India Tour Of South Africa: భారత జట్టు తన కొత్త మిషన్ కోసం బయలుదేరింది. టీమ్ ఇండియా గురువారం (డిసెంబర్ 16) దక్షిణాఫ్రికాకు బయలుదేరింది. టీం ఇండియా ముందుగా మూడు టెస్టుల సిరీస్ ఆడాల్సి ఉంది. ఆ తర్వాత ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. టెస్టు సిరీస్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కొనసాగుతుండగా, వన్డేల్లో రోహిత్ శర్మ సారథిగా వ్యవహరించనున్నాడు. అయితే బీసీసీఐ పంచుకున్న ఫొటోలలో టెస్ట్ సారథి విరాట్ కోహ్లీ మాత్రం కనిపంచలేదు. దీంతో ఆయన అభిమానులు బీసీసీఐపై ఫైరవుతూ కామెంట్లు చేస్తున్నారు. అందరు ఆటగాళ్లు ఉన్నారు. మరి మీకు విరాట్ కోహ్లీ మాత్రమే కనిపించలేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్‌లో విరాట్ మాట్లాడుతూ, వన్డే కప్టెన్సీ విషయంలో నన్ను ఎవరూ సంప్రదించలేదు, కేవలం గంట ముందు మాత్రమే వన్డేలకు సారథిగా మీరు ఉండరని తెలిపారంటూ బీసీసీఐపై ఘాటుగా స్పందించాడు. దీంతో బీసీసీఐ, విరాట్ కోహ్లీకి మధ్య విభేదాలు ఇంకా చల్లారలేదని తెలుస్తోంది.
డిసెంబరు 26న ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో దక్షిణాఫ్రికాతో తలపడినప్పుడు కోహ్లీ కెప్టెన్సీలో మరోసారి విదేశీ రికార్డును నిర్మించాలని చూస్తోంది. దక్షిణాఫ్రికాలో ఇప్పటి వరకు ఒక్క టెస్టు సిరీస్ కూడా టీమిండియా గెలవలేదు.
టెస్ట్ క్రికెట్ చరిత్రలో, కేవలం మూడు జట్లు – ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక మాత్రమే స్వదేశంలో దక్షిణాఫ్రికాను ఓడించగలిగాయి. టీమిండియా, దక్షిణాఫ్రికాలో 20 టెస్టులు ఆడింది. అందులో టీమ్ మూడు మాత్రమే గెలవగలిగింది. 2018 చివరి పర్యటనలో కఠినమైన సవాలును ఎదుర్కొన్నారు. కానీ, సిరీస్‌ను 1-2తో కోల్పోయారు.
ఇటీవలి కాలంలో విదేశీ గడ్డపై టీమిండియా అద్భుత ప్రదర్శన చేస్తోంది. సొంతగడ్డపై ఆస్ట్రేలియాను రెండుసార్లు ఓడించి చరిత్ర సృష్టించింది. ఈ ఏడాది ప్రారంభంలో కూడా ఇంగ్లండ్ పర్యటనలో 2-1 ఆధిక్యంలో ఉంది. అయితే కరోనా కారణంగా ఈ పర్యటనను నిలిపివేయాల్సి వచ్చింది.
దక్షిణాఫ్రికా టూర్‌ను టీమిండియా టెస్టు సిరీస్‌తో ప్రారంభించాల్సి ఉంది. డిసెంబర్ 26 నుంచి తొలి టెస్టు జరగనుంది. ఆ తర్వాత జనవరి 19 నుంచి భారత్, దక్షిణాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్ కూడా జరగనుంది. గాయం కారణంగా రోహిత్ శర్మ టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు.
భారత జట్టు ఇటీవల న్యూజిలాండ్‌ను సొంతగడ్డపై ఓడించింది. కివీస్‌తో జరిగిన 2 టెస్టుల సిరీస్‌ను టీమిండియా 1-0తో కైవసం చేసుకుంది.
దక్షిణాఫ్రికాకు బయల్దేరి వెళ్లే ముందు కెప్టెన్ విరాట్ కోహ్లి మాట్లాడుతూ.. దక్షిణాఫ్రికాలో ఇంతవరకు మనం ఒక్క సిరీస్ కూడా గెలవలేదు. ఎక్కడ ఆడేందుకు వెళ్లినా సిరీస్ గెలవాలన్నదే మా ఆలోచన’ అంటూ పేర్కొన్నాడు.
All buckled up ✌?
South Africa bound ✈️??#TeamIndia #SAvIND pic.twitter.com/fCzyLzIW0s
— BCCI (@BCCI) December 16, 2021
IND vs SA: దక్షిణాప్రికా పయణమైన కోహ్లీసేన.. తొలి టెస్ట్ సిరీస్ విజయం దక్కేనా.. 7 సార్లు నిరాశే..!