డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే.. జట్టులో నెంబర్‌వన్ స్పిన్నర్ లేనట్లే..!

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్ మ్యాచ్‌కి కౌంట్‌డౌన్ మొదలైంది. టైటిల్‌ రేసులో గతంలో ఫైనల్‌కి వెళ్లి భంగపడ్డ భారత్‌ ఈసారి గెలవాలన్న పట్టుదలతో ఉంది.

డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే.. జట్టులో నెంబర్‌వన్ స్పిన్నర్ లేనట్లే..!
Australia Vs India, Wtc Final

Updated on: Jun 07, 2023 | 9:58 AM

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్ మ్యాచ్‌కి కౌంట్‌డౌన్ మొదలైంది. టైటిల్‌ రేసులో గతంలో ఫైనల్‌కి వెళ్లి భంగపడ్డ భారత్‌ ఈసారి గెలవాలన్న పట్టుదలతో ఉంది. పదునైన వ్యూహాలతో ఆసీస్‌ను మట్టికరిపించేలా వ్యూహరచన చేస్తోంది. అటు కంగారులూ కూడా అదే కాన్ఫిడెంట్‌తో ఉన్నారు, దీంతో పోటాపోటీ ఫైట్‌ ఖాయమన్న అంచనాలు ఉన్నాయి. భారత్‌- ఆస్ట్రేలియా ఆడబోయే ఈ మ్యాచ్‌కి ఇంగ్లాండ్‌లోని ఓవల్ గ్రౌండ్‌ ఆతిధ్యమివ్వనుంది. ఇప్పటికే ఈ రెండు జట్ల మధ్య టెస్ట్ ఛాంపియన్స్ షిప్ టైటిల్ మినహాయించి అన్ని ఐసీసీ టైటిల్స్ ఉన్నాయి. ఈ క్రమంలో ఈ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించాలని భావిస్తున్నాయి.

టీమిండియా వరుసగా రెండోసారి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌‌షిప్‌ ఫైనల్‌‌కు చేరింది. ఆసీస్‌తో తలపడేందుకు సిద్ధమైంది. గత డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత్‌పై న్యూజిలాండ్‌ విజయం సాధించింది. వర్షం కారణంగా పిచ్‌ బౌలింగ్‌కు అనుకూలంగా మారినప్పటికీ..  స్పిన్నర్లతో బరిలోకి దిగిన టీమిండియాకు ఫలితం అనుకూలంగా రాలేదు. అయితే ఈసారి ఇంగ్లాండ్‌ వేదిక కావడంతో పిచ్‌ పేస్‌కు అనుకూలంగా ఉంటుంది. మ్యాచ్‌ జరిగే కొద్దీ పిచ్‌ స్పిన్నర్లకూ సహకరిస్తుందనే వాదనా ఉంది.

పాట్ కమిన్స్‌ సారథ్యంలోని ఆసీస్‌ టీమ్‌లో స్టీవ్ స్మిత్‌, స్కాట్‌ బోలాండ్‌, అలెక్స్‌ కెరీ, గ్రీన్‌, మార్కస్ హరీస్‌లతో బ్యాటింగ్‌ లైనప్‌ బలంగానే కనిపిస్తోంది. అటు నాథన్ లయన్‌, మర్ఫీ, నేసర్‌, స్టార్క్‌ బౌలర్లు తమదైన రోజున మ్యాచ్‌ని మలుపు తిప్పేవాళ్లే. మరి ఈ మ్యాచ్‌లో టీమిండియా నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్‌తో బరిలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఓన్లీ ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజా తుది జట్టులో ఉండగా.. రవిచంద్రన్ అశ్విన్ బదులు శార్దూల్ ఠాకూర్‌కే ఛాన్స్ ఇవ్వొచ్చునని టాక్. కాగా, కొంతకాలంగా ఐసీసీ ట్రోఫీల కరువును ఎదుర్కొంటున్న టీమిండియా.. ఈ టైటిల్‌ గెలిచి అభిమానుల్ని అలరించాలని పట్టుదలగా ఉంది. ఫైనల్‌గా రెండు జట్లు విజేతగా నిలిచి డబ్ల్యూటీసీ గదను దక్కించుకోవాలన్న కాన్ఫిడెంట్‌తో ఉన్నాయి.

భారత్(ప్లేయింగ్ XI అంచనా):

రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మాన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, రవీంద్ర జడేజా, కెఎస్ భరత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్/శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్/జయ్‌దేవ్ ఉనద్కత్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్

ఆస్ట్రేలియా(ప్లేయింగ్ XI అంచనా):

డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబూషెన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కారీ(వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్(కెప్టెన్), స్కాట్ బోలాండ్, నాథన్ లియోన్