BCCI: గంభీర్‌కు భారీ షాకిచ్చిన బీసీసీఐ! డ్రెస్సింగ్‌ రూమ్‌ లీకు వీరులకు గుడ్ బై..

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా ఘోర పరాభవం తర్వాత, బీసీసీఐ కీలకమైన నిర్ణయం తీసుకుంది. హెడ్ కోచ్ గౌతమ్ గాంభీర్ ఎంచుకున్న అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్, ఫీల్డింగ్ కోచ్ టీ. దిలీప్, ఫిట్‌నెస్ కోచ్ సోహమ్ దేశాయ్ లను తొలగించారు. డ్రెస్సింగ్ రూమ్ లీకులు, పేలవమైన ప్రదర్శన ఈ నిర్ణయానికి కారణమని తెలుస్తోంది.

BCCI: గంభీర్‌కు భారీ షాకిచ్చిన బీసీసీఐ! డ్రెస్సింగ్‌ రూమ్‌ లీకు వీరులకు గుడ్ బై..
Team India Coaching Staff

Updated on: Apr 17, 2025 | 11:58 AM

2024-25 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా పేలవ ప్రదర్శనపై బీసీసీఐ చర్యలు చేపట్టింది. హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ ఎరికోరి తెచ్చుకున్న అసిస్టెంట్ స్టాఫ్‌ నుంచి కీలక వ్యక్తులను తొలగించింది. అసిస్టెంట్‌ కోచ్‌ అభిషేక్ నాయర్, ఫీల్డింగ్‌ కోచ్‌ టీ దిలీప్‌లను తొలగించింది. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో ఫేలవ ప్రదర్శన కనబర్చడంతో దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది భారత క్రికెట్‌ బోర్డు. అభిషేక్ నాయర్ అసిస్టెంట్‌గా బాధ్యతలు చేపట్టిన 8 నెలలకే ఈ జాబ్‌ను కోల్పోయారు.

అయితే అభిషేక్‌ నాయర్‌పై చర్యలకు కేవలం బీజీటీలో టీమిండియా ప్రదర్శనే కారణం కాదని తెలుస్తోంది. డ్రెస్సింగ్ రూమ్ లీక్‌లతో సహా అంతర్గత సమస్యలు కూడా అతన్ని తొలగించేందుకు కారణం అయినట్లు సమాచారం. ఇక ఫీల్డింగ్ కోచ్ టీ.దిలీప్, స్ట్రెంగ్త్ అండ్‌ కండిషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్‌లను కూడా వారి వారి బాధ్యతల నుంచి బీసీసీఐ తొలగించింది. వీరిద్దరు టీమిండియాతో మూడేళ్లుగా పనిచేస్తున్నారు. కాగా.. వీరి తొలగింపులకు డ్రెస్సింగ్‌ రూమ్‌ లీకులతో సంబంధం లేదని తెలుస్తోంది. అయితే వీరిని తొలగిస్తున్నట్లు ప్రకటించిన బీసీసీఐ, మరి వీరి ప్లేస్‌లో ఎవరిని తీసుకుంటారో వెల్లడించలేదు.

ప్రస్తుతం జట్టు సెటప్‌లో ఉన్న సీతాన్షు కోటక్ తన పాత్రలో కొనసాగుతాడు. దిలీప్ స్థానంలో ర్యాన్ టెన్ డస్కటే ఫీల్డింగ్ కోచ్ విధులను నిర్వహిస్తారని తెలుస్తోంది. ఫిట్‌నెస్ అండ్‌ కండిషనింగ్ కోసం, ప్రస్తుతం పంజాబ్ కింగ్స్‌తో ఉన్న అడ్రియన్ లె రౌక్స్, దేశాయ్ స్థానాన్ని భర్తీ చేస్తారని సమాచారం. కాగా భారత జట్టు జూన్ 20 నుండి ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కి ముందు ఈ తొలగింపులు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మరి తాను ఏరి కొరి తెచ్చుకున్న స్టాఫ్‌లో కొంతమందిని బీసీసీఐ తొలగించడంపై హెడ్‌ కోచ్ గౌతమ్‌ గంభీర్‌ ఎలా స్పందిస్తాడో చూడాలి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి.