India vs Australia ICC world Cup 2023 Preview, Playing 11: 45 రోజులు, 47 మ్యాచ్‌ల తర్వాత, ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ (ICC Cricket World Cup 2023) చివరి మ్యాచ్ నవంబర్ 19 ఆదివారం నాడు జరగనుంది. భారతదేశం వర్సెస్ ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య, ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ గ్రౌండ్, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ టైటిల్ పోరు జరగనుంది. తొలి సెమీఫైనల్‌లో ఆతిథ్య భారత్ న్యూజిలాండ్‌ను ఓడించగా, దక్షిణాఫ్రికాను ఓడించి ఆస్ట్రేలియా ప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకుంది. రోహిత్ శర్మ (Rohit Sharma), పాట్ కమిన్స్ (Pat Cummins)ఆటగాళ్లందరూ ఈ చివరి పోరుకు పూర్తిగా సిద్ధమయ్యారు.
లీగ్ దశలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా తమ మొదటి మ్యాచ్‌ను ఒకదానితో ఒకటి తలపడ్డాయి. ఇక్కడ ఆతిథ్య జట్టు ఇండియా గెలిలి, తమ జైత్రయాత్రకు బీజం వేసింది. ఆ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లిల సత్తాతో భారత జట్టు విజయం సాధించింది. ప్రపంచం నలుమూలల నుంచి ఎంతో మంది ప్రముఖులు పాల్గొనే ఫైనల్ మ్యాచ్‌లో పలు కలర్‌ఫుల్ ప్రోగ్రామ్‌లు జరగనున్నాయి.
ఇక ప్రపంచకప్‌లో ఇరు జట్ల రికార్డుల గురించి మాట్లాడితే.. ఆస్ట్రేలియా జట్టుదే పైచేయిగా కనిపిస్తోంది. ఆస్ట్రేలియా 8 మ్యాచుల్లో గెలుపొందగా, టీమిండియా 5 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. వన్డే ఫార్మాట్‌లో ఇరు జట్ల రికార్డుల గురించి మాట్లాడితే.. ఇక్కడ కూడా ఆస్ట్రేలియా ఆధిపత్యమే కనిపిస్తోంది. ఇప్పటివరకు, భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య 150 ODI మ్యాచ్‌లు ఆడగా, ఇందులో కంగారూ జట్టు 83, భారత జట్టు 57 గెలిచాయి. 10 మ్యాచ్‌లు ఫలితం లేకుండానే ఉన్నాయి.
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ.
ఆస్ట్రేలియా : పాట్ కమిన్స్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుస్‌చాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లీష్ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్.
అహ్మదాబాద్‌లో వాతావరణం క్లియర్‌గా ఉండబోతోంది. అలాగే భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లో ఉపయోగించిన పిచ్‌ను ఈ మ్యాచ్‌కు ఉపయోగించనున్నారు. దీంతో ఇరుజట్ల మధ్య హోరాహోరీ మ్యాచ్‌ను చూడొచ్చు. అయితే, సాయంత్రం ఫ్లడ్‌లైట్ల కారణంగా ఫాస్ట్ బౌలర్లు సహాయం పొందవచ్చు. ప్రపంచ కప్ 2023లో ఇదే మైదానంలో 4 మ్యాచ్‌లు జరిగాయి. లక్ష్యాన్ని ఛేదించే జట్టు మూడుసార్లు గెలిచింది. ఒకసారి ఆస్ట్రేలియా ఇంగ్లాండ్‌పై లక్ష్యాన్ని కాపాడుకుంది.
భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. టాస్ మధ్యాహ్నం 1:30 గంటలకు జరగనుంది. స్టార్ స్పోర్ట్స్‌లో ఈ మ్యాచ్‌ని టీవీలో చూడోచ్చు. ఇది Disney+Hotstar యాప్‌లో ఉచితంగా చూడొచ్చు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..