India Vs Australia 2020: ఆస్ట్రేలియాతో జరుగుతోన్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా రెండో వికెట్ కోల్పోయింది. ఓపెనర్ రోహిత్ శర్మ(44; 74 బంతుల్లో 6×4) ఔటయ్యాడు. లైయన్ వేసిన 20వ ఓవర్ ఐదో బంతికి గాల్లోకి షాట్ ఆడిన అతడు మిచెల్ స్టార్క్ చేతికి చిక్కాడు. దీంతో భారత్ 60 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. అంతకుముందు శుభ్‌మన్‌గిల్(7) కమిన్స్ బౌలింగ్‌లో స్లిప్‌లో స్మిత్ చేతికి చిక్కిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం క్రీజులో పుజారా(7), అజింక్య రహానె ఉన్నారు. 20 ఓవర్లకు భారత్ స్కోర్ 60/2గా నమోదైంది. అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.