WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్ గెలిచేది టీమిండియానే.. అసలు కారణం చెప్పేసిన మాజీ దిగ్గజం.. అవేంటంటే?

Australia vs India, WTC Final: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌‌కు రగం సిద్ధమైంది. మరికొద్దిసేపట్లో భారత్, ఆస్ట్రేలియా టీంలు ఓవల్ మైదానంలో దిగబోతున్నాయి. అయితే, భారత్ లేదా ఆస్ట్రేలియా ఇరుజట్లలో ఎవరు గెలుస్తారనే ప్రశ్నలు ప్రస్తుం అందరిలో మొదలయ్యాయి. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టమే. సహజంగానే రెండు జట్లూ అద్భుతంగా ఉన్నాయి. రెండు జట్లలోనూ అద్భుతమైన బ్యాట్స్‌మెన్స్, అద్భుతమైన బౌలర్లు ఉన్నారు.

WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్ గెలిచేది టీమిండియానే.. అసలు కారణం చెప్పేసిన మాజీ దిగ్గజం.. అవేంటంటే?
Wtc Final Rohit Sharma

Updated on: Jun 08, 2023 | 3:33 PM

Australia vs India, WTC Final: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌‌కు రగం సిద్ధమైంది. మరికొద్దిసేపట్లో భారత్, ఆస్ట్రేలియా టీంలు ఓవల్ మైదానంలో దిగబోతున్నాయి. అయితే, భారత్ లేదా ఆస్ట్రేలియా ఇరుజట్లలో ఎవరు గెలుస్తారనే ప్రశ్నలు ప్రస్తుం అందరిలో మొదలయ్యాయి. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టమే. సహజంగానే రెండు జట్లూ అద్భుతంగా ఉన్నాయి. రెండు జట్లలోనూ అద్భుతమైన బ్యాట్స్‌మెన్స్, అద్భుతమైన బౌలర్లు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరిది పైచేయి అవుతుందో చెప్పడం కాస్త కష్టమే. ఇలాంటి ప్రశ్నలకు దిగ్గజాలు సమాధానం అందించారు. హర్భజన్ సింగ్, మాథ్యూ హేడెన్ ఈ సమస్యను తేల్చేశారు. టీమ్ ఇండియా టెస్టుల్లో రారాజుగా అవతరించడానికి హర్భజన్ మూడు కారణాలను చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియా ఈ టైటిల్‌ను ఎందుకు గెలవగలదో కూడా హేడెన్ పలు కారణాలు తెలిపాడు.

టీమిండియా WTCని ఎందుకు గెలుస్తుంది?

హర్భజన్ సింగ్ మాట్లాడుతూ.. ఇటీవల ఆస్ట్రేలియా టీమిండియా చేతుల్లో ఎలా ఓడిపోయిందో చెప్పుకొచ్చాడు. టీమిండియా స్వదేశంలోనే కాదు.. ఆస్ట్రేలియాకు వెళ్లి మరీ సిరీస్‌లు గెలిచిందని తెలిపాడు. దీని వల్ల టీమ్ ఇండియా ఆత్మవిశ్వాసం బాగా పెరిగింది. శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీమ్ ఇండియా 350 నుంచి 400 స్కోర్ చేస్తే టీమ్ ఇండియాకు మంచి అవకాశం ఉంటుందని భజ్జీ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

ఓవల్ పిచ్‌పై స్పిన్నర్లు బౌన్స్ అవుతారని హర్భజన్ సింగ్ మరో కారణం చెప్పుకొచ్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో టీమిండియా స్పిన్నర్లు ఓవల్‌లో ఏదో ఒకటి చేయగలరు.

భారత సీమర్లు కూడా ఫామ్‌లో ఉన్నారని హర్భజన్ సింగ్ మూడో కారణం తెలిపాడు. మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఐపీఎల్‌లో కూడా ఇద్దరూ బాగా రాణించారు. దీనితో పాటు, ఉమేష్ యాదవ్ కూడా ఇంగ్లీష్ పిచ్‌లను సద్వినియోగం చేసుకోగలడని వివరించాడు.

మరోవైపు ఆస్ట్రేలియా ఎందుకు ఛాంపియన్‌గా మారగలదో మాథ్యూ హేడెన్ చెప్పుకొచ్చాడు.. ఇంగ్లండ్ గడ్డపై ఆస్ట్రేలియా అద్భుత ప్రదర్శన కనబరిచిందని మాథ్యూ హెడెన్ అన్నాడు. అలన్ బోర్డర్ సమయం నుంచి ఆస్ట్రేలియా ఇంగ్లాండ్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ చాలా మ్యాచ్‌లను గెలుచుకుంది. అలాగే ఆస్ట్రేలియా ఆటగాళ్లు మానసికంగా అలసిపోలేదని హేడెన్ మరో కారణం చెప్పాడు. వారికి చాలా విశ్రాంతి లభించింది. మరోవైపు భారత ఆటగాళ్లు నిరంతరాయంగా క్రికెట్ ఆడుతుండగా, తాజాగా రెండు నెలల పాటు ఐపీఎల్ ఆడి ఇంగ్లండ్ చేరుకున్నారు. ప్రస్తుత కాలంలో అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకరైన నాథన్ లియాన్‌కు మాథ్యూ హేడెన్ మూడో కారణంగా ప్రకటించాడు.