ఒకే దేశంలో IPL అండ్‌ PSL..? అక్కడ కూడా పాకిస్థాన్‌కు షాకిచ్చిన భారత్‌!

భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతా కారణాలతో పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) మిగిలిన మ్యాచ్‌లను యూఏఈ లేదా దుబాయ్‌లో నిర్వహించాలని నిర్ణయించింది. విదేశీ ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో బీసీసీఐ కూడా ఐపీఎల్ 2025ని తాత్కాలికంగా వాయిదా వేయడంపై ఆలోచిస్తోంది.

ఒకే దేశంలో IPL అండ్‌ PSL..? అక్కడ కూడా పాకిస్థాన్‌కు షాకిచ్చిన భారత్‌!
Ipl And Psl

Updated on: May 09, 2025 | 12:21 PM

భారత్‌, పాకిస్థాన్‌ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పీసీబీ(పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు) కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అదేంటంటే.. ఇండియా ఎక్కడ తమపై క్షిపణులతో విరుచుకుపడుతుందో అనే భయంతో పాకిస్థాన్‌ పీఎస్‌ఎల్‌(పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌)ను పాకిస్థాన్‌ నుంచి తరలించాలని భావిస్తోంది. పీఎస్‌ఎల్‌లో మిగిలిన మ్యాచ్‌లను యూఏఈ, లేదా దుబాయ్‌లో నిర్వహించాలని ఆలోచిస్తోంది. యుద్ధ వాతావరణం తలెత్తడంతో పాకిస్థాన్‌లోని విదేశీ క్రికెటర్లు టోర్నీ మధ్యలోనే వారి స్వదేశాలకు వెళ్లాలని అనుకుంటున్నారు.

విదేశీ ప్లేయర్లు ఎక్కువగా ఉండే ఈ లీగ్‌లో వాళ్లు లేకుండా మిగతా మ్యాచ్‌లు కంటిన్యూ చేయడం ఈజీ కాదు. సో.. ఆటగాళ్ల రక్షణ గురించి కూడా ఆలోచించి.. ఏకంగా టోర్నీనే దుబాయ్‌లో నిర్వహించాలని పీసీబీ భావిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే.. పాకిస్థాన్‌ దాడులను భారత్‌ అడ్డుకుంటున్నప్పటికీ.. క్రికెటర్ల భద్రత ముఖ్యమని భావిస్తున్న బీసీసీఐ ఐపీఎల్‌ 2025 తాత్కాలికంగా వాయిదా వేస్తారని సమాచారం. గురువారం పంజాబ్‌ కింగ్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య ధర్మశాలలో జరుగుతున్న మ్యాచ్‌ను కూడా బీసీసీఐ మధ్యలో నిలిపివేసింది.

ఒక వేళ యుద్ధ వాతావరణం సద్దుమణిగితే ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఎక్కడ ఆగాయో అక్కడి నుంచి మళ్లీ మొదలుపెడతారు. యుద్ధం కొనసాగితే.. ఒక వేళ వేరే దేశంలో మిగిలిన మ్యాచ్‌లు కొనసాగించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంటే దుబాయ్‌ లేదా యూఏఈని వేదికగా చేసుకునే అవకాశం. అయితే.. ఇప్పటికే ఆ ప్లాన్‌లో ఉన్న పీసీబీ, ఎక్కడ బీసీసీఐ కూడా ఐపీఎల్‌ను యూఏఈ లేదా దుబాయ్‌లో నిర్వహిస్తుందో అని భయపడుతోంది. ఎందుకంటే.. రెండు టోర్నీల్లో ఐపీఎల్‌కే ఎక్కువ క్రేజ్‌ ఉంది. సో.. ప్రేక్షకులు పీఎస్‌ఎల్‌ను కాదని, ఐపీఎల్‌ మ్యాచ్‌లకే వస్తారని పీసీబీ భయపడుతోంది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..