టీ20 ప్రపంచకప్‌లో సూపర్-8 రౌండ్‌లో భాగంగా బ్రిడ్జ్‌టౌన్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య మూడో మ్యాచ్ జరుగుతోంది. భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 8 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. దీంతో ఆఫ్ఘానిస్తాన్ ముందు 182 పరుగుల టార్గెట్ నిలిచింది.
టీమిండియా ప్లేయర్లలో సూర్యకుమార్ అర్ధశతకంతో ఆకట్టుకోగా.. హార్దిక్, సూర్య మధ్య 50 పరుగుల భాగస్వామ్యం జట్టును 150 దాటేలా చేసింది.
టీమిండియాను రషీద్ ఖాన్ ఇబ్బంది పెట్టాడు. విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, శివమ్ దూబే వికెట్లు పడగొట్టాడు. ఫజల్ హక్ ఫరూఖీ రోహిత్ శర్మ, సూర్యకుమార్‌లను పెవిలియన్‌కు పంపాడు.
🚨 Milestone Alert 🚨
With that cracking shot, Suryakumar Yadav completes 2⃣0⃣0⃣ fours in T20Is! 🔥
An excellent 53-run knock off 28 balls comes to an end 👏
Follow The Match ▶️ https://t.co/xtWkPFabs5#T20WorldCup | #TeamIndia | #AFGvIND | @surya_14kumar pic.twitter.com/2cTpDN4qRw
— BCCI (@BCCI) June 20, 2024
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా.
ఆఫ్ఘనిస్తాన్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(కీపర్), ఇబ్రహీం జద్రాన్, నజీబుల్లా జద్రాన్, హజ్రతుల్లా జజాయ్, గుల్బాదిన్ నైబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్(కెప్టెన్), నూర్ అహ్మద్, నవీన్-ఉల్-హక్, ఫరూజ్కాల్హాక్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..