IND Vs AUS: తగ్గేదేలే! రోహిత్ ఖాతాలోకి మరో సిరీస్.. ఆసీస్‌పై టీమిండియా గెలవడానికి కారణాలు ఇవే!

|

Sep 26, 2022 | 12:45 PM

నిన్న హైదరాబాద్‌లో జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20లో రోహిత్ సేన 6 వికెట్ల తేడాతో ఆసీస్‌పై అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే.

IND Vs AUS: తగ్గేదేలే! రోహిత్ ఖాతాలోకి మరో సిరీస్.. ఆసీస్‌పై టీమిండియా గెలవడానికి కారణాలు ఇవే!
India Vs Australia 3rd T20i
Follow us on

తొలి మ్యాచ్‌లో ఓటమి అనంతరం టీమిండియా పుంజుకుంది. ఆ తర్వాత జరిగిన రెండు మ్యాచ్‌లలోనూ అద్భుత విజయాలు సాధించి.. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. నిన్న హైదరాబాద్‌లో జరిగిన నిర్ణయాత్మక మూడో టీ20లో రోహిత్ సేన 6 వికెట్ల తేడాతో ఆసీస్‌పై అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. మరి టీమిండియా గెలవడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

  • కలిసొచ్చిన టాస్:

ఈ సిరీస్‌లో జరిగిన మూడు మ్యాచ్‌లలోనూ టాస్ కీలక పాత్ర పోషించింది. ఏ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుందో.. చివరికి అదే విజయం సాధించింది. మొదటి టీ20లో ఆసీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.. చివరికి విజయం అందుకుంది. ఇక రెండు, మూడు టీ20ల్లో టీమిండియా టాస్ గెలవగా.. రెండింటిలోనూ రోహిత్ సేన అద్భుత విజయాలు అందుకుంది.

  • మిడిల్ ఓవర్లలో పట్టుబిగించిన టీమిండియా:

నిన్న కెమెరాన్ గ్రీన్ పవర్ ప్లే ఓవర్లలో టీమిండియా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆసీస్ భారీ స్కోర్ వేయడంలో పునాది వేశాడు. అయితే అతడ్ని ఔట్ చేసి.. మిడిల్ ఓవర్లలో టీమిండియా బౌలర్లు పట్టు సాధించడం జరిగింది. ఇక అదే భారత్ జట్టు గెలవడంలో కీలకంగా మారింది. అటు తరుచు విరామాల్లో ఆసీస్ వికెట్లు కోల్పోవడం రోహిత్ సేనకు కలిసొచ్చింది.

  • హర్షల్ పటేల్ చక్కటి బంతులు..

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేసిన హర్షల్ పటేల్ వేయగా.. ఈ ఓవర్‌లో ఒక వికెట్ నష్టపోయి.. ఆసీస్ బ్యాటర్లు కేవలం 7 పరుగులు మాత్రమే చేయగలిగారు. దీంతో ఆ జట్టు 200 పరుగులు చేరుకోకుండా టీమిండియా అడ్డుకోగలిగింది.

  • కోహ్లీ, స్కైల భాగస్వామ్యం..

ఈ మ్యాచ్‌లో కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ 104 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 30 పరుగుల టీం స్కోర్ వద్ద ఓపెనర్లు పెవిలియన్ చేరినప్పటికీ.. ఈ భాగస్వామ్యం మ్యాచ్‌ భారత్‌ చేతిలోకి రావడానికి దోహదపడింది.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం..