Highest Successful Run Chases at Wankhede Stadium: ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే మూడో టెస్టు మ్యాచ్‌లో రెండు రోజుల ఆట ముగిసింది. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. దీంతో భారత్‌పై 143 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఈ టెస్ట్ మ్యాచ్‌లో భారత్ విజయాన్ని అందుకోవడానికి, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌కు చేరుకోవడానికి రేసులో ఉండాలంటే న్యూజిలాండ్‌పై ఏ టార్గెట్ అయినా ఛేదించాల్సిందే.
అయితే, ముంబైలో నాలుగో ఇన్నింగ్స్ ఆడడం అంత ఈజీ కాదు. ఎందుకంటే, ఇక్కడి పిచ్ బ్యాటర్లకు ఇబ్బందులు కలిగిస్తోంది. బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టు 143 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ టార్గెట్ పెరుగుతున్నా కొద్దీ టీమిండియాకు ఛేజింగ్ కష్టంగా మారుతుంది.
2000లో భారత్‌పై 163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన దక్షిణాఫ్రికాకు ఈ వేదికపై అత్యధిక పరుగుల ఛేజింగ్ రికార్డు ఉంది. ఒక జట్టు 100 ప్లస్ లక్ష్యాన్ని సాధించిన ఏకైక సందర్భం ఇదే కావడం గమనార్హం. 1984లో ఇంగ్లండ్‌పై 51 పరుగులకే ఆతిథ్య జట్టు లక్ష్యాన్ని ఛేదించింది.
దక్షిణాఫ్రికా 164/6 vs భారతదేశం (2000)
ఇంగ్లండ్ 98/0 vs భారతదేశం (1980)
ఇంగ్లండ్ 58/0 vs భారతదేశం (2012)
భారత్ 51/2 vs ఇంగ్లాండ్ (1984)
ఆస్ట్రేలియా 47/0 vs భారతదేశం (2001).
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..