Virat Kohli 100th Test: కోహ్లీ స్పెషల్ టెస్టుపై ఎందుకంత వివక్ష.. కావాలనే బీసీసీఐ అలా చేస్తోదంటూ ఫైరవుతోన్న ఫ్యాన్స్..

|

Mar 01, 2022 | 7:37 PM

Virat Kohli vs BCCI: గత కొంత కాలంగా విరాట్ కోహ్లీ, బీసీసీఐ మధ్య వివాదం నడుస్తోంది. ఇరువర్గాల నుంచి అనేక తీవ్ర ఆరోపణలు వస్తూనే ఉన్నాయి.

Virat Kohli 100th Test: కోహ్లీ స్పెషల్ టెస్టుపై ఎందుకంత వివక్ష.. కావాలనే బీసీసీఐ అలా చేస్తోదంటూ ఫైరవుతోన్న ఫ్యాన్స్..
Ind Vs Sl Virat Kohli 100th Test
Follow us on

మార్చి 4 నుంచి మొహాలీలో భారత్ -శ్రీలంక (India vs Sri Lanka) మధ్య టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌ చాలా విషయాల్లో కీలకంగా మారింది. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) కెరీర్‌లో ఇది 100వ టెస్టు మ్యాచ్ కానుండగా, అలాగే శ్రీలంకకు ఇది 300వ టెస్టు మ్యాచ్‌గా నిలవనుంది. అయితే మొహాలీలో జరగనున్న ఈ మ్యాచ్‌పై భారత క్రికెట్ బోర్డు అంటే బీసీసీఐ(BCCI) ప్రవర్తనతో విరాట్ ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. కండీషన్లపై కండీషన్లు పెడుతూ, ఈ స్పెషల్ మ్యాచ్‌పై ఆసక్తిని తగ్గిస్తున్నారంటూ మండిపడుతున్నారు. కారణం- మ్యాచ్ చూసేందుకు మైదానానికి వెళ్లే ప్రేక్షకులపై నిషేధం విధించడమే కారణంగా నిలుస్తోంది. మొహాలీ వేదికగా భారత్-శ్రీలంక మధ్య తొలి టెస్టు ప్రేక్షకులు లేకుండా జరగనుంది. దీంతో సోషల్ మీడియాలో నిత్యం ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బీసీసీఐ ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తోందని విమర్శలు గుప్పిస్తున్నారు. పంజాబ్‌లో ఎన్నికటలు ఉన్నప్పుడు బెంగళూరులో తొలి టెస్టు నిర్వహించొచ్చు కదా అంటూ ఆరోపణలు చేస్తున్నారు.

బీసీసీఐ ఆదేశాల మేరకు తొలి టెస్టు ప్రేక్షకులు లేకుండానే జరుగుతుందని పంజాబ్ క్రికెట్ సంఘం ఇటీవల ప్రకటించింది. పీసీఏ కోశాధికారి ఆర్‌పీ సింగ్లా పీటీఐతో మాట్లాడుతూ, “బీసీసీఐ (క్రికెట్ బోర్డ్ ఆఫ్ ఇండియా) మార్గదర్శకాల ప్రకారం, డ్యూటీలో ఉన్నవారికి కాకుండా ఇతర టెస్ట్ మ్యాచ్‌లకు సాధారణ ప్రేక్షకులను అనుమతించరు. ఈ నిర్ణయానికి కారణం కరోనా కేసులేనని పేర్కొంటున్నారు. అలాగే మార్చి 10న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కారణంగా రాష్ట్ర ప్రభుత్వం భద్రతా ఏర్పాట్ల విషయంలో కసరత్తు చేసిందని చెప్పుకొస్తున్నారు. వీటన్నింటి కారణంగా మొహాలీలో జరిగే టెస్టుకు ప్రేక్షకులు లేకుండా పోయారు.

బెంగళూరు టెస్టుకు ఓకే..
మొహాలీ టెస్టుకు ముందు ధర్మశాలలో జరిగిన టీ20 మ్యాచ్‌లో ప్రేక్షకుల సందడి కనిపించింది. ఇక బెంగుళూరులో జరిగే రెండో టెస్టులో కూడా ప్రేక్షకుల సందడి కనిపించనుంది. అయితే మొహాలీలో ప్రేక్షకుల సందడి కొనసాగే అవకాశం ఉందని ముందు వార్తలు వచ్చాయి. పూర్తి సామర్థ్యాన్ని కొనసాగించకపోయినా. 50 శాతం లేదా 25 శాతం ప్రేక్షకులను అనుమతించవచ్చని తెలిసింది. కానీ, ఎన్నికల కారణంగా తగిన భద్రత కోసం స్డేడియంలోకి ప్రేక్షకుల రాకపై నిషేధం విధించారు.

కోహ్లి 100వ టెస్టును గుర్తుండిపోయేలా చేసేందుకు పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ సన్నాహాలు చేసింది. టెస్టుకు ముందు కోహ్లీని సన్మానించనున్నారు. దీంతో పాటు నగరంలోని పలు చోట్ల కోహ్లీ హోర్డింగ్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే కొన్నింటిని ఏర్పాటు చేశారు.

Also Read: Aus vs Pak: ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ముందు పాకిస్థాన్‌కు ఎదురు దెబ్బ.. హరీస్ రౌఫ్‌కు కరోనా నిర్ధారణ..

IND vs SL: టీ20లో అలా చేయడం పెద్ద క్రైమ్.. ఒత్తిడికి వెల్కం చెబితే కెరీర్ ప్రమాదంలో పడ్డట్లే: శ్రేయాస్ అయ్యర్