న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో బ్యాటర్లు అద్భుతంగా రాణించినప్పటికీ.. బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు చివర్లో వచ్చిన ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ మెరుపు ఇన్నింగ్స్ హైలైట్‌గా నిలిచిందని చెప్పొచ్చు.
టీమిండియా ఇన్నింగ్స్‌లో ఏడో నెంబర్‌లో బ్యాటింగ్‌కు బ్యాటింగ్‌కు వచ్చిన సుందర్ కేవలం 16 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు సాధించాడు. ఏమాత్రం భయం, బెరుకు చూపించకుండా.. ఆకాశమే హద్దుగా అద్భుతమైన షాట్స్‌తో చెలరేగిపోయాడు. అలాగే ఈ ఇన్నింగ్స్‌తో ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. న్యూజిలాండ్ గడ్డపై అత్యంత వేగంగా 30 పరుగులు చేసిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. అంతకముందు 2009లో బ్లాక్ క్యాప్స్‌పై 18 బంతుల్లో 38 పరుగులు సురేష్ రైనా చేయగా.. ఇప్పుడు ఆ రికార్డును సుందర్ బ్రేక్ చేశాడు. కాగా, భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే నవంబర్ 27న హామిల్టన్ వేదికగా జరగనుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం