ప్రపంచకప్‌లో వరుసగా రెండు విజయాలతో జోరు మీద ఉన్న టీమిండియాకు వరుణుడు బ్రేక్ వేశాడు. ట్రెంట్‌బ్రిడ్జి వేదికగా ఇవాళ న్యూజిలాండ్‌తో జరగాల్సిన మ్యాచ్‌కు వరుణుడు అడ్డుపడి.. పూర్తిగా వర్షార్పణం చేశాడు. మధ్య మధ్యలో కాస్త గ్యాప్ ఇస్తూ.. మళ్ళీ కుండపోతుగా వర్షం కురవడంతో గ్రౌండ్ మొత్తం చిత్తడి.. చిత్తడిగా మారింది. దీంతో చేసేదేమి లేక అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేసి ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. కాగా ప్రపంచకప్‌లో రద్దైన మ్యాచ్‌ల సంఖ్య ఇప్పుడు నాలుగుకు చేరింది. ఇక భారత్.. తన తదుపరి మ్యాచ్ ను ఈనెల 16న పాకిస్థాన్ తో తలబడనుంది.