుగుల చేరువలో ఇంగ్లీష్ టీమ్..