భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముగిసింది. ఈ 4 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను టీమిండియా 2-1తేడాతో కైవసం చేసుకుంది. దీంతో టీమిండియా వరుసగా 4వ సారి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని తన దగ్గర అట్టేపెట్టుకుంది. ప్రస్తుతం టెస్టు సిరీస్ విజయంతో సంబరాలు చేసుకుంటున్న టీమ్ ఇండియా.. మరికొద్ది రోజుల్లో ఆసీస్‌తో వన్డే సిరీస్ ఆడబోతోంది. మార్చి 17 నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌లో భారత జట్టు మూడు మ్యాచ్‌లు ఆడనుంది. ముంబై, విశాఖపట్నం, చెన్నైలలో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ సిరీస్‌కు ఇప్పటికే భారత జట్టును ఎంపిక కాగా, గాయం కారణంగా అహ్మదాబాద్ టెస్ట్‌కు దూరమైన శ్రేయాస్ అయ్యర్ స్థానంలో సంజూ శాంసన్ ఎంపిక అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.
అలాగే తల్లి మరణంతో ఆస్ట్రేలియా జట్టుకు దూరమైన కెప్టెన్ పాట్ కమిన్స్ కూడా ఈ సిరీస్‌కు అనుమానమే. అటు వ్యక్తిగత కారణాల వల్ల రోహిత్ శర్మ తొలి వన్డే ఆడటం లేదు. కాబట్టి భారత జట్టుకు తొలి వన్డేలో హార్దిక్ పాండ్యా నాయకత్వం వహించనున్నాడు. ఇక ఆసీస్ జట్టుకు సారధిగా మరోసారి స్టీవ్ స్మిత్ వ్యవహరించే అవకాశం ఉంది.
స్టీవ్ స్మిత్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, అలెక్స్ క్యారీ(వికెట్ కీపర్), మార్నాస్ లబూషేన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జాంపా.
హార్దిక్ పాండ్యా(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, మొహమ్మద్. షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్.
మార్చి 17- మొదటి వన్డే (వాంఖడే స్టేడియం, ముంబై)
మార్చి 19 – రెండవ ODI (YSR స్టేడియం, విశాఖపట్నం)
మార్చి 22- మూడో వన్డే (MA చిదంబరం స్టేడియం, చెన్నై)