తుఫాన్ బ్యాటింగ్‌కు కేరాఫ్ అడ్రస్.. సెహ్వాగ్‌కి రీప్లేస్ అంటూ పొగడ్తలు.. అయినా ఛాన్సివ్వని బీసీసీఐ.. ఎవరో గుర్తుపట్టారా?

|

Jan 29, 2022 | 7:25 AM

IND vs WI: వెస్టిండీస్ పర్యటనలోనూ చోటు దక్కకపోవడంపై అసహనానికి గురైన ఓ టీమిండియా ప్లేయర్ తన బాధను వీడియో రూపంలో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో సందడి చేస్తోంది.

తుఫాన్ బ్యాటింగ్‌కు కేరాఫ్ అడ్రస్.. సెహ్వాగ్‌కి రీప్లేస్ అంటూ పొగడ్తలు.. అయినా ఛాన్సివ్వని బీసీసీఐ.. ఎవరో గుర్తుపట్టారా?
Team India Cricketer
Follow us on

Indian Cricket Team: తొలి టెస్టు మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన బ్యాట్స్‌మెన్. టీమిండియా(Team India)కు మరో వీరేంద్ర సెహ్వాగ్ అంటూ పోల్చారు. ఈ రోజు అదే బ్యాట్స్‌మెన్ టీమిండియా(Indian Cricket Team)కు దూరంగా ఉండడమే కాదు, అతని ఎంపికపై చాలా సందిగ్ధాలు వినిపిస్తున్నాయి. చాలా ప్రతిభ ఉన్నా సెలక్టర్లు మాత్రం జట్టుకు దూరంగానే ఉంచుతున్నారు. స్వదేశంలో జరిగిన న్యూజిలాండ్ సిరీస్‌లోనూ చోటు ఇవ్వలేదు. అలాగే దక్షిణాఫ్రికా(IND vs SA) వెళ్లిన జట్టలోనూ ఎంపిక చేయలేదు. తాజాగా వెస్టిండీస్‌తో (India vs West Indies) జరిగే వన్డే, టీ20 సిరీస్‌ల్లోనూ ఈ ఆటగాడికి అవకాశం ఇవ్వలేదు. చాలా మంది కొత్త ఆటగాళ్లు జట్టులోకి వచ్చారు. కొందరు సీనియర్లు కూడా జట్టులోకి తిరిగి వచ్చారు. కానీ, సెలెక్టర్ మాత్రం ఈ ఆటగాడిపై మౌనం వహిస్తున్నారు. దీంతో వెస్టిండీస్ సిరీస్ కోసం టీమిండియా ఎంపిక తర్వాత, ఈ ఓపెనర్ ఓ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

దీంతో సోషల్ మీడియాలో ఈ వీడియో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ– స్టాండింగ్ ఎలోన్ అనే క్యాప్షన్ అందించాడు ఈ ఆటగాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అతడి ప్రతిభకు టీమిండియాలో చోటు దక్కకపోవడంపై విమర్శలు గుప్పిస్తున్నారు. తుఫాన్ ఇన్నింగ్స్‌లతో అద్భుత ఆరంభాలు అందించే ఇలాంటి ప్లేయర్‌కు అవకాశాలు ఇవ్వకపోతే ఎలా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో ఏంటి బ్రో అప్పుడే రిటైర్మెంట్ ప్రకటిస్తున్నావా అంటూ కామెంట్లు చేశారు. ఆ ఆటగాడు ఎవరంటే.. టీమిండియా ఓపెనర్ పృథ్వీ షా.. వెస్టిండీస్‌ పర్యటనకు ఎంపిక కాకపోవడంతో అసహనంతో తన బాధను వీడియో రూపంలో పంచుకున్నాడు. తన అండర్-19 ప్రపంచ కప్ నుంచి టెస్ట్ అరంగేట్రం వరకు కొన్ని ఫొటోలను కలిపి ఓ వీడియోను నెట్టింట్లో పంచుకున్నాడు. పృథ్వీ షా బాధ ఈ వీడియోలు తెలుస్తుంది. బహుశా సెలెక్టర్లు తనకు అవకాశం ఇవ్వనందుకు పృథ్వీ షా ఎంతో బాధపడుతూ నెట్టింట్లో వీడియోను పంచుకున్నాడంటూ నెటిజన్లు అంటున్నారు.

శ్రీలంక టూర్‌లో అవకాశం..
గతేడాది శ్రీలంక పర్యటనకు పృథ్వీ షా టీమిండియాతో కలిసి వెళ్లాడు. అక్కడ అతను వన్డే, టీ20 జట్లలో భాగమయ్యాడు. ఆ సిరీస్‌లో షా తన టీ20 అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. మొదటి బంతికే అవుట్ అయ్యాడు. అయితే వన్డే సిరీస్‌లో మాత్రం ధీటుగా బ్యాటింగ్ చేశాడు. షా 6 వన్డేలలో 31.50 సగటుతో 189 పరుగులు చేశాడు. అందులో అతని స్ట్రైక్ రేట్ 110 కంటే ఎక్కువగా ఉండడం విశేషం. అదే సమయంలో, ఈ బ్యాట్స్‌మెన్ భారత్ తరఫున 5 టెస్టుల్లో 42.37 సగటుతో 339 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి.

అయితే, పృథ్వీ షాకు మళ్లీ పునరాగమనం చేసే అవకాశాలు ఉన్నాయి. IPL 2022 కోసం ఢిల్లీ క్యాపిటల్స్ అతనిని రిటైన్ చేసుకుంది. టోర్నమెంట్‌లో బాగా రాణిస్తే, అతను తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. పృథ్వీ షాకు ఇబ్బంది ఏమిటంటే, టీమిండియాలో ఇప్పటికే అద్భుతమైన ఓపెనర్లు ఉన్నారు. ఇందులో కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్‌కు తోడు ప్రస్తుతం రీతురాజ్ గైక్వాడ్ కూడా టీమిండియాలోకి ప్రవేశించాడు.

Also Read: BPL: 64 బంతుల్లో 111 పరుగులు.. ప్రత్యర్థి టీం భారీ స్కోర్ చేసినా.. తుఫాన్ సెంచరీతో తుస్సుమనిపించాడు..

Rohith Sharma: రోహిత్ శర్మను టెస్ట్ కెప్టెన్‌ చేయాలి.. కానీ అతనికి ఫిట్‌నెసే పెద్ద సమస్య..