
IND vs SA : భారత క్రికెట్ జట్టుకు ఎట్టకేలకు టాస్ రూపంలో అదృష్టం వరించింది. విశాఖపట్నంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడవ వన్డే మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచింది. వన్డే ఫార్మాట్‌లో వరుసగా 20 టాస్‌లు ఓడిపోయిన తర్వాత భారత్‌కు ఈ విజయం దక్కడం విశేషం. చివరిసారిగా 2023 వన్డే ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై భారత్ టాస్ గెలిచింది. తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలవడంపై క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని పంచుకుంటూ, రాహుల్ చేసిన చిట్కాను వెంటనే పట్టుకున్నారు.
ఫ్యాన్స్ చెప్పిన దాని ప్రకారం.. కేఎల్ రాహుల్ టాస్ గెలవడానికి ఒక కొత్త ట్రిక్ వాడారు. దక్షిణాఫ్రికా సిరీస్‌లోని మొదటి రెండు వన్డే మ్యాచ్‌లలో రాహుల్ కుడి చేతితో నాణెం ఎగరవేశారు. కానీ ఈ నిర్ణయాత్మక మూడవ మ్యాచ్‌లో మాత్రం అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఎడమ చేతితో నాణెం ఎగరవేసే చిట్కాను ప్రయత్నించారు. ఈ మంత్రం వెంటనే పనిచేసి, భారత్ టాస్ గెలిచింది. బీసీసీఐ షేర్ చేసిన టాస్ వీడియో కింద ఒక యూజర్ “కేఎల్ రాహుల్ ఎడమచేతి ట్రిక్ ఉపయోగించారు” అని కామెంట్ చేశారు. మరొకరు “దశాబ్దం తర్వాత భారత్ టాస్ గెలిచినట్లు ఉంది” అని సరదాగా రాశారు.
🚨 Toss 🚨#TeamIndia have won the toss and elected to field first.
Updates ▶️ https://t.co/HM6zm9o7bm#INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/vYNPSa1iKF
— BCCI (@BCCI) December 6, 2025
టాస్ గెలిచిన తర్వాత కేఎల్ రాహుల్ మాట్లాడుతూ.. “మేము మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాము. నిన్న రాత్రి ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నప్పుడు, రాంచీ, రాయ్‌పూర్ అంత త్వరగా కాకపోయినా, మంచు ప్రభావం ఉంది అని కోచ్ ద్వారా అభిప్రాయం వచ్చింది. మేము ఛేజింగ్ చేసి చూడాలనుకుంటున్నాము. గత రెండు మ్యాచ్‌ల్లో జట్టు ఆడిన తీరు చాలా సంతోషంగా ఉంది” అని తెలిపారు. భారత్ తమ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్థానంలో బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మను తీసుకుంది.
టాస్ ఓడిపోయిన దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా మాట్లాడుతూ.. “మేము కూడా మొదట బౌలింగ్ చేయాలని అనుకున్నాము. మంచి ఆరంభం లభిస్తే మధ్య వరుస బ్యాట్స్‌మెన్‌లకు పని సులువవుతుంది. మేము బోర్డుపై మంచి స్కోరు చేసి, దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాము. ఈరోజు మ్యాచ్ చాలా ముఖ్యమైనది, మేము సరైన ఫలితాన్ని సాధించడానికి మా వంతు కృషి చేస్తాము.” అని పేర్కొన్నారు. దక్షిణాఫ్రికా జట్టు గాయాల కారణంగా నాండ్రే బర్గర్, టోనీ డి జోర్జి స్థానంలో ర్యాన్ రికెల్టన్, ఓట్నీల్ బార్ట్‌మ్యాన్‌ను జట్టులోకి తీసుకుంది.