
India vs Pakistan: ఎన్నో వివాదాల మధ్య భారత్, పాకిస్తాన్ మధ్య ఆసియా కప్ 2025 మ్యాచ్ మొదలైంది. మైదానం వెలుపల ఈ మ్యాచ్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ, మైదానంలో మాత్రం భారత బౌలర్లు తమ ఆధిపత్యాన్ని చూపించారు. ఈ విధ్వంసం స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో మొదలైంది. దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో ఈ మ్యాచ్‌లో టీమిండియా మొదట బౌలింగ్ ఎంచుకుంది. మ్యాచ్ మొదటి అధికారిక బంతికే హార్దిక్ పాండ్యా పాకిస్తాన్ ఓపెనర్ సైమ్ అయూబ్‌ను ఔట్ చేసి మ్యాచ్‌ను అద్భుతంగా ప్రారంభించాడు.
టాస్ గెలిచి.. కష్టాలు కొని తెచ్చుకున్నట్టే!
పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకోవడం తన కాళ్లపై తానే గొడ్డలి పెట్టు వేసుకున్నట్లు అయ్యింది. ఎందుకంటే 2021 తర్వాత దుబాయ్‌లో ముందు బ్యాటింగ్ చేసిన జట్లు గెలిచిన పర్సంటేజీ చాలా తక్కువ. పాకిస్తాన్ తరువాతి సూపర్ స్టార్ ఆటగాడిగా చెప్పుకునే సైమ్ అయూబ్, వరుసగా రెండో మ్యాచ్‌లో గోల్డెన్ డక్ (మొదటి బంతికి సున్నా పరుగులకే ఔట్) అయ్యాడు. అంతకుముందు ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా అతను మొదటి బంతికే ఔటయ్యాడు.
హార్దిక్ మాయ
భారత్ తరఫున మొదటి ఓవర్ వేయడానికి హార్దిక్ పాండ్యా వచ్చాడు. మొదట్నుంచీ అతనికి బంతి స్వింగ్ అవుతోంది. హార్దిక్ వేసిన మొదటి బంతి లెగ్ స్టంప్ వెలుపల వెళ్లడంతో దాన్ని వైడ్ అని ప్రకటించారు. తరువాత అతను వేసిన అధికారిక మొదటి బంతి సైమ్ అయూబ్‌కు ఒక ఉచ్చులా మారింది. పాండ్యా వేసిన బంతి ఆఫ్-స్టంప్ వెలుపల స్వింగ్ అయింది, దానికి అయూబ్ బ్యాట్‌ను అడ్డుపెట్టాడు. బంతి నేరుగా జస్ప్రీత్ బుమ్రా చేతుల్లోకి వెళ్ళింది. దాంతో పాకిస్తాన్ స్కోర్ సున్నా పరుగులకు ఒకటిగా మారింది.
𝗕𝗢𝗢𝗠! 💥
India are tearing through. Pakistan lose their 2nd wicket 🔥
Watch #INDvPAK LIVE NOW on the Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/xqJXwEHqnf
— Sony Sports Network (@SonySportsNetwk) September 14, 2025
తర్వాత ఫఖర్ జమాన్ పెద్ద షాట్ కొట్టే ప్రయత్నంలో ఔటయ్యాడు. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో తిలక్ వర్మ సునాయాసంగా క్యాచ్ పట్టాడు. దీనితో పాకిస్తాన్ జట్టు మరోసారి కష్టాల్లో పడింది. 49రన్స్ దగ్గర 4వ వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ వేసిన బంతిని సిక్స్ కొట్టే ప్రయత్నంలో సల్మాణ్ అలీ అఘా అభిషక్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. 10ఓవర్లు పూర్తయ్యే సరికి పాకిస్తాన్ 4వికెట్లు కోల్పోయి 53పరుగులు చేసింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..