IND vs SA: గాయంతో 2వ టెస్ట్ నుంచి శుభ్మన్ గిల్ ఔట్.. కట్‌చేస్తే.. లక్కీ ఛాన్స్ కొట్టేసిన ధోని ఫ్రెండ్?

వైద్యులు గిల్ ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అతను త్వరగా కోలుకుని తిరిగి మైదానంలోకి వస్తాడని ఆశిస్తున్నారు. గిల్ మెడ పట్టేయడంపై అసిస్టెంట్ కోచ్ మోర్నీ మోర్కెల్ మాట్లాడుతూ, రాత్రి సరిగా నిద్రపోకపోవడం వల్ల అతనికి ఈ సమస్య వచ్చి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.

IND vs SA: గాయంతో 2వ టెస్ట్ నుంచి శుభ్మన్ గిల్ ఔట్.. కట్‌చేస్తే.. లక్కీ ఛాన్స్ కొట్టేసిన ధోని ఫ్రెండ్?
Shubman Gill

Updated on: Nov 16, 2025 | 11:55 AM

India vs South Africa, 1st Test: సౌత్ ఆఫ్రికాతో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న తొలి టెస్ట్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అకస్మాత్తుగా గాయపడ్డాడు. శనివారం మ్యాచ్ రెండో రోజు, ఆఫ్రికా స్పిన్నర్ సైమన్ హార్మర్ బంతిని స్లాగ్ స్వీప్ చేసిన తర్వాత కెప్టెన్ గిల్ (shubman gill)కు అకస్మాత్తుగా మెడలో నొప్పి అనిపించింది. వెంటనే ఫిజియోను మైదానంలోకి పిలిచారు.

మొదట్లో పరిస్థితి సాధారణంగా అనిపించినప్పటికీ, రోజు ఆట ముగిసే సమయానికి గిల్‌ను ఐసీయూలో చేర్చాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో, రెండో టెస్ట్‌లో ఆడనున్న శుభ్‌మన్ గిల్ స్థానంలో వచ్చే ఆటగాడి పేరు వెల్లడైంది.

ఇవి కూడా చదవండి

శుభ్‌మన్ గిల్‌కు గాయం ఎలా అయింది?

శనివారం కోల్‌కతా టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన శుభ్‌మన్ గిల్, హార్మర్ ఓవర్‌లోని ఐదో బంతిని బ్యాక్‌వర్డ్ స్క్వేర్ వైపు స్లాగ్ స్వీప్ చేశాడు. గిల్ బ్యాట్‌ను చాలా వేగంగా తిప్పడంతో అతని మెడలో అకస్మాత్తుగా నొప్పి మొదలైంది. వెంటనే ఫిజియోను మైదానంలోకి పిలవాల్సి వచ్చింది.

కొంత సమయం పరిశీలించిన తర్వాత గిల్ మైదానం నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది. నివేదికల ప్రకారం, సాయంత్రానికి గిల్ పరిస్థితి మరింత దిగజారింది. దీంతో అతన్ని ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం అతన్ని ఐసీయూలో ఉంచారు.

అసలు కారణం చెప్పిన మోర్నీ మోర్కెల్..

వైద్యులు గిల్ ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అతను త్వరగా కోలుకుని తిరిగి మైదానంలోకి వస్తాడని ఆశిస్తున్నారు. గిల్ మెడ పట్టేయడంపై అసిస్టెంట్ కోచ్ మోర్నీ మోర్కెల్ మాట్లాడుతూ, రాత్రి సరిగా నిద్రపోకపోవడం వల్ల అతనికి ఈ సమస్య వచ్చి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.

అయితే, ఇది కేవలం అతని అంచనా మాత్రమే, ఎందుకంటే షాట్ కొట్టిన తర్వాత గిల్‌కు అకస్మాత్తుగా మెడ పట్టేయడానికి అసలు కారణం ఇంకా తెలియరాలేదు. మెడికల్ టీమ్ దీనిని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తోంది.

ఈ ఆటగాడిని రీప్లేస్ చేసే ఛాన్స్..

భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మెడ గాయాన్ని బట్టి చూస్తే, రెండో టెస్ట్‌లోకి అతని పునరాగమనం చాలా కష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే, గిల్ ప్రస్తుతం ఐసీయూలో ఉన్నాడు. అతని పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

అందువల్ల, శుభ్‌మన్ గిల్ రెండో టెస్ట్ నుంచి తప్పుకుంటే, అతని స్థానంలో రైట్-హ్యాండ్ బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్‌ను జట్టులో చేర్చుకోవచ్చు.

వాస్తవానికి, గైక్వాడ్ దేశీయ క్రికెట్‌లో మహారాష్ట్ర తరపున నంబర్ నాలుగు స్థానంలో బ్యాటింగ్ చేస్తున్నాడు. అతని ప్రస్తుత ఫామ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ పరిస్థితుల్లో గైక్వాడ్, శుభ్‌మన్ గిల్‌కు సరైన రీప్లేస్‌మెంట్ కావొచ్చు.

దేశీయ క్రికెట్‌లో పరుగుల సునామీ..

రైట్-హ్యాండ్ బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్ ఇటీవల సౌత్ ఆఫ్రికా-ఏతో ఆడిన అనధికారిక వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో 117 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇతర బ్యాట్స్‌మెన్స్ 40 పరుగుల మార్కును కూడా దాటలేని సమయంలో గైక్వాడ్ ఈ ఇన్నింగ్స్ ఆడాడు.

అలాగే, రంజీ ట్రోఫీ 2025-26 ఎడిషన్‌లో అతను మొదట కేరళపై 91, 55 పరుగులు చేశాడు. ఇక చండీగఢ్‌పై అతని బ్యాట్ నుంచి 116 పరుగుల అద్భుతమైన సెంచరీ ఇన్నింగ్స్ వచ్చింది. ఆపై రెండో ఇన్నింగ్స్‌లో అజేయంగా 36 పరుగులు చేశాడు.

గైక్వాడ్ ప్రస్తుత ప్రదర్శన చాలా అద్భుతంగా ఉంది. అందుకే గిల్ స్థానంలో అతను బలమైన పోటీదారుగా పరిగణిస్తున్నారు. రెండో టెస్ట్ గువాహటిలోని బర్సపరా స్టేడియంలో నవంబర్ 22 నుంచి 26 వరకు జరుగుతుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..