IND vs SA: విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. 7 ఏళ్ల తర్వాత 2వ ‘హ్యాట్రిక్’..?

IND vs SA: భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగే వన్డే సిరీస్ చివరి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఒక పెద్ద రికార్డును సృష్టించవచ్చు. అతను చివరిసారిగా 2018లో సాధించిన ఈ ఘనతను సాధించాడు. మరోసారి సాధించాలంటే వైజాగ్ మ్యాచ్‌లో భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంటుంది.

IND vs SA: విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. 7 ఏళ్ల తర్వాత 2వ హ్యాట్రిక్..?
Virat Kohli

Updated on: Dec 05, 2025 | 1:47 PM

IND vs SA: భారత్, దక్షిణాఫ్రికా మధ్య విశాఖపట్నం వేదికగా జరగనున్న మూడో వన్డే మ్యాచ్ అత్యంత ఆసక్తికరంగా మారింది. సిరీస్ 1-1తో సమంగా ఉండటంతో ఈ మ్యాచ్ నిర్ణయాత్మకంగా మారడమే కాకుండా, విరాట్ కోహ్లీకి ఒక అరుదైన రికార్డును నెలకొల్పే అవకాశం ఉంది.

7 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ మ్యాజిక్?

కింగ్ కోహ్లీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ సిరీస్‌లో ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్‌లలో వరుసగా రెండు సెంచరీలు (మొదటి మ్యాచ్‌లో 135 పరుగులు, రెండో మ్యాచ్‌లో 102 పరుగులు) సాధించాడు. ఇప్పుడు విశాఖపట్నంలో జరగబోయే మూడో మ్యాచ్‌లో కూడా సెంచరీ చేస్తే, కోహ్లీ వన్డే క్రికెట్‌లో ‘హ్యాట్రిక్ సెంచరీలు’ (వరుసగా మూడు మ్యాచ్‌లలో మూడు సెంచరీలు) సాధించిన ఘనతను సొంతం చేసుకుంటాడు.

గతంలో 2018లో వెస్టిండీస్‌పై కోహ్లీ ఈ ఘనతను సాధించాడు. అప్పుడు వరుసగా మూడు సెంచరీలు బాదిన విరాట్, ఇప్పుడు మళ్లీ అదే రికార్డును పునరావృతం చేసే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

బాబర్ ఆజం సరసన కోహ్లీ?

వన్డే క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు పాకిస్థాన్ ఆటగాడు బాబర్ ఆజం మాత్రమే రెండుసార్లు ‘హ్యాట్రిక్ సెంచరీలు’ (2016, 2022లో) సాధించాడు. ఒకవేళ కోహ్లీ ఈ మ్యాచ్‌లో శతకం బాదితే, బాబర్ ఆజం తర్వాత ఈ ఘనతను రెండుసార్లు సాధించిన రెండో ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు.

విశాఖతో ప్రత్యేక అనుబంధం:

విశేషమేమిటంటే, 2018లో కోహ్లీ వెస్టిండీస్‌పై హ్యాట్రిక్ సెంచరీలు చేసినప్పుడు, అందులో ఒక సెంచరీ (నాటౌట్ 157 పరుగులు) ఇదే విశాఖపట్నం మైదానంలో నమోదైంది. ఇప్పుడు 7 ఏళ్ల తర్వాత అదే మైదానంలో మరోసారి చరిత్ర సృష్టించే అవకాశం కోహ్లీకి రావడం విశేషం.

ఫామ్‌లో ఉన్న కోహ్లీని అడ్డుకోవడం దక్షిణాఫ్రికా బౌలర్లకు సవాలుగా మారనుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ చెలరేగి భారత్‌కు సిరీస్ విజయాన్ని అందిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.

మరన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..