IND vs BAN 2nd Test: బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు భారత జట్టు ఇదే.. మరోసారి వారికి షాకిచ్చిన సెలెక్టర్లు

|

Sep 22, 2024 | 2:40 PM

India vs Bangladesh 2nd Test: సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరగనున్న రెండో టెస్టుకు భారత జట్టును ప్రకటించారు. అయితే, తొలి టెస్ట్ ఆడిన అదే జట్టును బీసీసీఐ ప్రకటించింది. తొలి టెస్ట్‌లో ఎలాంటి మార్పులు చేయకపోవడం గమనార్హం. చెన్నైలోని ఏంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో రోహిత్ శర్మ సేన 280 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 1-0తో ముందంజలో ఉంది.

IND vs BAN 2nd Test: బంగ్లాదేశ్‌తో రెండో టెస్టుకు భారత జట్టు ఇదే.. మరోసారి వారికి షాకిచ్చిన సెలెక్టర్లు
Ind Vs Ban 2nd Test
Follow us on

India vs Bangladesh 2nd Test: సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరగనున్న రెండో టెస్టుకు భారత జట్టును ప్రకటించారు. అయితే, తొలి టెస్ట్ ఆడిన అదే జట్టును బీసీసీఐ ప్రకటించింది. తొలి టెస్ట్‌లో ఎలాంటి మార్పులు చేయకపోవడం గమనార్హం. చెన్నైలోని ఏంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో రోహిత్ శర్మ సేన 280 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 1-0తో ముందంజలో ఉంది.

దీంతో WTC పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానంలో నిలిచింది. ఇక ఘోర పరాజయం పాలైన బంగ్లాదేశ్ జట్టు ఆరో స్థానంలో నిలిచింది.

రెండవ టెస్ట్ కోసం భారత జట్టు..

రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (కీపర్), ధృవ్ జురెల్ (కీపర్), ఆర్ అశ్విన్, ఆర్ జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్. సిరాజ్, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, యశ్ దయాల్.

కాగా, బంగ్లాదేశ్‌తో జరిగిన 2 టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో టీమిండియా 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఆ జట్టు సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో మ్యాచ్ సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరగనుంది.

ఆదివారం చెపాక్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో నాలుగో రోజు 515 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టును రోహిత్ సేన రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ను 234 పరుగులకు ఆలౌట్ చేసింది.

తొలి టెస్ట్ ఆడిన ఇరుజట్ల ప్లేయింగ్ 11..

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్.

బంగ్లాదేశ్: నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), షాద్మాన్ ఇస్లాం, జకీర్ హసన్, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్ (వికెట్), మెహిదీ హసన్ మిరాజ్, నహిద్ రాణా, హసన్ మహమూద్, తస్కిన్ అహ్మద్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..