IND vs BAN: ముగిసిన బంగ్లా తొలి ఇన్నింగ్స్.. సత్తాచాటిన భారత్ బౌలర్లు

|

Sep 30, 2024 | 2:05 PM

భారత్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో ఎట్టకేలకు నాలుగో రోజు ప్రారంభమైంది. గ్రీన్ పార్క్‌లో ప్రారంభమైన ఈ మ్యాచ్ వర్షం కారణంగా టాస్ లేట్ అయింది. నాలుగు రోజు తొలి సేషన్‌లో జరిగిన ఇన్నింగ్స్ స్కోర్ ఎంతంటే?

IND vs BAN: ముగిసిన బంగ్లా తొలి ఇన్నింగ్స్.. సత్తాచాటిన భారత్ బౌలర్లు
Ind Vs Ban
Follow us on

భారత్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ ఎట్టకేలకు నాలుగో రోజు ప్రారంభమైంది. గ్రీన్ పార్క్‌లో ప్రారంభమైన ఈ మ్యాచ్ వర్షం కారణంగా టాస్ లేట్ అయింది. టాస్ గెలిచిన రోహిత్ సేన బౌలింగ్ ఎంచుకోవడం అందరనీ ఆశ్చర్యానికి గురిచేసింది.  మొదటి రోజు లాంచ్ బ్రేక్ వరకు మ్యాచ్ జరిగినా ఆ తర్వాత వర్షం రావడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. రెండు రోజు కూడా వర్షం పడుతుండడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. మూడో రోజు వర్షం పడకపోయినా గ్రౌండ్ పచ్చికతో ఉండడంతో మ్యాచ్ రద్దు చేశారు. తాజాగా నాలుగు రోజు మ్యాచ్ ప్రారంభమైంది.

లంచ్ బ్రేక్‌కి బంగ్లాదేశ్ 205 పరుగులు చేసి ఆరు వికెట్లు కోల్పోపోయింది. మొమినల్ హక్( 102) పరుగులు చేశాడు. తన కెరీర్‌లో ఇది 12వ సెంచరీ కావడం విశేషం. బంగ్లా 107/2 స్కోర్‌‌తో ఇన్నింగ్స్‌ను షూరు చేసింది. అయితే బంగ్లాను భారత్ స్టార్ ప్లేయర్ బుమ్రా ఇబ్బంది పెట్టాడు. ముష్ఫికర్ రహీమ్‌ (11)ను బుమ్రా ఔట్ చేసి పెవిలియన్‌కి పంపించాడు. అనంతరం లిటన్ దాస్ 13 పరుగులు, షకిబ్ 9 పరుగులు చేసి ఔటైయ్యారు. లిటన్ దాస్ కొట్టిన బంతిని రోహిత్ శర్మ సింగిల్ హ్యాండ్‌తో పటుకున్నారు. అలాగే షకిబ్ క్యాచ్‌ను సిరాజ్ పట్టుకున్నాడు. ఆ తర్వాత మిరాజ్‌తో కలిసి మొమినల్ ఇన్నింగ్స్ ఆడారు.

ఈ ఇన్నింగ్స్‌లో తొలి సెషన్‌లో భారత్ ప్లేయర్స్ పట్టిన రెండు క్యాచ్‌‌లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. రోహిత్ లిటన్ దాస్ కొట్టిన బంతిని సింగిల్ హ్యాండ్‌తో పట్టుకున్నాడు. మరొక్కటి ఆశ్విన్ బౌలింగ్‌లో షకిబ్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి సిరాజ్‌కు క్యాచ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆ క్యాచ్‌లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

రెండు జట్ల స్క్వాడ్ ఇలా:

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా.

బంగ్లాదేశ్: నజ్ముల్ హసన్ శాంటో (కెప్టెన్) , షాద్మాన్ ఇస్లాం, జకీర్ హసన్, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్ (వికెట్), మెహిదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, హసన్ మహమూద్, ఖలీద్ అహ్మద్.