IND vs NZ 1St t20I : పోరాడి ఓడిన భారత్.. తొలి టీ20లో న్యూజిలాండ్ విజయం

హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ భారత్ ను ఓడించింది.  177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 155 పరుగులు చేసింది.

IND vs NZ 1St t20I : పోరాడి ఓడిన భారత్.. తొలి టీ20లో న్యూజిలాండ్ విజయం
Ind Vs Nz

Updated on: Jan 27, 2023 | 10:54 PM

న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్ లో భారత్ కు ఓటమి తప్పలేదు. న్యూజిలాండ్‌ జరిగిన తొలి టీ20లో భారత్ 21 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ భారత్ ను ఓడించింది.  177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 155 పరుగులు చేసింది. టీమ్‌ఇండియా బ్యాటర్లలో వాషింగ్టన్‌ సుందర్‌ దూకుడుగా ఆడాడు. 50 పరుగులు చేసిన సుందర్  28 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో చివర్లో దూకుడుగా ఆడినా జట్టును గెలిపించలేకపోయాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ (47; 34 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. కివీస్‌ బౌలర్లలో బ్రాస్‌వెల్, శాంటర్న్, ఫెర్గూసన్‌ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ఇష్‌ సోధి, జాకబ్ చెరో వికెట్ తీశారు.

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి మ్యాచ్ రాంచీ వేదికగా జరిగింది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. రాంచీలోని జేఎస్‌సీఏ స్టేడియంలో తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. దీంతో టీమిండియా ముందు 177 పరుగల టార్గెట్‌ను ఉంచింది. డారిల్ మిచెల్ అత్యధికంగా అజేయంగా 59 పరుగులు చేశాడు. ఓపెనర్ డ్వేన్ కాన్వే 52 పరుగులు చేశాడు. ఫిన్ అలెన్ 35 పరుగులతో భీకర ఇన్నింగ్స్ ఆడాడు.

Loading...
Unable to load recommendations.
Follow Us