హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జింబాబ్వేతో జరిగిన మూడో వన్డేలో 13 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. విజయతీరాలకు చేర్చేందుకు జింబాబ్వే బ్యాటర్ సికిందర్ రజా(115) చివరి వరకు పోరాటం ఫలించలేదు. 290 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన జింబాబ్వే 49.3 ఓవర్లలో 276 పరుగులకు ఆలౌటైంది. జింబాబ్వే బ్యాటర్లలో సికిందర్ రజా(115) సెంచరీతో చెలరేగిపోయాడు. విలియమ్స్ 45 పరుగులతో రాణించాడు. టీమిండియా బౌలర్లలో అవేష్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టగా.. దీపక్ చహర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు తీసుకున్నారు.
ఈ ఏడాది చివరిసారిగా తలపడేందుకు వచ్చిన భారత్, జింబాబ్వే జట్ల మధ్య ఈ ఏడాది తీవ్ర పోటీ నెలకొంది. టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ మరోసారి టాస్ గెలిచాడు. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. జింబాబ్వేతో నామమాత్రపు ఆఖరి వన్డేలో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. టాస్ గెలిచిన భారత్‌కు ఓపెనర్లు శిఖర్ ధావన్(40 పరుగులు), కేఎల్ రాహుల్(30 పరుగులు) శుభారంభం అందించారు. వన్‌డౌన్‌లో వచ్చిన శుబ్‌మన్ గిల్ 97 బంతుల్లో 15 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 130 పరుగులు చేశాడు.
భారత బ్యాటర్లలో గిల్(130 పరుగులు) సెంచరీతో మెరవగా.. ఇషాన్ కిషన్(50), ధావన్(40) పరుగులతో రాణించారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఎవాన్స్ 5 వికెట్లు పడగొట్టగా.. న్యౌచీ, జోంగ్వే తలా వికెట్ సాధించారు.
That’s that from the final ODI.
A close game, but it was #TeamIndia who win by 13 runs and take the series 3-0 #ZIMvIND pic.twitter.com/3VavgKJNsS
— BCCI (@BCCI) August 22, 2022
భారత జట్టును శుభ్‌మన్ గిల్ హ్యాండిల్ చేశాడు. వెస్టిండీస్ పర్యటన నుంచి నిలకడగా పరుగులు సాధిస్తున్న గిల్ మరోసారి అదే చేశాడు. ముందుగా టీమిండియా ఇన్నింగ్స్ కు పేస్ అందించిన అతడు ఆ తర్వాత పరుగుల వర్షం కురిపించాడు. ఈ సమయంలో, గిల్ స్వయంగా అర్ధ సెంచరీ చేసిన ఇషాన్ కిషన్‌తో కలిసి 140 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నాడు.
వెస్టిండీస్‌లో కేవలం 2 పరుగుల తేడాతో సెంచరీ కోల్పోయిన గిల్.. ఈసారి ఈ అడ్డంకిని దాటగలిగాడు. 23 ఏళ్ల గిల్ తన అంతర్జాతీయ కెరీర్‌లో తొలి సెంచరీని కేవలం 82 బంతుల్లో పూర్తి చేశాడు.